మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు, వీడియోలను పొరపాటున డిలిట్ చేశారా? అందులో ముఖ్యమైన ఫోటోలు, వీడియోలు ఉన్నాయా? వాటిని తిరిగి ఎలా పొందాలో అర్థం కావట్లేదా? కొన్ని సందర్భాల్లో ఆ ఫోటోలు, వీడియోలను తిరిగిపొందొచ్చు. డిలిట్ చేసిన ఫోటోలు, వీడియోలు తిరిగి పొందేందుకు థర్డ్ పార్టీ యాప్స్ (Third Party Apps), సాఫ్ట్వేర్స్ ఉపయోగించడం అలవాటు. ఇవన్నీ చేసేముందు స్మార్ట్‌ఫోన్‌లోనే ఫోటోలు, వీడియోలు బిన్లో ఉన్నాయేమో చెక్ చేయాలి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ డిలిట్ చేసిన ఫైల్స్‌ని పూర్తిగా తొలగించకుండా కొన్ని రోజుల పాటు బిన్ ఫోల్డర్స్‌లో సేవ్ చేస్తూ ఉంటాయి.
మీరు డిలిట్ చేసిన ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ మొదట బిన్ ఫోల్డర్లోకి వెళ్తాయి. 30 రోజులు లేదా 60 రోజులకు బిన్ ఫోల్డర్లో ఫైల్స్ డిలిట్ అవుతాయి. అంటే ఇక ఆ ఫైల్స్ మీకు అందుబాటులో ఉండవు. అందుకే డిలిట్ చేసిన ఫైల్స్, ఫోటోలను బిన్ ఫోల్డర్లో ఉన్నాయేమో చెక్ చేయాలి. రీసెంట్గా డిలిట్ చేసినట్టైతే బిన్ ఫోల్డర్లో దొరికే అవకాశాలు ఎక్కువ.
WhatsApp Web: స్మార్ట్‌ఫోన్ లేకపోయినా వాట్సప్ వెబ్ ఉపయోగించండి ఇలా
ఇక గూగుల్ ఫోటోస్‌లోకి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలవాటు. మీ గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌లో డిలిట్ చేసిన ఫోటోలు అందులో ఉన్నాయేమో చెక్ చేయాలి. అందులో ఉంటే సింపుల్‌గా డౌన్లోడే చేయొచ్చు. మీరు క్లిక్ చేసిన ఫోటోస్, రికార్డ్ చేసిన వీడియోస్ ఎప్పటికప్పుడు గూగుల్ ఫోటోస్‌లో బ్యాకప్ అండ్ సింక్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలి.
ఒకవేళ మీరు గూగుల్ ఫోటోస్‌లో కూడా ఆ ఫోటోలు, వీడియోలు డిలిట్ చేసినా తిరిగి పొందొచ్చు. గూగుల్ ఫోటోస్‌లో డిలిట్ చేసిన ఫైల్స్ ట్రాష్ ఫోల్డర్లో ఉంటాయి. గత 60 రోజుల్లో డిలిట్ చేసిన ఫోటోలు, వీడియోలు అందులో ఉంటాయి. 60 రోజులు దాటినట్టైతే ట్రాష్ ఫోల్డర్‌లోని ఫైల్స్ డిలిట్ అవుతాయి. ఆ తర్వాత రీస్టోర్ చేయడం సాధ్యం కాదు. గూగుల్ ఫోటోస్‌లో డిలిట్ చేసిన ఫోటోలు రీస్టోర్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Moto G31: అదిరిపోయే ఫీచర్స్‌తో రిలీజ్ అయిన మోటో జీ31... ధర ఎంతంటే
Step 1- మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేయండి.
Step 2- కింద లైబ్రరీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
Step 3- ఆ తర్వాత Trash ఫోల్డర్ సెలెక్ట్ చేయండి.
Step 4- అందులో మీరు గత 60 రోజుల్లో డిలిట్ చేసిన ఫోటోస్, వీడియోస్ కనిపిస్తాయి.
Step 5- రీస్టోర్ చేయాలనుకునే ఫోటోస్, వీడియోస్ సెలెక్ట్ చేయండి.
Step 6- వాటిలో మీకు కావాల్సిన ఫోటోలు, వీడియోలు రీస్టోర్ చేయండి.
Step 7- Restore పైన క్లిక్ చేస్తే ఆ ఫోటోలు, వీడియోలు రీస్టోర్ అవుతాయి.
Step 8- వాటిని గూగుల్ ఫోటోస్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Mobile News, Mobiles, Smartphone