కరోనా వైరస్ మహమ్మారి 2020 ను సాధారణ సంవత్సరం కాకుండా చేసింది. దేశం మొత్తం లాక్‌డౌన్ చేసిన సమయంలో అన్ని వ్యాపారాలు మూసివేయడంతో, అనేక చిన్న స్థాయి వ్యాపారాలు వాటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాయి. మనం తిరిగి నెమ్మదిగా ఈ 'సరికొత్త సాధారణ' పరిస్థితులకు అలవడుతున్న సమయంలో, ఈ వ్యాపారాలు తిరిగి నిలబడేందుకు అవసరమైన సహకారం కోసం చూస్తున్నాయి. అయితే టెక్నాలజీ విషయానికి వస్తే Dell తన వార్షిక స్మాల్ బిజినెస్ మంత్ ద్వారా చిన్న స్థాయి వ్యాపారాలకు సహకారం అందిస్తుంది.
కోవిడ్ -19 ప్రభావం
కోవిడ్-19 సమయంలో Dell వారి స్మాల్ బిజినెస్ మంత్, చిన్న వ్యాపారాలు తిరిగి అభివృద్ధి చెందడానికి సహాయపడే ల్యాప్‌టాప్‌లు మరియు పీసీలను రీటూల్ మరియు అప్‌గ్రేడ్ చేయడానికి ప్రోత్సాహకాలను అందించి, దారుణంగా దెబ్బతిన్న వ్యాపార విభాగాలకు సహకారం అందించి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ సంవత్సరం, చిన్న వ్యాపార కస్టమర్ల కోసం Dell మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్, IT దిగ్గజంతో కలిసి ఈ పరీక్షా కాలంలో పారిశ్రామికవేత్తలను ఆదుకోవడం కోసం పరిష్కార మార్గాలవైపు ఎక్కువ దృష్టి సారించింది. పూర్తిస్థాయి సాధారణ సృజనాత్మక ప్రచారాలకు దూరంగా, అనుభవపూర్వకమైన కార్యక్రమాలు స్మాల్ బిజినెస్ మంత్‌కు మరింత గుర్తింపు తెచ్చాయి.
ఈ విరామం తరువాత ప్రారంభమవుతున్న చిన్న స్థాయి వ్యాపారాలు సాంకేతిక సమస్యలలో చిక్కుకోకుండా తమకున్న డిమాండ్‌ను పునరుద్ధరించడంపై దృష్టి సారింగలమనే భరోసా వారికి అందించాలి. Dell వారి స్మాల్ బిజినెస్ మంత్ ఆ కోవకు చెందినదే. ఇది సరికొత్త పరికరాలతో తమ ఆన్‌లైన్ వ్యాపారాన్ని సరిచేసుకునేందుకు వ్యవస్థాపకులకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించడమే కాకుండా, ప్రతీ చిన్న స్థాయి వ్యాపారానికి అవసరమైన సహకారం, వ్యక్తిగత పరిష్కారాలను అందిస్తుంది. ఒకసారి సాంకేతిక సమస్య తీరిన తరువాత వ్యవస్థాపకులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడే పనులపై ఎక్కువ సమయం కేటాయించడానికి వారికి అవకాశం ఉంటుంది.
DELL వారి స్మాల్ బిజినెస్ మంత్
చిన్న స్థాయి వ్యాపారాల బాధల గురించి లోతైన అవగాహనతో టెక్ దిగ్గజం వివిధ కార్యక్రమాలను చేపట్టింది, ఇది ఎస్ఎంబీలకు సాంకేతికతకు సంబంధించిన సమస్యలను అధికమించడమే కాకుండా, వారి ప్రత్యేక అవసరాల కోసం ఏది ఉత్తమంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది, అవి ఏమిటంటే:
• చిన్న వ్యాపారాల భద్రత - వ్యాపార సమాచారాన్ని భద్రపరచడానికి డేటా బ్యాకప్ మరియు సైబర్ సెక్యూరిటీ
• చిన్న వ్యాపార సేవలు - ఫైనాన్సింగ్, విస్తరణ మరియు పరికరాల నిర్వహణ)
• చిన్న వ్యాపారాల పునరుద్ధరణ - ఉత్పాదకతను పెంచడంలో సహాయపడే తాజా సాంకేతిక ఉత్పత్తులు
• చిన్న వ్యాపారాల ఉత్పాదకత - సామర్థ్యం మరియు ఉత్పాదకతను పెంచేందుకు సహాయపడే ఆప్టిమైజ్డ్ సాఫ్ట్‌వేర్
టెక్ దిగ్గజం నుండి ఇటువంటి పరిష్కారాలతో పాటు, మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన 'స్మాల్ బిజినెస్ మంత్' (ఎస్‌బీ మంత్) సహకారం కూడా ఉంది. "చిన్న వ్యాపారాల వినియోగదారుల కోసం రూపొందించిన కార్యక్రమాలు మా పరిష్కారాలు మరియు సహాయక సేవల గురించి మాట్లాడడంపై దృష్టి సారించాయి. ఎస్‌బీ మంత్ సహకారంలో భాగంగా, తమ వ్యాపారం మరియు సంఘాలలో కీలక పాత్ర పోషించిన మన చిన్న వ్యాపార వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపే అవకాశాన్ని మేము తీసుకుంటాము." అని Dell ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ రీతూ గుప్తా పేర్కొన్నారు.
చిన్న వ్యాపారాలకు సహకారం & పరిష్కారాలు
ఇది తమ చిన్న వ్యాపారాల సాంకేతిక అవసరాలన్నింటికీ చిన్న వ్యాపారాల భాగస్వామి అని వ్యవస్థాపకులకు తెలియచేయాలని నిశ్చయించుకుంది. గత సంవత్సరంలో మంచి విజయాన్ని సాధించిన స్మాల్ బిజినెస్ మంత్, ఈ సంవత్సరం Dell వారి చిన్న వ్యాపారాల టెక్ సలహాదారుల గురించి అవగాహన కలిగించడం మరియు చిన్న వ్యాపారాల పట్ల వారి అంకితభావం మరియు విలువల గురించి ప్రదర్శించడమే ఈ ప్రచారం లక్ష్యం.
మూడు దశాబ్దాలుగా నిర్మించిన వారసత్వం నుండి వచ్చిన Dell వారి సాంకేతిక సలహాదారులు సలహాలను అందించడంతో పాటు ప్రతీ చిన్న వ్యాపారాలకు సరైన పరిష్కారాలను సూచించి వన్-ఆన్-వన్ సహకారాన్ని అందించడం నుండి, స్మాల్ బిజినెస్ మంత్ విజయవంతం కావడానికి ఉత్తమ పరిష్కారాలను అందిస్తారు, వారు కేవలం Dell కి మాత్రమే కాకుండా, రాబోయే నెలలలో తమ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలనే దాని గురించి సరైన సలహా కోసం చూస్తున్న పారిశ్రామికవేత్తలకు కూడా పరిష్కారాలు సూచిస్తారు. అందుకోసం మీరందరూ చేయవలసినది ఏమిటంటే కేవలం ఇక్కడ here వారి వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడం.
2020 ప్రారంభమైనప్పుడు, ప్రపంచంలోని ఏ ఒక్కరూ ఈ సంవత్సరం ఇంత భిన్నంగా ఉంటుందని ఊహించలేదు. మనం మన జీవితాలను మరియు వ్యాపారాలను పునరుద్దరించే సమయంలో చిన్న వ్యాపారులకు సహకారం అందించడానికి విశ్వసనీయమైన భాగస్వామి ఉండడం ఎంతో అవసరం.
గత మూడు సంవత్సరాలుగా స్మాల్ బిజినెస్ మంత్ ద్వారా సంబరాలు జరుపుకోవడంలో ముందంజలో ఉన్న Dell కు మించిన గొప్ప భాగస్వామి మరొకరు ఉన్నారని కూడా మనం ఆలోచించలేము. Dell చెప్పినట్లుగా, మీ వ్యాపారానికి సంబంధించిన ఏ విషయం కూడా చిన్నది కాదు.
ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Information Technology