మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్తకొత్త యాప్స్ ట్రై చేస్తున్నారా? ఈ ఏడాది కూడా యాప్స్ ఎక్కువగా ఉపయోగించారా? మరి మీలాగా ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా ఉపయోగించిన యాప్స్ ఏవో తెలుసా? ఎప్పట్లాగే గూగుల్ బెస్ట్ యాప్స్ (Best Apps) జాబితాను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్‌లో అనేక అవసరాల కోసం యాప్స్ ఉంటాయి. యూజర్లు కొన్ని యాప్స్‌ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటారు. ఇంకొన్ని యాప్స్‌ని కొంతకాలం ఉపయోగించి డిలిట్ చేస్తుంటారు. ప్రతీ ఏటా పాపులర్ అయ్యే యాప్స్ ఉంటాయి. మరి 2021 లో గూగుల్ ప్లే స్టోర్‌లో పాపులర్ అయిన యాప్స్ ఏవో తెలుసుకోండి.
DigiLocker: డిజీలాకర్ యాప్ గురించి పరిచయం అక్కర్లేదు. మీ ఆధార్ కార్డ్ (Aadhaar Card), పాన్ కార్డ్ (PAN Card), డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ భద్రపర్చుకోవడానికి డిజీలాకర్ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో ఉన్న డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో సమానం. రైలు ప్రయాణంలో, ట్రాఫిక్ పోలీసులకు డిజీలాకర్ యాప్‌లోని డాక్యుమెంట్స్ చూపించొచ్చు.
BitClass: గూగుల్ ప్లే స్టోర్‌లో బిట్‌క్లాస్ యాప్ బెస్ట్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది లక్షకు పైగా డౌన్‌లోడ్స్‌తో టాప్‌లో నిలిచింది. ఈ యాప్ ద్వారా యూజర్లు అనేక కోర్సులు నేర్చుకోవచ్చు. పర్సనల్ ఫైనాన్స్, మ్యూజిక్, బేకింగ్ లాంటి అనేక కేటగిరీలకు సంబంధించిన కోర్సులు ఉన్నాయి.
Samsung Galaxy M52 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,500 డిస్కౌంట్... ఆఫర్ 3 రోజులే
Jumping Minds: వేర్వేరు వ్యక్తుల్ని ఒకే ప్లాట్‌ఫామ్ పైకి తీసుకొచ్చే యాప్ జంపింగ్ మైండ్స్. ఒకే తరహా ఆలోచనా విధానం ఉన్న వ్యక్తులు ఇందులో కలుసుకోవచ్చు. ఒకరితో మరొకటు ఛాట్ చేయొచ్చు. తమ కష్టసుఖాలను పంచుకోవచ్చు.
Sortizy: సార్టీజీ కిచెన్ మేనేజ్‌మెంట్, కుకింగ్ యాప్. ఇందులో రెసిరీ స్టేషన్, మీల్ ప్లానర్, గ్రాసరీ మేనేజర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఏ రెసిపీ ట్రై చేయలన్నా ఇందులో చెక్ చేయొచ్చు. ఆ రెసిపీకి కావాల్సిన గ్రాసరీ లిస్ట్ రెడీగా ఉంటుంది.
Evergreen Club: ఎవర్‌గ్రీన్ క్లబ్ సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించిన యాప్. అనేక రకాల టాపిక్స్‌పై చర్చలు, వర్క్‌షాప్స్ లాంటి వివరాలన్నీ ఇందులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లు ఆరోగ్యపరమైన జీవనం సాగించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.
Tecno Spark 8 Pro: రూ.10,000 బడ్జెట్‌లో టెక్నో స్పార్క్ 8 ప్రో రిలీజ్... ఫీచర్స్ ఇవే
Calm: ధ్యానం చేయడానికి, రిలాక్స్ కావడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో స్లీప్ స్టోరీస్, బ్రీతింగ్ ప్రోగ్రామ్స్, మాస్టర్ క్లాసెస్, మ్యూజిక్ లాంటి సెక్షన్స్ ఉంటాయి. మెడిటేషన్ చేసేవారు ఎక్కువగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేస్తుంటారు.
Nova Launcher Prime: స్మార్ట్‌ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్ నచ్చనివారు థర్డ్ పార్టీ లాంఛర్ల కోసం సెర్చ్ చేస్తుంటారు. వీటిలో నోవా లాంఛర్ ప్రైమ్ టాప్‌లో ఉంది. ఫ్రీ వర్షన్‌తో ఈ యాప్ టెస్ట్ చేయొచ్చు. ఫీచర్స్ నచ్చినవారు ప్రైమ్ వర్షన్ తీసుకోవడానికి రూ.100 చెల్లించాలి.
Bobble Keyboard: లైవ్ క్రికెట్ స్కోర్స్, పాప్ టెక్స్‌ట్, స్టిక్కర్స్, గిఫ్స్, ఫాంట్స్, థీమ్స్... వీటన్నింటితీ మీ కీబోర్డ్‌ను కొత్తగా మార్చడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. మీ కీబోర్డ్‌ని పర్సనలైజ్ చేయడానికి ఈ యాప్ డౌన్‌లోడ్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Digilocker, Mobile App, Smartphone, Year Ender