Home /News /technology /

DELL LAUNCHES NEW ALIENWARE X15 ALIENWARE X17 LAPTOPS ALONG WITH NEW XPS G15 MODELS IN INDIA FULL DETAILS HERE SU GH

Dell New Laptops: సూపర్ ఫీచర్లతో కొత్త ల్యాప్​టాప్​లు లాంచ్ చేసిన డెల్.. ​ఒకేసారి ఐదు మోడళ్లు విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే..

(Image of Alienware x15 and Alienware x17)

(Image of Alienware x15 and Alienware x17)

ప్రముఖ ఎలక్ట్రానిక్స్​ సంస్థ ‘డెల్’(Dell) కొత్తగా ఐదు ల్యాప్​టాప్ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకంగా గేమింగ్​ను హైలెట్​ చేస్తూ ఎలియన్​వేర్​ పేరుతో రెండు మోడళ్లను లాంచ్ చేసింది.

ప్రముఖ ఎలక్ట్రానిక్స్​ సంస్థ ‘డెల్’(Dell) కొత్తగా ఐదు ల్యాప్​టాప్ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకంగా గేమింగ్​ను హైలెట్​ చేస్తూ ఎలియన్​వేర్​ పేరుతో రెండు మోడళ్లను లాంచ్ చేసింది. అలాగే ఎక్స్​పీఎస్ సిరీస్​లో రెండు ల్యాప్​టాప్​లతో పాటు డెల్ జీ15 ల్యాప్​టాప్​ను తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన ల్యాప్​టాప్​లన్నీ ఇంటెల్ ప్రాసెసర్​తోనే వస్తున్నాయి. అయితే జీ 15లో ఇంటెల్​, ఏఎండీ మధ్య ఆప్షన్​ను ఎంచుకునే అవకాశం ఉంది. డెల్​ జీ 15 ఏఎండీ ప్రాసెసర్​ వేరియంట్ ధర రూ.82,990 గా ఉండగా.. ఇంటెల్ ప్రాసెసర్ వేరియంట్ ధర రూ.94,900గా డెల్ నిర్ణయించింది.

డెల్​ ఎలియన్​వేర్ ఎక్స్​15 ఆర్​1 (Alienware x15 R1) ప్రారంభ ధర రూ.2,40,990 గా ఉండగా.. ఇదే సిరీస్​లో ఎలియన్​వే​ర్ ఎక్స్​17 ఆర్​1(Alienware x17 R1) ధర రూ.2,90,990గా ఉంది. మరోవైపు డెల్​ ఎక్స్​పీఎస్ 15 (Dell XPS 15), డెల్ ఎక్స్​పీఎస్ 17 (Dell XPS 15) ధరలు వరుసగా రూ.2,23,990, రూ.2,64,490గా నిర్ణయించింది. ఈ కొత్త డెల్​ ల్యాప్​టాప్​లు సెప్టెంబర్​లో మార్కెట్లలోకి రానున్నాయి. ఎలియన్​వేర్​, ఎక్స్​పీఎస్​ మోడళ్ల అమ్మకాలు భారత్​లో సెప్టెంబర్​ 3న ప్రారభం కానుండగా.. డెల్​ జీ15 వేరియంట్ మాత్రం అదేనెల 23న రానుంది.

Tata Tigor EV: మార్కెట్​లోకి టాటా టిగోర్ ఈవీ.. లాంచ్ డేట్ ఫిక్స్.. బుకింగ్స్​ ప్రారంభించిన సంస్థ

ఎలియన్​వేర్​ ఎక్స్​15 ఆర్​1 ( Alienware x15 R1)..
ముఖ్యంగా గేమింగ్​ లవర్స్ కోసం ఈ మోడల్​ను డెల్ తీసుకొచ్చింది. కైరో కూలింగ్​ టెక్నాలజీతో వస్తున్న ఈ ల్యాప్​టాప్​.. ఇతర మోడళ్లతో పోలిస్తే 25శాతం ఎక్కువ థర్మల్ రెసిస్టెంట్ కలిగి ఉంటుందని డెల్ ప్రకటించింది. 15.6 అంగుళాల స్క్రీన్​తో వస్తున్న ఈ మోడల్​లో లేటెస్ట్ ఇంటెల్ కోర్​ ఐ9 ప్రాసెసర్ ఉంది. అలాగే ఎన్​వీడియా జీఫోర్స్​ ఆర్​టీఎక్స్ 3080 జీపీయూతో పాటు 32 జీబీ ర్యామ్​, 1 టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తోంది.

ఎలియన్​వేర్​ ఎక్స్​17 ఆర్​1 (Alienware x17 R1)..
ఇది కూడా గేమింగ్ ల్యాప్​టాప్​. హీటింగ్​ను కంట్రోల్ చేసే థర్మల్​ రెసిస్టెంట్ సిస్టమ్​తో వస్తోంది. 17.3 అంగుళాల, 1080 పిక్సెళ్ల రిజల్యూషన్​తో భారీ స్క్రీన్ ఈ మోడల్​లో ఉంది. ఇది కూడా ఇంటెల్ కోర్​ ఐ9 ప్రాసెసర్​తో నడుస్తుంది. ఎన్​వీడియా ఆర్​టీఎక్స్ 3080 జీపీయూ, 32 జీబీ ర్యామ్​, 1టీబీ ఇంటర్నల్ స్టోరేజీ వరకు వేరియంట్లలో లభిస్తోంది. అలాగే ఎలియన్​వేర్ ఎక్స్​15లో ఉన్న కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులోనూ ఉన్నాయి.

డెల్​ ఎక్స్​పీఎస్​ 15.. 15.6 అంగుళాల 4కే అల్ట్రా హెడ్​డీ టచ్​ స్క్రీన్​ డిస్​ప్లే, ఇంటెల్​ కోర్​ ఐ9 ప్రాసెసర్​తో వస్తోంది. డెల్​ ఎక్స్​పీఎస్​ 17లో 17 అంగుళాల 4కే డిస్​ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ ఇంటెల్​ కోర్​ఐ-9 ప్రాసెసర్ ఉంది. రెండింట్లోనూ ఎన్​వీడియా గ్రాఫిక్స్ కార్డు ఉండగా.. 32 జీబీల ర్యామ్ వరకు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి.

డెల్​ జీ15.. 15 అంగుళాల ఫుల్​హెచ్​డీ స్క్రీన్​తో వస్తోంది. ఇంటెల్​ కోర్ ఐ7 లేదా ఏఎండీ రైజన్ 7ల ప్రాసెసర్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. అలాగే ఎన్​వీడియా గ్రాఫిక్స్​లోనూ మూడు ఆప్షన్లలో లభించనుంది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Dell, Laptop, Technology

తదుపరి వార్తలు