హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

DigiLocker: డిజీలాకర్‌లో కొత్త ఫీచర్... మీ నామినీ పేరు యాడ్ చేయొచ్చు ఇలా

DigiLocker: డిజీలాకర్‌లో కొత్త ఫీచర్... మీ నామినీ పేరు యాడ్ చేయొచ్చు ఇలా

DigiLocker: డిజీలాకర్‌లో కొత్త ఫీచర్... మీ నామినీ పేరు యాడ్ చేయొచ్చు ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

DigiLocker: డిజీలాకర్‌లో కొత్త ఫీచర్... మీ నామినీ పేరు యాడ్ చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

DigiLocker | డిజీలాకర్ యాప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇక డిజీలాకర్ అకౌంట్‌లో (DigiLocker Account) నామినీ పేరు యాడ్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ డిజీలాకర్‌లో అందుబాటులోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

డిజీలాకర్... స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఉపయోగకరమైన ఓ యాప్. ఆధార్ కార్డ్ (Aadhaar Card), పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్ డాక్యుమెంట్స్... ఇలా ముఖ్యమైన పత్రాలను స్మార్ట్‌ఫోన్‌లోనే దాచుకోవడానికి ఉపయోగపడే యాప్ ఇది. లక్షలాది మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు డిజీలాకర్ (DigiLocker) యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో డాక్యుమెంట్స్ సేవ్ చేసుకొని అవసరమైన చోట చూపిస్తున్నారు. ఫోన్‌లో ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోటో తీసి చూపిస్తే చెల్లదు. కానీ డిజీలాకర్ యాప్‌లోని డాక్యుమెంట్ చట్టబద్ధంగా చెల్లుతుంది. రైలులో ప్రయాణించేప్పుడు లేదా ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సమయంలో ఇందులోని డాక్యుమెంట్స్ అధికారులకు చూపించొచ్చు.

మీరు కూడా మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజీలాకర్ యాప్ ఇన్‌స్టాల్ చేశారా? ముఖ్యమైన డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నారా? ఇప్పుడు డిజీలాకర్ యాప్‌లోనే మీ నామినీ పేరు కూడా యాడ్ చేయొచ్చు. డిజీలాకర్ అందిస్తున్న కొత్త ఫీచర్ ఇది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది డిజీలాకర్. కొన్ని సింపుల్ స్టెప్స్‌తో నామినీ పేరు యాడ్ చేయొచ్చని తెలిపింది. ఎలాగో తెలుసుకోండి.

Nokia 2660 Flip: నోకియా నుంచి మరో క్లాసిక్ ఫోన్ వచ్చేసింది... పాత జ్ఞాపకాలను గుర్తు చేసే మొబైల్

డిజీలాకర్ యాప్‌లో నామినీ పేరు యాడ్ చేయండిలా

Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజీలాకర్ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.

Step 2- యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ వివరాలతో సైనప్ చేయాలి. ముందుగానే

Step 3- సైనప్ చేస్తే డిజీలాకర్ అకౌంట్‌లో నేరుగా లాగిన్ కావాలి.

Step 4- ఆ తర్వాత మెనూలో నామినీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 5- Add Nominee పైన క్లిక్ చేయాలి.

Step 6- నామినీకి సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Step 7- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Vivo Y35: 16GB ర్యామ్, 128GB స్టోరేజ్, 50MP కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జింగ్... ఈ మొబైల్ ధర రూ.20,000 లోపే

డిజీలాకర్‌లో నామినీ పేరు యాడ్ చేయడం ద్వారా సదరు వ్యక్తి మరణించిన తర్వాత డిజీలాకర్‌ను నామినీ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. డిజీలాకర్ విషయానికి వస్తే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ప్లాట్‌ఫామ్ రూపొందించింది. డిజీలాకర్ ద్వారా పౌరులకు అన్ని రకాల డాక్యుమెంట్స్ జారీ చేస్తోంది.

డిజీలాకర్ యాప్‌లో డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎక్కడైనా, ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేయొచ్చు. డిజీలాకర్ యాప్‌లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ అధికారికమైనవి. వాటిని ఎక్కడైనా అనుమతిస్తారు. డిజీలాకర్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేస్టోర్‌లోనే 5,00,00,000 సార్లకు పైగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేయడం విశేషం. యాపిల్ స్టోర్‌లో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, Digilocker, Driving licence, PAN card

ఉత్తమ కథలు