Home /News /technology /

DELL ULTRASHARP WEBCAM LAUNCHED IN INDIA KNOW PRICE AND SPECIFICATIONS SS GH

Dell Webcam: డెల్​ నుంచి అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్ విడుదల... 4K వీడియో సపోర్ట్​తో పాటు మరెన్నో ఫీచర్లు

Dell Webcam: డెల్​ నుంచి అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్ విడుదల... 4K వీడియో సపోర్ట్​తో పాటు మరెన్నో ఫీచర్లు
(image: Dell)

Dell Webcam: డెల్​ నుంచి అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్ విడుదల... 4K వీడియో సపోర్ట్​తో పాటు మరెన్నో ఫీచర్లు (image: Dell)

Dell UltraSharp Webcam | డెల్ అల్‌ట్రాషార్ప్ వెబ్‍క్యామ్ ఇండియాలో లాంఛ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు తెలుసుకోండి.

కరోనా కారణంగా వర్క్​ ఫ్రం హోమ్​, ఆన్​లైన్​ క్లాసులు జరుగుతుండటంతో స్మార్ట్​ ఉత్పత్తులకు డిమాండ్​ పెరిగింది. దీంతో అన్ని కంపెనీలు వరుసగా ఎలక్ట్రానిక్​ గాడ్జెట్స్​ను విడుదల చేస్తున్నాయి. ఇదే తరహాలో ప్రముఖ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల సంస్థ డెల్​ సరికొత్త అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్​ను విడుదల చేసింది. 4K వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. స్థూపాకార ఆకారంలో ఉన్న ఈ వెబ్‌క్యామ్‌లో 4K సోనీ సెన్సార్​ని అందించింది. ఇది తక్కువ కాంతిలో కూడా మెరుగైన వీడియో కమ్యూనికేషన్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. దీనితో పాటు ఆటో ఫ్రేమింగ్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా పనిచేస్తుంది. ఈ వెబ్‌క్యామ్ సాఫ్ట్‌వేర్ ఆధారిత నాయిస్​ క్యాన్సలేషన్​కు కూడా మద్ధతిస్తుంది.

Realme Narzo 30 5G: తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో రియల్‌మీ నార్జో 30 5జీ సేల్

Smartphone: స్మార్ట్‌ఫోన్ పోయిందా? మీ అకౌంట్ ఖాళీ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ 7 పనులు చేయండి

ధర, స్పెసిఫికేషన్స్


భారత మార్కెట్​లో డెల్ అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్ రూ.18,999 (యుఎస్‌లో 199.99 డాలర్లు) వద్ద లభిస్తుంది. డెల్ ఎంటర్​ప్రైజ్ ఛానల్స్ ద్వారా ఈ వెబ్‌క్యామ్​ను కొనుగోలు చేయవచ్చు. ఇది గ్లోబల్​ మార్కెట్​లో అందుబాటులో ఉంది. డెల్ అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్‌లో 8.3 మెగాపిక్సెల్ సోనీ స్టార్విస్ CMOS సెన్సార్ ఉంటుంది. ఇది4K UHD రిజల్యూషన్​కు సపోర్ట్​ చేస్తుంది. వెబ్‌క్యామ్‌లో ఫ్రేమ్ రేట్ ఫుల్ హెచ్​డీ, హెచ్​డి రిజల్యూషన్​ను అందించింది. మెరుగైన కాంతి కోసం డెల్ పైన మల్టీ ఎలిమెంట్ లెన్స్‌ను కూడా చేర్చింది. ఈ వెబ్​క్యామ్​ డిజిటల్ ఓవర్​లాప్​ HDR క్యాపబిలిటీతో వస్తుంది. 3డి /2డి వీడియో నాయిస్​ రిడక్షన్​ను కూడా దీనిలో అందించింది. తద్వారా క్వాలిటీ వీడియో అవుట్​పుట్​ను అందిస్తుంది.

Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ఫస్ట్ ఫ్లాష్ సేల్... డిస్కౌంట్ వివరాలు ఇవే

Samsung Galaxy M32: కాసేపట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎం32 సేల్

సంప్రదాయ వెబ్‌క్యామ్‌లా కాకుండా, డెల్ అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్ 5x డిజిటల్ జూమ్‌కు మద్ధతిస్తుంది. ఇది 65, 78, 90 డిగ్రీల కోణంతో వీడియో వీక్షణ అనుభవాన్ని ఇస్తుంది. వెబ్‌క్యామ్‌లో డెల్ ఎక్స్‌ప్రెస్ సైన్ ఇన్ ఫీచర్ కూడా చేర్చింది. మీ సెషన్​ పూర్తవ్వగానే ఆటోమేటిక్​గా లాగ్​ అవుట్ అవుతుంది. దీని కోసం ప్రాక్సిమిటీ సెన్సార్‌ను అందించారు. ఇక లాగిన్​ కోసం ఇన్​ఫ్రారెడ్ (ఐఆర్) సెన్సార్లను చేర్చింది. డెల్ అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్ అల్యూమినియం బాడీతో తయారైంది. ఈ వెబ్‌క్యామ్ మాగ్నెటిక్ మౌంట్, అడాప్టర్‌తో వస్తుంది. ఇక, కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. డెల్ అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్‌లో యుఎస్‌బి టైప్-సి పోర్ట్​ను చేర్చింది. మెరుగైన ఫోకస్ కోసం, వెబ్‌క్యామ్ AI ఆధారిత ఆటో ఫ్రేమింగ్ ఫీచర్​ను ఉపయోగిస్తుంది. అల్ట్రాషార్ప్ వెబ్‌క్యామ్‌లో విండోస్ 10, మాకోస్ డివైజ్​ సపోర్ట్​ అందించింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Dell, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు