హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Dell Inspiron laptops: డెల్ నుంచి కొత్తగా 4 ల్యాప్​టాప్​ల విడుదల.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు..

Dell Inspiron laptops: డెల్ నుంచి కొత్తగా 4 ల్యాప్​టాప్​ల విడుదల.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు..

Laptops (ప్రతీకాత్మక చిత్రం)

Laptops (ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ డెల్ తన ఇన్​స్పిరాన్​ ల్యాప్​టాప్​లను రీడిజైన్ చేసి భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వాటి వివరాలు చూద్దాం

ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ డెల్​ తన ఇన్​స్పిరాన్​ ల్యాప్​టాప్​లను రీడిజైన్​ చేసి భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. ఇన్‌స్పిరాన్ 14 (2 ఇన్ 1), ఇన్​స్పిరాన్ 13, ఇన్​స్పిరాన్​ 14, ఇన్​స్పిరాన్​ 15 ల్యాప్​టాప్స్​లో అనేక కొత్త ఫీచర్లను చేర్చి బడ్జెట్​ ధరలోనే లాంచ్​ చేసింది. వీటిలో ఇంటెల్, AMD కాన్ఫిగరేషన్‌ అందించింది. ఇవి ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో కూడిన 54Whr బ్యాటరీతో పనిచేస్తాయి. ఇప్పటికే మార్కెట్​లో విడుదలైన ఈ ల్యాప్​టాప్స్​ను డెల్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, రిటైల్ అవుట్‌లెట్స్​, డెల్ స్టోర్స్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు, ధర

డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 -ఇన్ 1)

కొత్త డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 -ఇన్ 1) 14- అంగుళాల ఫుల్​ హెచ్​డీ రిజల్యూషన్ టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. దీన్ని కేవలం ల్యాప్​టాప్​గానే కాకుండా టాబ్లెట్​గానూ ఉపయోగించుకోవచ్చు. ఇది 11వ తరం ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో ఎన్విడియా జిఫోర్స్ MX350 GPU గ్రాఫిక్​ కార్డు అందించింది. AMD వేరియంట్ విషయానికి వస్తే.. దీనిలో ఇన్​బిల్ట్​ రేడియన్ గ్రాఫిక్స్​తో కూడిన రైజెన్ 7 5700U CPU ప్రాసెసర్​ను చేర్చింది. అంతేకాక, 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్​ అందించింది. ఇక, కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో రెండు యుఎస్​బి 3.2 జెన్ 1 టైప్-ఎ పోర్ట్స్, యుఎస్బి 3.2 జెన్ 1 టైప్-సి పోర్ట్, ఒక హెచ్​డిఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్​ఫోన్ జాక్ వంటివి చేర్చింది. ఇంటెల్ కాన్ఫిగరేషన్​ గల డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 -ఇన్ 1) మోడల్ ధర రూ. 57,990 నుండి ప్రారంభమవుతుంది. ఇక, AMD కాన్ఫిగరేషన్​ బేస్ వేరియంట్ ధర రూ .65,990 నుంచి ప్రారంభమవుతుంది.


డెల్ ఇన్​స్పిరాన్ 13

డెల్ ఇన్​స్పిరాన్ 13 అన్ని మోడల్స్​ కన్నా చిన్న సైజులో ఉంటుంది. దీనిలో 13.3 -అంగుళాల QHD + (2560x1600 పిక్సెల్స్) డిస్ప్లేని అందించింది. ఇది 11 వ తరం ఇంటెల్ కోర్ i7-11370H సిపియు ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది ఎన్విడియా జిఫోర్స్ MX450 GPU గ్రాఫిక్​ కార్డ్​తో వస్తుంది. ఈ కొత్త డెల్ ల్యాప్‌టాప్ 16GB RAM, 512GB NVMe SSD స్టోరేజ్​తో వస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. యుఎస్‌బి టైప్-ఎ 3.2 జెన్ 1 పోర్ట్, రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, హెచ్‌డిఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించింది. ఇది రూ. 68,990 ధర వద్ద లభిస్తుంది.

డెల్ ఇన్​స్పిరోన్ 14

డెల్ ఇన్‌స్పిరాన్ 14 కొత్త మోడల్​ 14 -అంగుళాల పూర్తి-హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 11వ- జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్‌ను అందించింది. అంతేకాక, ఎన్విడియా జిఫోర్స్ MX450 GPU గ్రాఫిక్​ కార్డ్​, 16GB ర్యామ్​, 1TB SSD స్టోరేజ్ వంటివి చేర్చింది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. థండర్ బోల్ట్ 4 పోర్ట్, యుఎస్బి టైప్-సి 3.2 జెన్ 2 పోర్ట్, రెండు యుఎస్​బి టైప్-ఎ 3.2 జెన్ 1 పోర్ట్స్, ఒక హెచ్​డిఎంఐ పోర్ట్, ఒక ఎస్డి కార్డ్ రీడర్, హెడ్​ఫోన్, మైక్రోఫోన్ కోసం కాంబో జాక్ వంటివి అందించింది. ఇది రూ .44,990 ధర వద్ద లభిస్తుంది.

డెల్ ఇన్​స్పిరాన్ 15

డెల్ ఇన్‌స్పిరాన్ 15లో ఇంటెల్ కాన్ఫిగరేషన్‌తో పాటు, AMD CPU ఆప్షన్​ కూడా ఉంటుంది. దీనిలో 15.6 -అంగుళాల ఫుల్​-హెచ్‌డి డిస్​ప్లే అందించింది. ఈ రెండు వేరియంట్లలోనూ మెమరీ, కనెక్టివిటీ ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి. ఇంటెల్ కాన్ఫిగరేషన్ గల డెల్ ఇన్​స్పిరాన్ 15 రూ .48,990 ధర వద్ద లభిస్తుంది. AMD కాన్ఫిగరేషన్ గల డెల్ ఇన్​స్పిరాన్​ 15 ధర రూ. 57,990 వద్ద ప్రారంభమవుతుంది.

First published:

Tags: Technology

ఉత్తమ కథలు