ప్రస్తుతం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. బెస్ట్ గేమింగ్, కెమెరా ఫీచర్లను అందించే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ ధర ఉన్న ఫోన్స్‌లో అన్ని ఫీచర్స్ బెస్ట్‌గానే ఉంటాయి. కానీ బడ్జెట్‌లో మనకు కావాల్సిన ఫోన్ సెలక్ట్ చేసుకోవడం కాస్తంత కష్టమైన పని. మీరు రూ.15 వేల లోపు బెస్ట్ కెమెరా ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ టాప్ మోడల్స్ చూసేయండి.
* Xiaomi Redmi Note 11 SE
రెడ్‌మీ నోట్ 11SE ఫోన్ రూ.11999కు లభిస్తుంది. ఈ ఫోన్ 6.43-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 409 పిక్సెల్స్ డెన్సిటీ(ppi)తో 1800x2400 పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్‌ను అందిస్తుంది. డివైజ్ ముందువైపు 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు 64-మెగాపిక్సెల్ (f/1.9) ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ (f/2.2, అల్ట్రా వైడ్ యాంగిల్) కెమెరా, 2-మెగాపిక్సెల్ (f/2.4, టెలిఫోటో) కెమెరా, 2-మెగాపిక్సెల్ (f/2.4) కెమెరా సెటప్ ఉంటుంది. 6GB RAMతో డివైజ్ లభిస్తుంది.
* Infinix Note 12 5G
ఇన్ఫినిక్స్ నోట్ 12 5G స్మార్ట్‌ఫోన్‌లో 6GB RAM ఉంటుంది. ఇది 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో 2400x1080 పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. డివైజ్ వెనుకవైపు 50-మెగాపిక్సెల్ (f/1.6) ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.12999గా ఉంది.
* Moto G62 5G
మోటో G62 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.14999గా ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ 6.50-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. Moto G62 5G ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. డివైజ్ ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. వెనుకవైపు 50-మెగాపిక్సెల్ (f/1.8) ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ (f/2.2) కెమెరా, 2-మెగాపిక్సెల్ (f/2.4) కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తోంది. ఇది 6GB, 8GB RAMతో అందుబాటులో ఉంది.
* iQOO Z6 5G
ఐక్యూ స్మార్ట్‌ఫోన్ 6.58-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 1080 x 2408 పిక్సెల్స్ రిజల్యూషన్, 401 పిక్సెల్ డెన్సిటీ(ppi) కలిగి ఉంటుంది. ఐక్యూ Z6 5G ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 CPU ద్వారా రన్ అవుతుంది. ఇది 4GB, 6GB లేదా 8GB RAM తో వస్తుంది. డివైజ్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా కాన్ఫిగరేషన్‌లో 50-మెగాపిక్సెల్ (f/1.8) ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ (f/2.4) మాక్రో కెమెరా, 2MP (f/2.4) డెప్త్ కెమెరా ఉన్నాయి. ఒక 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.14999.
* Samsung Galaxy F23 5G
శామ్‌సంగ్ గెలాక్సీ F23 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.14999కి లభిస్తుంది. డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్, ప్రాసెసింగ్ స్పీడ్ పరంగా బెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 120Hz TFT డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G CPU, 6GB వరకు RAM, 5G సపోర్ట్ వంటి ఫీచర్లను అందిస్తోంది. F23లోని 50MP ట్రిపుల్ కెమెరా, సెల్ఫీ కెమెరా బెస్ట్ ఫొటోలను అందిస్తాయి. డివైజ్ శామ్‌సంగ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో భాగంగా త్వరగా ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను అందుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Smart mobile