ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం సరికొత్త ఆప్‌డేట్స్‌ను అందిస్తోంది గూగుల్ (Google). స్మార్ట్‌ఫోన్ యూజర్లతో పాటు ఇతర యూజర్ల కోసం డిజిటల్ కార్ కీ, కొత్త విడ్జెట్లు, గూగుల్ ఫోన్స్‌లో మెమొరీలు, అప్‌డేటెడ్ ఎమోజీ కిచెన్, ప్రైవసీ టూల్ సహ మొత్తం 12 ఫీచర్లు ఈ అప్‌డేట్‌లో (Android Update) ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో హాలీడే సీజన్ సమయంలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. రోజువారీ షెడ్యూల్స్‌కు సంబంధించి వినియోగదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం Family Bell అనే కొత్త టూల్‌ను ఆండ్రాయిడ్ పరిచయం చేయనుంది. వినియోగదారులు ఆండ్రాయిడ్ ఫోన్‌లు, స్పీకర్‌లు, స్మార్ట్ డిస్‌ప్లేల కోసం ఫ్యామిలీ బెల్‌ను సెటప్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన టాస్క్‌లకు సంబంధించి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయవచ్చు. మొక్కలకు నీళ్లు పోయడం లేదా ఇతర ఇంటి పనులకు సంబంధించి ఈ ఫీచర్ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, ఎలా ఉపయోగించవచ్చు అనే దానిపై గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
Jio 1.5GB Data plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే
గూగుల్ ప్లే బుక్స్, యూట్యూబ్ మ్యూజిక్, గూగుల్ ఫొటోస్‌కు సంబంధించి మూడు కొత్త విడ్జెట్లు లాంచ్ చేస్తున్నట్టు బ్లాగ్ పోస్టులో గూగుల్ ప్రకటించింది. యూట్యూబ్ మ్యూజిక్ విడ్జెట్ ఇప్పుడు హోమ్ స్క్రీన్ పైనే ప్లేబ్యాక్ కంట్రోల్స్ ఉంచుంది. గూగుల్ ప్లే బుక్స్ విడ్జెట్ యూజర్లకు బుక్స్ యాక్సెస్ చేసుకోవడం మరింత సులభతరం చేస్తుంది. అలాగే గూగుల్ ఫొటోస్‌కు మెమొరీ ఆప్షన్ రాబోతుంది. ఇది లైబ్రరీలో ఫొటోలను ఆటోమ్యాటిక్‌గా క్యూరేట్ చేస్తుంది.
యాపిల్ కార్‌కీ తరహాలో గూగుల్ డిజిటల్ కార్ కీ తీసుకువస్తున్నట్టు మేలో గూగుల్ ప్రకటించింది. ఆల్ట్రా వైడ్‌బ్యాండ్ (UWB) టెక్నాలజీతో పనిచేసే ఈ కీ ద్వారా జేబుల్లోంచి స్మార్ట్ ఫోన్ బయటకు తీయకుండానే కారును అన్‌లాక్ చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌లో భాగం. మిగిలిన OEMలకు ఇది త్వరలో చేరనుంది. అనుకూలంగా ఉండే BMW కార్లకు పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, సామ్‌సంగ్ గ్యాలెక్సీ S21 ఫోన్ యూజర్లు డిజిటల్ కీ ఉపయోగించవచ్చు.
Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ కొత్త వేరియంట్ వచ్చేసింది... ధర ఎంతంటే
అయితే ప్రస్తుతం ఇది కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ టెక్నాలజీ ఉపయోగించేందుకు యూజర్లు ఆండ్రాయిడ్ ఆటో యాప్ సెట్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు, డ్రైవ్రర్ దృష్టి రోడ్డుపైనే ఉండేలా చూసేందుకు ప్రస్తుతమున్న ఫీచర్లను మరింత మెరుగుపరిచేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఆండ్రాయిడ్ ఆటో ద్వారా మీడియా యాప్స్‌లో నచ్చిన మ్యూజిక్‌ను వేగంగా సెర్చ్ చేసేందుకు వాయిస్ సెర్చ్‌ను కూడా కంపెనీ తీసుకువస్తోంది.
అప్‌డేటెడ్ ఎమోజీ కిచెన్, ప్రైవసీ టూల్స్ వంటివి కూడా ఆండ్రాయిడ్ 12 ఫీచర్లలో ఉండనున్నాయిు. డేటాను యాక్సెస్ చేసుకునేందుకు లేదా మీ తరపున చర్యలు తీసుకునేందుకు అనుమతి ఉన్న యాప్స్ ఎక్కువ సేపు ఉపయోగంలో లేకపోతే ఈ ప్రైవరీ ఆటోమెటిక్‌గా వాటిని ఆఫ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతే కంటే ఎగువ వెర్షన్లు కలిగిన కోట్లాది డివైజ్‌లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. పిక్సెల్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే జీబోర్డ్ కీ బోర్డు ద్వారా రెండు ఎమోజీలను మిక్స్ చేసుకునే వెసులుబాటును సరికొత్త ఎమోజీ కిచెన్ అందిస్తుంది. ఈ అప్‌డేట్స్ అన్ని రానున్న వారాల్లో మొదలుకానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Android 12, Google, Mobile News, Mobiles, Smartphone