HOME »NEWS »TECHNOLOGY »dell g5 15 se to acer nitro 5 these are best 5 gaming laptops under rs 80000 ss gh

Best Gaming Laptops: గేమ్స్ ఎక్కువ ఆడతారా? బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే

Best Gaming Laptops: గేమ్స్ ఎక్కువ ఆడతారా? బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే
Best Gaming Laptops: గేమ్స్ ఎక్కువ ఆడతారా? బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Best Gaming Laptops | మీరు ల్యాప్‌టాప్స్‌లో ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారా? గేమింగ్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే.

  • Share this:
ఈ సంవత్సరం ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పాఠశాలలకు వెళ్లే పిల్లలందరూ ఇంటి వద్దనే ఉండటంతో ఆన్ లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్‌లను అధికంగా కొనుగోలు చేస్తుంది. భారత్‌లో సెప్టెంబరు త్రైమాసికంలో ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లలో 9.2 శాతం వృద్ధి సాధించాయి. సాధారణ ల్యాప్‌టాప్‌లతో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ బ్రహ్మండమైన్ డిస్ ప్లే, గొప్ప ఆడియోతో పాటు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వినోదభరితంగా సాగుతూ మంచి అనుభవాన్ని అందించే గేమ్స్ కోసం వీటిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.

భారత్‌లో అత్యుత్తమ టాప్-5 ల్యాప్‌టాప్‌ బ్రాండ్ల అయిన HP, లెనోవా, డెల్, యాసెర్, యాసుస్ సంస్థలు అత్యధిక మార్కెట్ వాటాను(88.2 శాతం) కలిగి ఉన్నాయి. ఇతర బ్రాండ్లు 11.8 శాతం వాటాతో ఉన్నాయి. ఒకవేళ మీరు గేమింగ్ ల్యాప్‌టాప్‌ కొనాలని చూస్తుంటే గేమర్స్ కోసం మంచి నాణ్యత కలిగిన ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. మరి రూ.80 వేల లోపు ధరలో అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ లేంటో ఇప్పుడు చూద్దాం.Top 10 Apps of 2020: ఈ ఏడాది ఎక్కువ డౌన్‌లోడ్స్ చేసిన 10 యాప్స్ ఇవే

Vivo V20 2021: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే

Dell G5 15 SE


డెల్ G5 15 SE గేమింగ్ ల్యాప్‌టాప్‌ ధర రూ.74,990లు. 15.6 అంగుళాల పూర్తి హెచ్ డీ డిస్ ప్లే(1920X1080 పిక్సెల్ రిజల్యూషన్), 60HZ రిఫ్రెష్ రేట్ మంచి బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో AMD రైజెన్ 4000- హెచ్ సిరీస్ మొబైల్ ప్రాసెసర్లతో పాటు AMD రేడియన్ RX 5000M GPU వ్యవస్థ ఉంది. ఇవి కాకుండా 8జీబీ ర్యామ్, 512 జీపీ ఎస్ఎస్ డీ కార్డు సౌలభ్యముంది. ఈ ల్యాప్‌టాప్‌ 51డబ్ల్యూహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. కలర్స్ ఎంపికలోకి వస్తే డెల్ జీ5 15 ఎస్ఈ ల్యాప్‌టాప్‌ ను సూపర్నోవా సిల్వర్, బ్లూ కలర్ లో సొంతం చేసుకోవచ్చు.

Lenovo Legion Y540


లెనొవో లీజియన్ వై540 ధర రూ.69,990లు. ఇది ప్లాస్టిక్ పీసీ-ఏబీఎన్ తో తయారుచేయబడింది. అయితే 15.6 అంగుళాల ఫుల్ హెచ్ డిస్ ప్లే, 144HZ రిఫ్రెష్ రేటు 300 నిట్స్ బ్రైట్నెస్ ను కలిగి ఉంది. అంతేకాకుండా 9వ తరం ఇంటెల్ కోర్ 7-9750 హెచ్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది 4.5 గిగాహెర్ట్జ్ వేగాన్ని కలిగి ఉంటుంది. ల్యాప్‌టాప్‌ లో 16జీబీ డీడీఆర్ 4 మెమొరీ అమర్చబడి 32జీబీ వరకు బంప్ చేయవచ్చు. ఇది 1TB M.2 SSD, 6జీబీ నివిడియా ఆర్టీఎక్స్ 2060 జీపీయూను కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌కు 57 వాట్ అవర్ 3 సెల్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. అంతేకాకుండా ఇది ఐదు గంటల బ్యాకప్ ను మళ్లీ బట్వాడా చేస్తుంది. లీజియన్ వై540 ల్యాప్‌టాప్‌ కీబోర్డుకు ఆర్జీబీ బ్యాక్ లైటింగ్ లేదు. వైట్ కలర్ కీలను కలిగి ఉంది.

Smart Home: మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చే 7 గ్యాడ్జెట్స్ ఇవే... ధర రూ.7,000 లోపే

WhatsApp Trick: వాట్సప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడటం ఎలాగో తెలుసా?

