Home /News /technology /

DELL G15 GAMING LAPTOP WITH AMD RYZEN CPU LAUNCHED IN INDIA UMG GH

Dell G15: గేమ్స్ ఆడేవారికి గుడ్ న్యూస్.. గేమింగ్ ల్యాప్‌టాప్ సిరీస్ లాంచ్

గేమింగ్ ల్యాప్‌టాప్ లాంచ్ చేసిన డెల్.

గేమింగ్ ల్యాప్‌టాప్ లాంచ్ చేసిన డెల్.

టెక్ దిగ్గజం డెల్ (Dell) నుంచి మరో కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. ఇండియాలో కొత్త G15 గేమింగ్ ల్యాప్‌టాప్ (G15 gaming laptop) సిరీస్‌ను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. డెల్ టెక్నాలజీస్ G15 AMD ఎడిషన్ (5525) సిరీస్‌లో మొత్తం 5 వేరియంట్‌లను విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
టెక్ దిగ్గజం డెల్ (Dell) నుంచి మరో కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. ఇండియాలో కొత్త G15 గేమింగ్ ల్యాప్‌టాప్ (G15 gaming laptop) సిరీస్‌ను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. డెల్ టెక్నాలజీస్ G15 AMD ఎడిషన్ (5525) సిరీస్‌లో మొత్తం 5 వేరియంట్‌లను విడుదల చేసింది. ఇవి వివిధ AMD రైజెన్ ప్రాసెసర్‌ల ద్వారా రన్ అవుతాయి. వీటి ధరలు RAM, స్టోరేజ్ వేరియంట్‌లపై ఆధారపడి ఉంటాయి. కంపెనీ ఈ G15 2022 ఎడిషన్స్‌ను AMD రైజెన్ 6000 H సిరీస్ ప్రాసెసర్‌లతో రిఫ్రెష్ చేసింది. యూజర్లు డెల్ G15 5525 డివైజ్‌ను Nvidia RTX 3060 గ్రాఫిక్స్‌తో రన్ చేయవచ్చు. DDR5 RAM, PCIe Gen 4 SSD, 165Hz డిస్‌ప్లే, విండోస్ 11 వంటివి దీని ఇతర స్పెసిఫికేషన్లు.

ఇండియాలో G15 గేమింగ్ ల్యాప్‌టాప్ ధర
డెల్ భారతదేశంలో AMD రైజెన్ 5, 7 ప్రాసెసర్‌లతో G15 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. 8GB RAM గల బేస్ వేరియంట్ ధర రూ. 83,990. 16GB RAM, 512GB స్టోరేజ్‌తో పాటు వేర్వేరు GPU మెమరీతో వచ్చే వివిధ మోడళ్ల ధరలు రూ. 89,990 నుంచి ప్రారంభమవుతాయి. మన దేశంలోని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ నుంచి డెల్ G15 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయవచ్చు.



 డెల్ G15 గేమింగ్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్లు
డెల్ G15 ల్యాప్‌టాప్ 15-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ HD రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 250 nits వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. గేమ్‌ప్లే సమయంలో గేమర్‌లకు ఈ ఫాస్టెస్ట్ రిఫ్రెష్ రేట్ చాలా అవసరం. డెల్ కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌లను విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో అందిస్తోంది. దీంతోపాటు అనేక కనెక్టివిటీ పోర్ట్‌లను చేర్చింది. డెల్ G15 డివైజ్‌లు AMD సిరీస్ రైజెన్ 5, 7 ప్రాసెసర్‌లతో వస్తాయి. వీటిని 8GB, 16GB RAMతో సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ మోడళ్లన్నింటికీ స్టోరేజ్ 512GB SSD. అయితే తాజా లాంచింగ్ ఆఫర్‌లో 6GB వరకు మెమరీ ఉన్న NVIDIA RTX 3050, 3050 Ti, 3060 GPUలను కూడా సొంతం చేసుకోవచ్చు.

ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ సిరీస్‌లో డెల్ క్వాలిటీ సౌండ్ సిస్టమ్‌ను అందిస్తోంది. స్పీకర్లకు డాల్బీ ఆడియో సపోర్ట్ వంటి నిఫ్టీ ఫీచర్లను జోడించింది. గేమ్ షిఫ్ట్ టెక్నాలజీ మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. కీబోర్డ్ బ్యాక్‌లైట్ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. వీటితో పాటు కూలింగ్ వెంట్స్, అల్ట్రా-థిన్ బ్లేడ్‌లు, కాపర్ పైపులతో బిల్డ్ చేసిన ఈ డివైజ్‌లో ఎలాంటి హీటింగ్ ప్రాబ్లమ్స్‌ రావని కంపెనీ పేర్కొంది.
Published by:Mahesh
First published:

Tags: Dell, Gaming, Laptop, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు