హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Account: థర్డ్ పార్టీ యాప్స్‌లో జీమెయిల్‌తో లాగిన్ అయ్యారా? వెంటనే ఈ పనిచేయండి

Google Account: థర్డ్ పార్టీ యాప్స్‌లో జీమెయిల్‌తో లాగిన్ అయ్యారా? వెంటనే ఈ పనిచేయండి

Google Account: థర్డ్ పార్టీ యాప్స్‌లో జీమెయిల్‌తో లాగిన్ అయ్యారా? వెంటనే ఈ పనిచేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

Google Account: థర్డ్ పార్టీ యాప్స్‌లో జీమెయిల్‌తో లాగిన్ అయ్యారా? వెంటనే ఈ పనిచేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Google Account | గూగుల్ అకౌంట్‌తో థర్డ్ పార్టీ యాప్స్‌లో (Third Party Apps) లాగిన్ అయ్యేవారికి అలర్ట్. మీరు ఆ యాప్స్ ప్రస్తుతం ఉపయోగించకపోతే గూగుల్ అకౌంట్ యాక్సెస్‌ను వెంటనే తొలగించండి. ఎలాగో తెలుసుకోండి.

చాలావరకు ఆన్‌లైన్ అకౌంట్స్‌లో, యాప్స్‌లో లాగిన్ కావాలంటే యూజర్ తమ వివరాలతో రిజిస్టర్ చేయడం తప్పనిసరి. అయితే గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యే అవకాశం కల్పిస్తుంటాయి ఆ ప్లాట్‌ఫామ్స్. ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్స్ (Third Party Apps) ఈ సేవల్ని ఉపయోగిస్తుంటాయి. యూజర్లు కూడా తమ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ కావడం ఈజీ అవుతుంది కాబట్టి కొత్తగా రిజిస్టర్ చేయరు. గూగుల్ అకౌంట్‌తో (Google Account) నేరుగా లాగిన్ అవుతారు. ఇలాంటి సందర్భాల్లో గూగుల్ అకౌంట్‌లో ఉన్న మీ పేరు, ఇతర వివరాలు థర్డ్ పార్టీకి షేర్ అవుతాయి. కొన్ని రోజులు ఆ థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించిన తర్వాత వాటి గురించి మర్చిపోతుంటారు. కానీ ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత వాటికి మీ గూగుల్ అకౌంట్ యాక్సెస్ అలాగే ఉంటుంది.

Nokia T20 vs Realme Pad: రూ.15,000 బడ్జెట్‌లో నోకియా, రియల్‌మీ ట్యాబ్లెట్స్... వీటిలో ఏది బెస్ట్

థర్డ్ పార్టీ యాప్స్‌కు మీ గూగుల్ అకౌంట్ యాక్సెస్ ఇచ్చారంటే మీరూ ఆ థర్డ్ పార్టీ యాప్ యూజర్‌గా మారినట్టే. అయితే ఆ యాప్స్‌పై హ్యాకర్లు దాడి చేస్తే మీ వివరాలు కూడా రిస్కులో ఉన్నట్టే. అందుకే హ్యాకింగ్ లాంటి ముప్పును తప్పించుకోవడానికి యూజర్లు అప్రమత్తంగా ఉండటం అవసరం. అందుకే మీరు గతంలో థర్డ్ పార్టీ యాప్స్‌కు ఇచ్చిన గూగుల్ అకౌంట్ యాక్సెస్‌ను తొలగించాలి. అప్పుడే మీ వివరాలు ఎక్కువ అకౌంట్లతో షేర్ కాకుండా జాగ్రత్తపడొచ్చు. మరి థర్డ్ పార్టీ యాప్స్‌కు గూగుల్ అకౌంట్ యాక్సెస్ ఎలా తొలగించాలో తెలుసుకోండి.

Vivo Y3s: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 లోపే... బ్యాంక్ ఆఫర్ కూడా

మొబైల్‌లో చేయండి ఇలా...


ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

అకౌంట్స్ సెక్షన్‌లో Google సెలెక్ట్ చేయాలి.

ఆ తర్వాత మీ జీమెయిల్ అకౌంట్‌ను సెలెక్ట్ చేయాలి.

ఆ తర్వాత Manage Your Google Account పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Security ఆప్షన్ క్లిక్ చేయాలి.

Third-party apps with account access ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

ఏఏ యాప్స్‌కు మీ గూగుల్ అకౌంట్ యాక్సెస్ ఉందో తెలుసుకోవచ్చు.

మీరు ప్రస్తుతం ఉపయోగించని యాప్స్ ఉన్నట్టైతే వాటి యాక్సెస్ తొలగించాలి.

ఇందుకోసం Remove Access. పైన క్లిక్ చేస్తే చాలు.

Realme Festive Days: రియల్‌మీ ఫెస్టీవ్ డేస్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్

డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో చేయండి ఇలా...


మీ గూగుల్ అకౌంట్‌లో లాగిన్ కావాలి.

ఆ తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే అకౌంట్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Manage your Google account ఓపెన్ చేయాలి.

Security ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

పైన చెప్పినట్టుగా మిగతా స్టెప్స్ ఫాలో కావాలి.

First published:

Tags: Android, Google, Google news, Mobile App

ఉత్తమ కథలు