• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • DEMAND FOR ELECTRIC SCOOTERS INCREASED IN INDIA MANUFACTURING COMPANIES PLANS TO EXPAND NS GH

Electric Two Wheelers: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ.. విస్తరణ పనుల్లో తయారీ సంస్థలు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

పెరుగుతున్న పెట్రోల్​ ధరలు, కాలుష్యం కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్​ వాహనాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంలోకి ప్రముఖ కంపెనీలతో పాటు స్టార్టప్​​ కంపెనీలు అడుగుపెడుతున్నాయి.

  • Share this:
మన దేశంలో ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహన విభాగంలో పోటీ ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. పెరుగుతున్న పెట్రోల్​ ధరలు, కాలుష్యం కారణంగా ప్రజలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్​ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో ఈ రంగంలోకి ప్రముఖ కంపెనీలతో పాటు స్టార్టప్​​ కంపెనీలు అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్​ గతేడాది​ ఐక్యూబ్​ పేరుతో ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్కూటర్​కు అనూహ్యమైన రెస్పాన్స్​ రావడంతో మరి కొద్ది రోజుల్లోనే 20 నగరాల్లో సేవలను విస్తరించాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో సుమారు 500-600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. వీటిలో ఎక్కువ భాగం స్కూటర్ల తయారీ, టెక్నాలజీ డెవలప్​మెంట్​కు ఉపయోగించనుంది. దీంతోపాటు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల డెవలప్​మెంట్​ కోసం ఉపయోగపడే ఈవీ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా రూ .150 కోట్లు కేటాయించనుంది.
BSNL Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి సూపర్ ఆఫర్.. కేవలం రూ. 187కే అన్‌లిమిటెడ్ డేటా.. వివరాలివే
Harley-Davidson EV: త్వరలో హ్యార్లీ డేవిడ్సన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

ఐక్యూబ్ మొదట బెంగళూరులో ప్రారంభమైంది. ఆ తరువాత, ఢిల్లీలో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. రాబోయే కొద్ది నెలల్లోనే ముంబై, చెన్నై, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ఇతర అగ్ర శ్రేణి నగరాలతో పాటు అనేక టైర్ I నగరాల్లో దీన్ని ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్స్​ డిమాండ్​ ఎక్కువగా ఉన్న నగరాలతో పాటు బ్యాటరీ ఛార్జింగ్ వంటి మౌలిక సదుపాయాలు లభించే నగరాల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

టీవీఎస్​ బాటలోనే మరిన్ని కంపెనీలు నడిచే అవకాశం ఉంది. అథర్ ఎనర్జీ ఇప్పటికే అగ్ర శ్రేణి నగరాలతో పాటు అనేక చిన్న నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. ఈ సంవత్సరం మరిన్ని నగరాలకు తమ వాహనాలను విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక, ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను పెంచడానికి కూడా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. బజాజ్ ఆటో కంపెనీ కూడా తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇతర నగరాలకు విస్తరించే ప్రణాళికలో ఉంది. చేతక్ మొదట పూణేలో ప్రారంభించబడింది. ఆ తరువాత బెంగళూరులో దీని అమ్మకాలు మొదలయ్యాయి. ఇక, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 30 నగరాల్లో చేతక్‌ అమ్మకాలు ప్రారంభించాలని బజాజ్ యోచిస్తోంది.

తమిళనాడులో ఓలా మెగా ప్లాంట్..​
ఎలక్ట్రిక్​ వాహనాల రంగంలో దూకుమీదున్న మరో సంస్థ ఓలా. ఈ సంస్థ ప్రస్తుతం తమిళనాడులో మెగా మాన్యుఫాక్చరింగ్​ ప్లాంట్​ నిర్మిస్తోంది. ఇది పూర్తవ్వగానే ఏటా 10 మిలియన్ ఎలక్ట్రిక్​ వాహనాలను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. వాహనాలనే కాకుండా హై-స్పీడ్ ఛార్జింగ్ స్టేషన్ల విస్తృతమైన నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. మొదటి ఏడాదిలో, 100 నగరాల్లో 5 వేలకు పైగా ఓలా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత 400 నగరాల్లో లక్షలకు పైగా ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనుంది. ఇక, వీటితో పాటు హుస్క్వర్నా, కెటిఎం వంటి ఇతర సంస్థలు కూడా తమ మార్కెట్​ను విస్తరించే పనిలో ఉన్నాయి. టూవీలర్​ ప్రధాన తయారీదారులైన హీరో మోటోకార్ప్, హోండా, సుజుకి, యమహా కూడా త్వరలో ఈవీ మార్కెట్​లోకి ప్రవేశించనున్నాయి. వీటి రాకతో భవిష్యత్తు అంతా ఎలక్ట్రికల్​ వాహనాల హవా కొనసాగనుంది.
Published by:Nikhil Kumar S
First published: