DHANTERAS 2021 AMAZON LAUNCHES DHANTERAS STORE WITH DISCOUNTS ON GOLD COINS AND SILVER COINS SS
Dhanteras 2021: అమెజాన్‌లో ధంతేరాస్ స్టోర్... గోల్డ్ కాయిన్స్‌పై 20 శాతం తగ్గింపు
Dhanteras 2021: అమెజాన్‌లో ధంతేరాస్ స్టోర్... గోల్డ్ కాయిన్స్‌పై 20 శాతం తగ్గింపు
(ప్రతీకాత్మక చిత్రం)
Dhanteras 2021 | ధంతేరాస్ సందర్భంగా బంగారం, వెండి నాణేలు కొందామనుకుంటున్నారా? అమెజాన్ ధంతేరాస్ స్టోర్‌ను (Dhanteras Store) ప్రారంభించింది. గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్‌పై భారీగా తగ్గింపు ఆఫర్ అందిస్తోంది.
ధంతేరాస్ పర్వదినం వచ్చేస్తోంది. నవంబర్ 2న ధంతేరాస్ (Dhanteras) జరుపుకోవడానికి అంతా సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఇ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ప్రత్యేకంగా 'ధంతేరాస్ స్టోర్' ప్రారంభించింది. ఈ స్టోర్‌లో గోల్డ్ కాయిన్స్ (Gold Coins), సిల్వర్ కాయిన్స్ (Silver Coins), ఫెస్టీవ్ జ్యువెలరీ, పూజా వస్తువు, హోమ్ డెకరేటీవ్ ప్రొడక్ట్స్, డిజిటల్ గోల్డ్ లాంటివన్నీ ఉంటాయి. ధంతేరాస్, దీపావళికి సంబంధించిన వస్తువులన్నీ ఈ స్టోర్‌లో కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, కొటక్ బ్యాంక్ కార్డ్స్, రూపే కార్డ్స్‌తో 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ పే లేటర్, బయ్ నౌ పే నెక్స్ట్ మంత్, ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
ఇక ధంతేరాస్ సందర్భంగా గోల్డ్ కాయిన్స్‌పై ఏకంగా 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. వెండి నాణేలపైనా 20 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇక బంగారు నగలు, సిల్వర్ జ్యువెలరీపై 40 శాతం తగ్గింపు లభిస్తుంది. డైమంట్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలు 0 శాతం నుంచి ఉండటం విశేషం. గోల్డ్ బ్రాండ్ వోచర్లపై 3 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఇక దీపావళి సందర్భంగా ఇంటిని అలంకరించాలనుకునేవారికి ప్రత్యేకమైన ఆఫర్స్ ఉన్నాయి. దేవతల విగ్రహాలపై 60 శాతం తగ్గింపు, దివాళీ లైట్లపై 50 శాతం తగ్గింపు, దీపాలు, ల్యాంప్స్‌పై 60 శాతం తగ్గింపు, పూజా వస్తువులపై 70 శాతం తగ్గింపు ప్రకటించింది అమెజాన్. హోమ్ ఫర్నిషింగ్స్, హోమ్ డెకార్, ఫర్నీచర్, మ్యాట్రెసెస్‌పై 70 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
ధంతేసార్ స్టోర్‌లో స్మార్ట్ఫోన్లపైనా ఆఫర్స్ ఉన్నాయి. మొబైల్స్ యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్‌పై వరకు 40 శాతం తగ్గింపు, స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు, రిఫ్రిజిరేటర్స్, ఏసీలపై 40 శాతం వరకు తగ్గింపు, మైక్రోవేవ్‌పై 60 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ స్టోర్‌లో వాషింగ్ మెషీన్లను రూ.6,999 ధరకే కొనొచ్చు. కిచెన్, హోమ్ అప్లయెన్సెస్పైనా 70 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
ఆడియో డివైజెస్ కొనాలనుకునేవారికీ అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌పై ఏకంగా 80 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. అమెజాన్ సొంత డివైజెస్ అయిన అలెక్సా, ఫైర్ టీవీ, కిండిల్ ప్రొడక్ట్స్ 50 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.