Acer Nitro 5


ఏసర్ నిట్రో 5 ధర రూ.72,990లు. ఇది యాసర్ నైట్రో 5 ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 15.3 అంగుళాలు లేదా 17.3 అంగుళాలు రెండు పరిమాణాల్లో లభిస్తుంది. 3 మిల్లీ సెకన్ల రెస్పాన్స్ రేటుతో పాటు 144 HZ రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. అంతేకాకుండా స్క్రీన్ కు వెళ్లే వివిధ కాన్ఫగరేషన్లను యాసెర్ అందిస్తుంది. ల్యాప్‌టాప్‌ లో మూడు వైపులా కనీస బెజెల్స్ ఉన్నాయి. ఇవి శరీర నిష్పత్తికి 80 శాతం స్క్రీన్ ను అందిస్తాయి. నైట్రో 5 గొప్ప గేమింగ్ పనితీరు కోసం 10వ తరం ఇంటెల్ కోర్ హెచ్-సిరీస్ ప్రాసెసర్ల ద్వారా RTX 2060 గ్రాఫిక్స్ ను జత చేయవచ్చు. ఇది 32జీబీ DDR4 RAM వరకు కాన్ఫిగర్ చేయవచ్చు. అంతేకాకుండా ఇది 1టీబీ హెచ్ డీడీ, 256 జీబీ M.2 SSD సహా హైబ్రిడ్ మెమొరీని కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌ వేగంగా పనిచేసేందుకు గాను డ్యూయల్ ఫ్యాన్లతో వస్తుంది. ఇది ప్రీ ఇన్ స్టాల్ తో చేసిన నైట్రోసెన్స్ కంట్రోల్ సెంటర్ తో పనిచేస్తుంది.

Asus TUF Gaming A15 / A17


ఏసుస్ TUF A15.. 15-అంగుళాల స్క్రీన్ తో ఇది వస్తుంది. TUF A17.. 17-అంగుళాల స్క్రీన్ తో అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా 60HZ లేదా 144HZ రిఫ్రెష్ రేటుతో ఐపీఎస్ ప్యానెల్స్ ఉంటుంది. టీయూఎఫ్ ఏ17లో 60HZ/120HZ ప్రారంభంలో లభిస్తుంది. దీని ధర రూ.60,990లకు సొంతం చేసుకోవచ్చు. రెండు ల్యాప్‌టాప్‌లు AMD రైజెన్9 4900హెచ్ ప్రాసెసర్ ఇందులో ఉంది. టీయూఎఫ్ ఏ15లో 6GB GDDR6 RAMతో Nvidia GeForce RTX 2060 ఉండగా.. TUF A17లో 6GB GDDR6 RAM తో Nvidia GeForce GTX 1660Ti ఫీచర్ తో అందుబాటులోకి వచ్చింది.

రెండు ల్యాప్‌టాప్‌లు డ్యూయల్-ఛానెల్‌లో 32GB DDR4 SDRAM వరకు మద్దతు ఇస్తాయి. మెమొరీ కోసం మీరు హార్డ్ డిస్క్ విభాగంలో 1TB 5400rpm SATA HDD వరకు ఉంటుంది. అంతేకాకుండా 1TB PCIe Gen3 SSD వరకు పొందుతారు. TUF A15, TUF A17 రెండూ 48Wh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా DTS: X అల్ట్రా ఆడియోను సపోర్ట్ చేస్తాయి.

Smartphones under Rs 15000: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

WhatsApp: అలర్ట్... మీ దగ్గర ఈ ఫోన్ ఉందా? అయితే వాట్సప్ పనిచేయదు

HP Envy x360


సరికొత్త HP ఎన్వీ x360 ప్రారంభ ధర రూ.60,990లు. AMD రైజెన్3 లేదా రైజెన్5 తో పాటు 8GB DDR4 SDRAMతో పాటు 256GB PCle NVMe M.2 SSDలను ఎంచుకోవడానికి వివిధ ఎంపికల్లో వస్తుంది. ఇంకా AMD రేడియన్ వేగా6, రేడియన్ వేగా8 గ్రాఫిక్స్ మధ్య ఎంపికలు ఉన్నాయి. ఏఎండీ రైజెన్ ప్రాసెసర్ ఉండటంతో పాటు ఎన్వీ x360 12.5 గంటల బ్యాటరీ లైఫ్ ను ఒకే ఛార్జితో అందుకోవచ్చని HP సంస్థ పేర్కొంది. 45 నిమిషాల ఛార్జ్ లో బ్యాటరీ లైఫ్ లో సున్నా శాతం నుంచి 50 శాతం బ్యాటరీ లైఫ్ ను అందించడంతో పాటు HP ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ కూడా ఉంది.

సరికొత్త HP ఎన్వీ x360 పూర్తి-HD మైక్రో-ఎడ్జ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ NBT ప్యానెల్ ద్వారా రక్షణ పొందవచ్చు. అదనంగా మీ ప్రయాణంలో వినోద అనుభవాన్ని మెరుగుపరచడానికి నోట్బుక్లో HP ఆడియో బూస్ట్ టెక్నాలజీతో పాటు బ్యాంగ్, ఓలుఫ్సేన్ స్పీకర్లు ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:December 30, 2020, 16:32 IST