FIR on Twitter: ట్విట్టర్‌కు షాక్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. ఫోక్సో చట్టం కింద FIR.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ట్విట్టర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఛైల్డ్ పోర్నోగ్రఫీకి అనుమతి ఇచ్చిందనే ఆరోపణలతో పోలీసులు ట్విట్టర్‌పై కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌పై మరో కొత్త కేసు నమోదైంది. తాజాగా దిల్లీ పోలీసులు సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఛైల్డ్ పోర్నోగ్రఫీకి అనుమతి ఇచ్చిందనే ఆరోపణలతో పోలీసులు ట్విట్టర్‌పై కేసు నమోదు చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ (NCPCR) అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళవారం కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ట్విట్టర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ (ఫోక్సో) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ విషయంపై ట్విట్టర్ ప్రతినిధి ఒకరు స్పందించారు. పిల్లలపై లైంగిక దాడి(సీఎస్ఐ) పట్ల కంపెనీకి జీరో టాలరెన్స్ పాలసీ ఉందని, మైనర్లపై లైంగిక దాడి ఎదుర్కోవడానికి చురుకైన విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. పిల్లలపై లైంగిక దాడులను ఎదుర్కోవడంలో తాము ముందు వరుసలో ఉంటామని, ఆన్ లైన్ వేదికగా వారిపై జరిగే అకృత్యాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సాధనాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.
World Social Media Day: సోషల్ మీడియాకి బానిసగా మారిపోయారా..? ఎలా బయటపడాలి? పూర్తి వివరాలు..
Twitter Down: ట్విట్ట‌ర్ సేవలకు అంతరాయం.. అవి అస‌లు ఓపెన్ కావ‌డం లేదంటున్న నెటిజ‌న్లు..

"ట్విట్టర్ నియమాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ముందుగానే గుర్తించే సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెడుతున్నాం. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇతర ఎన్జీఓలతో కలిసి పనిచేస్తాం" అని ట్విట్టర్ ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే ట్విట్టర్‌పై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని మే 29న సైబర్ సెల్ డిప్యూటీ కమిషనర్ అన్యేష్ రాయ్‌కు రాసిన లేఖలో NCPCR ప్రస్తావించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో సులభంగా దొరుకుతుందని, ట్విట్టర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని NCPCR లేఖలో పేర్కొంది.

వివిధ సెక్సువల్ అబ్యూస్ ఖాతాలు, లింకుల రూపంలో ట్విట్టర్లో పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ లభ్యత గురించి ఎన్సీపీసీఆర్ ఫిర్యాదు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. సంబంధిత చట్టాలు, ఫోక్సో నిబంధనలకు అనుగుణంగా ట్విట్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దిల్లీ పోలీస్ పబ్లిక్ రిలేషన్ యాక్టింగ్ ఆఫీసర్ చిన్మోయ్ బిస్వాల్ అన్నారు. ట్విట్టర్ ఇంక్(Twitter Inc), ట్విట్టర్ కమ్యూనికేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై ఈ కేసు నమోదైంది. ట్విట్టర్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన లింకులు అందుబాటులో ఉన్నాయని ఎన్సీపీసీఆర్ మే 29న రాసిన లేఖలో పేర్కొంది.
Published by:Nikhil Kumar S
First published: