ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. కోట్లాది మంది యూజర్లు వాడే వాట్సాప్‌ను సైబర్ కేటుగాళ్లు తరచూ టార్గెట్ చేస్తున్నారు. యూజర్లు అప్రమత్తంగా లేకపోతే భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఓల్డ్ వాట్సాప్ స్కామ్ (Old Scam) ఇప్పుడు యూజర్లను మళ్లీ టార్గెట్ చేస్తోంది. కేబీసీ జియో లక్కీ డ్రా (KBC Jio Lucky Draw) పేరుతో వాట్సాప్ యూజర్లను స్కామర్లు టార్గెట్ చేస్తున్నట్లు తాజాగా ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ (Delhi Police's Cyber Crime Unit) వెల్లడించింది.
ఈ స్కామ్‌లో భాగంగా "కేబీసీ జియో లక్కీ డ్రాలో మీరు రూ.25 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నార"ని యూజర్లకు స్కామర్లు మెసేజ్ పంపిస్తారని పోలీసులు వివరించారు. సాధారణంగా, ఈ లక్కీ డ్రా మెసేజ్ ఒక వీడియోతో వస్తుంది. ఈ వీడియోలో వాట్సాప్‌లో వ్యక్తిగత వివరాలను పంచుకోమని కోరతారు. ఆ తర్వాత, డబ్బు మీ ఖాతాలో జమ అవుతుందని నమ్మబలుకుతారు. ఇదంతా వట్టి అబద్దమే కాబట్టి ఈ స్కామ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోక తప్పదు.
ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ భారతదేశంలోని వాట్సాప్ యూజర్లందరినీ హెచ్చరిస్తోంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ స్కామ్ మెసేజ్‌ను ఎలా గుర్తించాలో వివరిస్తూ బ్లాగ్‌లో ఓ ప్రత్యేక పోస్ట్‌ని కూడా షేర్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ స్కామ్ మెసేజ్‌లో ఏమంటుంది?
వాట్సాప్ స్కామ్ మెసేజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో, సోనీ లివ్ లోగో కనిపిస్తాయి. కేబీసీ క్విజ్ షో లోగో, ఈ షో హోస్ట్ అమితాబ్ బచ్చన్‌ను కూడా మెసేజ్‌లో చూడవచ్చు. అలానే ఈ మెసేజ్‌లో హిందీ, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉంటాయి. యూజర్లు లక్కీ డ్రాలో భాగంగా రూ. 25 లక్షలు గెలుచుకున్నారనేది ఈ మెసేజ్ సారాంశం. ఇందులో ఒక లాటరీ నంబర్‌ను కూడా గమనించవచ్చు. అయితే ఇందులో పేర్కొన్న వివరాలు అన్నీ ఫేక్! స్కామర్లు +923456808747 లేదా +92 ప్రారంభమయ్యే నంబర్ల నుంచి మెసేజ్ పంపిస్తారు. నిజానికి '92' ISD కోడ్ పాకిస్థాన్‌కు సంబంధించినది. ఇలాంటి కోడ్‌తో వచ్చే నంబర్లను వెంటనే బ్లాక్ చేసి డిలీట్ చేయాలి.
స్కామ్ గురించి యూజర్లు తెలుసుకోవాల్సిన విషయాలు
ఫ్రీగా క్యాష్ ఇస్తామని తెలిపే అన్ని మెసేజ్‌లు ఫేక్ అని యూజర్లు గుర్తించాలి. అలానే రివార్డ్‌లను క్లెయిమ్ చేసేటప్పుడు వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను తెలియని నంబర్లతో షేర్ చేయకూడదు. ఫోన్ నంబర్లు, పేర్లు, ఇతర వివరాలను షేర్ చేయడం వల్ల మీ ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. స్కామర్లు సాధారణంగా వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తారని ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ తెలిపింది.
"యూజర్లు లాటరీ మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి స్కామ్ మెసేజ్లోని నంబర్‌ను సంప్రదించినప్పుడు, స్కామర్ లాటరీని ప్రాసెసింగ్ చేయడంతోపాటు జీఎస్టీ (GST) మొదలైనవాటికి ముందుగా కొంత చెల్లించాలని చెబుతారు. బాధితుడు ఆ డబ్బును డిపాజిట్ చేసిన తర్వాత వారు ఏదో ఒక సాకుతో ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభిస్తారు." అని ఢిల్లీ పోలీస్ విభాగం తెలిపింది. యూజర్లకు ఇలాంటి మెసేజ్ వస్తే అప్రమత్తం కావాలని, అవసరమైతే పోలీసులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber crimes, ONLINE CYBER FRAUD, Scams, Whatsapp