WhatsApp Feature: పొరపాటున వాట్సప్ మెసేజ్ డిలిట్ చేశారా? తిరిగి పొందొచ్చు ఇలా

WhatsApp Feature (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Updates | వాట్సప్‌లో ఏదైనా మెసేజ్‌ను (WhatsApp Message) పొరపాటున డిలిట్ చేశారా? ఆ మెసేజ్ మీకు ముఖ్యమైనదా? డిలిట్ చేసిన వాట్సప్ మెసేజ్ ఎలా రీస్టోర్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
వాట్సప్‌లో వచ్చిన మేసేజ్‌లు, వీడియోలు ఏవైనా కొద్ది రోజులే ఉంటాయి. తరవాత ఆటోమేటిక్ గా వాట్సాప్ వాటిని డిలీట్ చేస్తుంది.అయితే, అటువంటి విలువైన సమాచారం డిలీట్​ అవ్వకుండా ఉండటం కోసం వాట్సాప్​లో ఓ అద్భుతమైన ఫీచర్​ (WhatsApp Feature) అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ పాత మేసేజెస్​, చాట్స్​ స్మార్ట్‌ఫోన్లలో తిరిగి పొందవచ్చు. మన స్మార్ట్ ఫోన్ పోయినా, దొంగలపాలైనా, ఫోన్ పనిచేయకపోయినా ఈ ఫీచర్​ ద్వారా మీ డేటాను (WhatsApp Data) సురక్షితంగా రక్షించుకోవచ్చు. వాట్సాప్ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలోనిగూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్​లలో డేటా సేవ్ చేసుకునేలా ఆఫ్షన్ ఎంచుకోవచ్చు. కొత్త ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకుని, సెటప్ చేసుకోవడం, పాత ఫోన్లలో తిరిగి ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా ఈ సౌకర్యాలనుపొందవచ్చు.

Realme GT Neo 2: రూ.31,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

మీ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ లో డిలీట్ అయిన మేసేజ్ లు తిరిగి పొందడానికి ఈ క్లౌడ్ బ్యాకప్ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. మీరు మేసేజ్​లనుడిలీట్ చేస్తే స్మార్ట్ ఫోన్ నుంచి యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయవచ్చు. తరవాత ఉదయాన్నే మరలా తిరిగి ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా బ్యాకప్ ను పునరుద్దిరించుకోవచ్చు. మీరు ఎంత వరకు బ్యాకప్ చేస్తారో అంత వరకు తిరిగి పొందవచ్చు. అలా బ్యాకప్ చేయని డేటా మాత్రం తిరిగి పొందడం సాధ్యం కాదు.

Moto E40: మోటో ఇ40 సేల్ మొదలైంది... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ధర రూ.8,550 మాత్రమే

మీ డేటా కోసం ఇలా చేయండి


ఒకవేళ, మీరు వాట్సాప్ బ్యాకప్ సేవలు వినియోగించకపోతే, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మీ చాట్ డేటాను బ్యాకప్ ద్వారా నిల్వ చేస్తుంది. ఈ విధానంలో కొత్త డేటా ఓవర్ రైట్ అయ్యే వరకు పాత డేటాను తిరిగిపొందవచ్చు. ఆండ్రాయిడ్ లో డిలీట్ అయిన వాట్సాప్ చాట్ లను పొందడానికి ఫైల్ మేనేజర్ ను ఉపయోగించాలి. దాన్ని ఆండ్రాయిడ్ ఫోల్డర్ కు నావిగేట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా డేటాబేస్ ఫోల్డర్ ను తెరవొచ్చు.

పాత బ్యాకప్​ను రీస్టోర్ చేయాలనుకుంటే పాత ఫోల్డర్ రీనేమ్ చేయడం ద్వారా పొందవచ్చు. ఇలా పేరు మార్చడం ద్వారా లేటెస్ట్ బ్యాకప్ కు ఈ ఫైల్ ఉపయోగించమని వాట్సాప్ కు తెలియజేస్తుంది. పాత డేటా బ్యాకప్ తీసుకున్న తరవాత అన్ని చాట్ మేసేజ్ లను వినియోగిదారులు కోల్పోతారు. కానిఫోన్ ఉపయోగించి డిలీట్ అయిన వాట్సాప్ మేసేజ్ తిరిగి పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే.
Published by:Santhosh Kumar S
First published: