Home /News /technology /

DIMMA THIRIGE SMART TVS THESE ARE THE TVS WITH THE BEST FEATURES AVAILABLE FOR RS 30 000 TAKE A LOOK UMG GH

Best Smart TVs: దిమ్మతిరిగే స్మార్ట్ టీవీలు .. రూ.30 వేలలో లభించే బెస్ట్ ఫీచర్స్ టీవీలు ఇవే.. ఓ లుక్కేయండీ..!

 దిమ్మతిరిగే స్మార్ట్ టీవీలు .. రూ 30  వేలలో లభించే బెస్ట్ ఫీచర్స్ టీవీలు

దిమ్మతిరిగే స్మార్ట్ టీవీలు .. రూ 30 వేలలో లభించే బెస్ట్ ఫీచర్స్ టీవీలు

ఇంట్లోనే పెద్ద టీవీ స్క్రీన్‌తో హోమ్ థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే మధ్యతరగతి వారికి 43 అంగుళాల టీవీ (43 Inches TV) బెస్ట్‌ ఆప్షన్‌. ఇండియన్ మార్కెట్‌లో 43 అంగుళాల స్క్రీన్‌ సైజుతో వచ్చే స్మార్ట్ టీవీ (Smart TVs)లు చాలానే అందుబాటులో ఉన్నాయి.

ఇంకా చదవండి ...
ఇంట్లోనే పెద్ద టీవీ(Tv) స్క్రీన్‌తో హోమ్ థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే మధ్యతరగతి వారికి 43 అంగుళాల టీవీ (43 Inches TV) బెస్ట్‌ ఆప్షన్‌. ఇండియన్ మార్కెట్‌లో 43 అంగుళాల స్క్రీన్‌ సైజుతో వచ్చే స్మార్ట్ టీవీ (Smart TVs)లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటిలో రూ.30 వేల ధరల్లో బెస్ట్ స్మార్ట్ టీవీ (Best Smart TVs)లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్‌మీ స్మార్ట్ టీవీ X ఫుల్ HD ధర రూ.21,999
రూ.21,999కే లభించే రియల్‌మీ స్మార్ట్ టీవీ X FHD (Realme Smart TV X FHD) బెజెల్-లెస్ అల్ట్రా బ్రైట్ LED డిస్‌ప్లేతో వస్తుంది. 8.7mm సన్నగా ఉండే ఈ టీవీలో స్టాండర్డ్, వివిడ్, స్పోర్ట్, మూవీ, గేమ్, ఎనర్జీ సేవింగ్, యూజర్ వంటి 7 డిస్‌ప్లే మోడ్‌లు ఉంటాయి. క్రోమా బూస్ట్ టెక్నాలజీతో 400+ నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. అలానే అల్ట్రా-హై బ్రైట్‌నెస్‌ను క్యాప్చర్ చేస్తుంది. 24W డాల్బీ ఆడియో స్టీరియో స్పీకర్‌లతో HQ క్వాలిటీ ఆడియో అందిస్తుంది. పవర్‌ఫుల్ మీడియాటెక్ 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉన్న ఈ టీవీలో ఆల్ ఇన్ వన్ స్మార్ట్ రిమోట్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్ అందించారు.

ఇన్ఫినిక్స్‌ X1 టీవీ ధర రూ.23,999
రూ.23,999కి లభించే ఇన్ఫినిక్స్‌ X1 టీవీ (Infinix X1 TV) హై స్క్రీన్-టు-బాడీ రేషియోతో మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. ఈ 43-అంగుళాల టీవీలో ఇన్-బిల్ట్ 24W స్పీకర్‌ డాల్బీ ఆడియో అందిస్తుంది. ఇన్ఫినిక్స్‌ X1 టీవీ 1GB RAM, 8 GB ROMతో మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్, ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్‌, HDR 10 సపోర్ట్, 400 nits బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఫుల్ HD రూ.22,999
43 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఫుల్ HD (Redmi Smart TV) రూ.22,999కే దొరుకుతుంది. ఇందులో LED ప్యానెల్, వివిడ్ పిక్చర్, డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20W స్పీకర్‌, DTS వర్చువల్: X సపోర్ట్, 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌, Android TV 11, IMDBకి సపోర్ట్ చేసే PatchWall 4 వంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


Hisense A6GE అల్ట్రా HD ధర రూ.26,990
అల్ట్రా వివిడ్ హై కాంట్రాస్ట్ ప్యానెల్‌తో వచ్చే Hisense A6G 4K HDR LED టీవీని రూ.26,990కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్, డాల్బీ అట్మోస్‌తో చక్కటి ఆడియోని పొందొచ్చు. స్టాండర్డ్, థియేటర్, స్పోర్ట్స్, మ్యూజిక్, స్పీచ్, లేట్-నైట్ వంటి విభిన్న సౌండ్ మోడ్‌లు ఇందులో అందించారు. ఇందులో ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్, బిల్ట్-ఇన్‌ గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది.


వన్‌ప్లస్ టీవీ Y సిరీస్ Y1S ఎడ్జ్ ధర రూ.25,999
43 అంగుళాల వన్‌ప్లస్ Y1S (Oneplus Y1S Edge) స్మార్ట్ LED టీవీని రూ.25,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్, 178 వ్యూయింగ్ యాంగిల్‌తో FHD డిస్‌ప్లే ప్యానెల్‌, డాల్బీ అట్మోస్, డాల్బీ సౌండ్ అందించే రెండు 24-వాట్ అవుట్‌పుట్‌ స్పీకర్లు, రెండు HTML పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లతో వస్తుంది. అలానే గూగుల్, అలెక్సా కోసం రిమోట్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను ఆఫర్ చేశారు.
Published by:Mahesh
First published:

Tags: Budget smart tv, Infinix, ONE PLUS, Realme

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు