Home /News /technology /

DELL LAUNCHES REDESIGNED INSPIRON LAPTOPS IN INDIA HERE IS PRICE AVAILABILITY AND OTHER DETAILS GH SK

Dell Inspiron: మార్కెట్లోకి డెల్ ఇన్​స్పిరాన్​ రీడిజైన్ ల్యాప్​టాప్​.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dell Inspiron Laptops: ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ డెల్ తన ఇన్​స్పిరాన్​ ల్యాప్​టాప్​లను రీడిజైన్​ చేసి​ భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లేంటి? ధరలు ఎలా ఉన్నాయి? ఎక్కడ దొరుకుతాయి? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
భారత్ మార్కెట్లోకి మరో కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ డెల్ తన ఇన్​స్పిరాన్​ ల్యాప్​టాప్​లను రీడిజైన్​ చేసి​ లాంచ్​ చేసింది. ఈ ల్యాప్​టాప్​ల అమ్మకాలు జూన్ 17 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి మల్టిపుల్​ ధరల శ్రేణిలో లభిస్తాయి. QHD ప్లస్ స్క్రీన్​ రిజల్యూషన్ గల ఈ ల్యాప్​టాప్​లు 13 అంగుళాలు, 14 అంగుళాలు, 15 అంగుళాల స్క్రీన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ డివైజ్‌ ఫీచర్లు, ధర, లభ్యత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

* డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 ఇన్ 1)
డెల్ ఇన్​స్పిరాన్ 14 అంగుళాల ల్యాప్‌టాప్‌లో సన్నని బెజెల్స్‌ చేర్చింది. ఇది 14 అంగుళాల ఫుల్​ హెచ్‌డి టచ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇది కేవలం ల్యాప్​టాప్​గానే కాకుండా టాబ్లెట్​గానూ పనిచేస్తుంది. ఈ డివైజ్ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌, రేడియన్ గ్రాఫిక్‌ కార్డ్​తో కూడిన AMD రైజెన్ మొబైల్ ప్రాసెసర్‌ను అందించారు.

* ఇన్​స్పిరాన్ 13
డెల్ ఇన్​స్పిరాన్ 13 స్లిమ్, లైట్ డిజైన్​తో వస్తుంది. ఈ ల్యాప్​టాప్ 13.3 అంగుళాల క్యూహెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 1.25 కిలోలు బరువు ఉండే ఈ ల్యాప్​టాప్​ను అల్యూమినియం ప్యానెల్​తో రూపొందించారు. ఇందులో ఇన్​బిల్ట్​ టియువి, లో బ్లూ లైట్ హార్డ్‌వేర్ సొల్యూషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువసేపు కంప్యూటర్​పై పని చేసినప్పటికీ కంటిపై ఎటువంటి ఒత్తిడి ఉండదు.

* డెల్ ఇన్​స్పిరాన్ 14, ఇన్​స్పిరాన్ 15
డెల్ ఇన్​స్పిరాన్ 14, ఇన్​స్పిరాన్ 15 ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ హెచ్-గ్రేడ్ ప్రాసెసర్​తో పనిచేస్తాయి. వీటిలో ఎన్విడియా MX450 గ్రాఫిక్స్ కార్డును అందించారు. డెల్​ తాజాగా తన ఇన్​స్పిరాన్ 15 రెండవ వేరియంట్‌ను కూడా రిలీజ్​ చేసింది. ఇది రేడియన్ గ్రాఫిక్‌తో ఉన్న AMD రైజెన్ మొబైల్ ప్రాసెసర్​తో పనిచేస్తుంది.

* ధర, లభ్యత
ఈ రీడిజైన్​ ల్యాప్​టాప్​లను డెల్​ అధికారిక వెబ్‌సైట్, మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్స్, అమెజాన్ వెబ్​సైట్​ నుంచి కొనుగోలు చేయవచ్చు. డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్​లో కూడా ఈ ఇన్‌స్పిరాన్ ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంటాయి. డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 ఇన్ 1) ఇంటెల్​ కాన్ఫిగరేషన్​ ల్యాప్​టాప్​ రూ. 57,990 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. ఇక, డెల్ ఇన్​స్పిరాన్ 14 ఇంచెస్​​ (2 ఇన్ 1) AMD కాన్ఫిగరేషన్ ల్యాప్​టాప్​​​ రూ. 65,990 ధర వద్ద లభిస్తుంది. మరోవైపు, డెల్​ ఇన్​స్పిరాన్ 14 ధర రూ .44,990 వద్ద ప్రారంభమవుతుంది.

ఇంటెల్ కాన్ఫిగరేషన్‌లతో కూడిన డెల్ ఇన్‌స్పిరాన్ 15 ధర రూ.48,990 వద్ద ప్రారంభమవుతుంది. AMD కాన్ఫిగరేషన్‌లతో వచ్చే డెల్ ఇన్‌స్పిరాన్ 15 అమ్మకాలు జూన్ 22న మొదలవుతాయి. ఇది రూ. 57,990 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. ఇక, ఇన్​స్పిరాన్ 13 ల్యాప్​టాప్​ అమ్మకాలు జూలై 7 నుంచి ప్రారంభమవుతాయి. ఇది రూ .68,990 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Dell, Information Technology, Laptop, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు