హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Laptops: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? రూ.50,000 లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే

Laptops: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? రూ.50,000 లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే

Laptops (ప్రతీకాత్మక చిత్రం)

Laptops (ప్రతీకాత్మక చిత్రం)

Best Laptops under Rs 50,000 | మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ పిల్లలు రోజూ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఓ మంచి ల్యాప్‌టాప్ తీసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్‌లో రూ.50,000 లోపు ఉన్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే.

కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగింది. అంతేకాక, అన్ని విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అయితే మార్కెట్లో 20 వేల నుంచి లక్ష రూపాలకుపైగా ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏ ల్యాప్‌టాప్ కొనాలి? ఎంత ధరలో కొనాలి? వాటిలోని ఫీచర్లేంటి? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కాబట్టి ల్యాప్‌టాప్‌ల పనితీరు, డిజైన్, డ్యురేబిలిటీ, బ్యాటరీ లైఫ్ మరియు కనెక్టివిటీ వంటి పారామీటర్స్ను తెలుసుకొని మీ వర్క్ ఫ్రం హోంకి ఉపయోగపడే వాటిని ఎంచుకోండి. రూ.50000 వేలలోపు అందుబాటులో ఉండే మిడ్ రేంజ్ ల్యాప్‌టాప్ వర్క్ ఫ్రం హోంతో పాటు ఇతర అవసరాలకు మంచి ఛాయిస్. వాటిపై ఓ లుక్కేయండి.

ACER ASPIRE: 1 టిబి హార్డ్ డిస్క్‌తో 4 జిబి ర్యామ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ వర్క్ ఫ్రం హోంకి అనుకూలంగా ఉంటుంది.10వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ వచ్చే ఈ ల్యాప్‌టాప్ 1 GHz వరకు క్లాక్ స్పీడ్‌ను, 3.6 GHz టర్బో బూస్ట్ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఒక్క సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 8.5 గంటల వరకు పనిచేస్తుంది. దీనిలోని విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ ముందుగానే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది.

September Smartphones: సెప్టెంబర్‌లో రిలీజైన బెస్ట్ 12 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

WhatsApp Tricks: వాట్సప్ స్టేటస్‌లో ఈ ట్రిక్స్ ట్రై చేశారా?

LENOVO IDEAPAD SLIM 3I: 15.6 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్ 8 జిబి ర్యామ్‌తో పాటు 1టిబి ఎక్స్‌స్టర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 10 వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో పనిచేసే ఆ ల్యాప్‌టాప్ 1 GHz ఫ్రీక్వెన్సీని అందిస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీని 3.6GHz వరకు పెంచుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 7.3 గంటల వరకు పనిచేస్తుంది.

HP 15S-DU2002TU: హెచ్‌పీ బ్రాండ్ ల్యాప్‌టాప్ మార్కెట్లో ప్రత్యేక స్థానం ఉంది. మీ అన్ని అవసరాలకు పనికొచ్చేలా ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఈ ల్యాప్‌టాప్ ఉత్తమ ఎంపిక. అట్రాక్టివ్ లుక్తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 8GB RAM, 1TB హార్డ్ డ్రైవ్ స్టోరేజ్తో వస్తుంది. దీనిలోని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రీలోడ్ చేసి ఉంటుంది.

Work From Home Jobs: నెలకు రూ.30,000 సంపాదించండి... వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవే


Shopping tricks: షాపింగ్‌లో మీరు ఎలా మోసపోతారో తెలుసా? ఇలా

Dell Inspiron 3493: సాధారణంగా ల్యాప్‌టాప్ ఉండే 15.6 అంగుళాల సైజ్ కంటే కొంచెం తక్కువ సైజులో ఉన్న ల్యాప్‌టాప్ ఇష్టపడే వారికి ఇది ఉత్తమ ఎంపిక. కాంపాక్ట్ సైజులో అందుబాటులో ఉండే ఈ ల్యాప్‌టాప్ ఉపయోగించడానికి మరియు ఈజీగా క్యారీ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. 8 జిబి ర్యామ్, 1 టిబి హార్డ్ డ్రైవ్ మరియు ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లో టాప్ పెర్ఫార్మర్‌గా నిలుస్తుంది.

ASUS ZENBOOK UX430UA-GV372T: ఈ ల్యాప్‌టాప్ కేవలం 14 -అంగుళాల డిస్‌ప్లేతో కేవలం 1.30 కిలోల బరువుతో వస్తంది. ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీతో పనిచేస్తుంది. ఇది 8 వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌లో నడుస్తుంది. దీనిలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రీఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Online classes, Online Education, Work From Home

ఉత్తమ కథలు