DIGITAL CURRENCY MARK ZUCKERBERG INTRODUCING OWN DIGITAL CURRENCY IN MARKET EVK
Digital Currency: మార్కెట్లోకి కొత్త డిజిటల్ కరెన్సీ.. ఎవరు ప్రవేశ పెడుతున్నారో తెలుసా..?
(ప్రతీకాత్మక చిత్రం)
Digital Currency | ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ కరెన్సీ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ప్రభుత్వం గుర్తించకున్నా.. చాలా మంది వినియోగిస్తున్నారు. అంతే కాకుండా క్రిప్టో కరెన్సీ లాభాలపై ప్రభుత్వం పన్ను కూడా వేస్తోంది. కేంద్రం కూడా డిజిటల్ కరెన్సీ ప్రవేశపెడుతుందని సమాచారం ఉంది
ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ కరెన్సీ (Digital Currency) డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ప్రభుత్వం గుర్తించకున్నా.. చాలా మంది వినియోగిస్తున్నారు. అంతే కాకుండా క్రిప్టో కరెన్సీ లాభాలపై ప్రభుత్వం పన్ను కూడా వేస్తోంది. కేంద్రం కూడా డిజిటల్ కరెన్సీ ప్రవేశపెడుతుందని సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎంతో పేరు ఉన్న మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) డిజిటల్ కరెన్సీ తెచ్చే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మెటాలో అంతర్గత పనులు వేగంగా జరుగుతున్నాయంటూ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది.
ప్రస్తుతం మెటా గేమింగ్ రంగంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే మరో అడుగు ముందుకు వేసి డిజిటల్ కరెన్సీ వైపు అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సంస్థ పూర్తి చేసినట్టు సమాచారం. మెటా అభివృద్ధి చేస్తున్న డిజిటల్ కరెన్సీ ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ కరెన్సీని జుక్బక్స్గా పిలుస్తున్నట్టు సమాచారం. ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే ముందుగా గేమింగ్ ఇండస్ట్రీ (Gamming Industry) లో లావాదేవీలకు ఉపయోగించాలని మెటా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఎంతో పాపులరైన పిల్లల గేమ్ రోబ్లోక్స్ గేమ్‌లో రోబక్స్ అనే డిజిటల్ కరెన్సీ ఇప్పటికే చలామనీలో ఉంది. జుక్బక్స్ కూడా ముందుగా గేమింగ్‌లో ప్రయోగించి, అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ కామర్స్ (E-Commerce) లో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. గతంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీ తెచ్చేందుకు మెటా ప్రయత్నించింది. ముందుగా లిబ్రా పేరుతో తెస్తారని ప్రచారం జరిగినా చివరకు డైమ్గా పేరు ఖరారు అయ్యింది.
సమస్య ఏమిటీ..
డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చి పాపులర్ చేయడం మెటాకు పెద్ద సమస్య కాకపోవచ్చు.. సంస్థకు ఉన్న మార్కెట్ బ్రాండ్ కరెన్సీకి ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు క్రిప్టో లావాదేవీలపై నిషేధం లేదా కఠినమైన ఆంక్షలు విధించడంతో క్రిప్టో కరెన్సీ (Crypto Currency) ఆలోచన నుంచి మెటా యూ టర్న్ తీసుకుంది. దాని స్థానంలో జుక్బక్స్ పేరుతో డిజిటల్ కరెన్సీ ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కించింది. ఇది కూడా ఏమేరకు విజియవంతం అవుతుందో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.