Deleting Facebook: ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డిలీట్‌ చేయాలనుకుంటున్నారా? డేటా డిలీట్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

ప్రతీకాత్మక చిత్రం

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ చేయాలనుకుంటున్నారా? లేదా మీ ఆలోచనలను ఫేస్‌బుక్‌ కంట్రోల్‌ చేయకూడదనకుంటున్నారా? దాని కోసం మీరు ఏం చేయాలో తెలుసుకుందాం.

  • Share this:
ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌ పోకడలపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అది అనుసరిస్తున్న విధానాలపై అనేక దేశాల పార్లమెంట్లలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చాలా మంది ఫేస్‌బుక్ (Facebook) అకౌంట్‌ డిలీట్‌ చేయాలనుకుంటున్నారు. మీరు కూడా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ చేయాలనుకుంటున్నారా? లేదా మీ ఆలోచనలను ఫేస్‌బుక్‌ కంట్రోల్‌ చేయకూడదనకుంటున్నారా? దాని కోసం మీరు ఏం చేయాలో తెలుసుకుందాం.

ఫేస్‌బుక్‌ అకౌంట్ డిలీట్‌ చేయడం సులభం. https://www.facebook.com/deactivate_delete_account లోకి వెళ్లి అక్కడ ఉండే రకరకాల ఆప్షన్స్ ఎంచుకొని.. మీ పాస్‌వర్డ్ ఎంటర్‌ చేసి డిలీట్‌ బటన్‌ నొక్కడం ద్వారా అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు. కానీ అదంత సులభంగా ఉండదు. దీన్ని అర్థం చేసుకునేందుకు.. మీరు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డిలీట్‌ చేసిన తర్వాత ఫేస్‌బుక్‌ ఏం డిలీట్‌ చేస్తుందో ఏవి డిలీట్‌ చేయదో తెలుసుకుందాం.

మీరు యాడ్‌ చేసిన ప్రొఫైల్‌ ఫొటోలు, ఇతర పోస్టులు, మీరు మీ మిత్రులకు పంపిన మెసేజ్‌లు డిలీట్‌ కావు. మీ ఫ్రెండ్స్‌కు పంపిన మెసేజ్‌లలో మీ వ్యక్తిగత సమాచారం ఉంటే, అకౌంట్ డిలీట్ చేసిన తరువాత దానిపై మీకు ఎటువంటి కంట్రోల్‌ ఉండదు. మీరు పోస్టు చేసిన డేటాపై మీకు కంట్రోల్‌ ఉండదు కాబట్టి ఫేస్‌బుక్‌ ఇచ్చిన హామీని మీరు నమ్మాల్సి ఉంటుంది. అయినప్పటికీ మీరు డిలీట్‌ చేయాల్సిందంతా డిలీట్‌ చేయవచ్చు.

ఏం చేయాలంటే..
మీకు సంబంధించి ఫేస్‌బుక్‌ దగ్గర ఉన్న ఇతర సమాచారం తెలుసుకునేందుకు ఈ లింకులో [https://www.facebook.com/dyi/] ఫేస్‌బుక్ డేటా అంతా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా మీరు ఫేస్‌బుక్‌ ఇన్ఫర్మేషన్‌ యాక్సెస్‌ చేసుకోవాలనుకుంటే ఇది మీకు ఉపయోగపడుతుంది.

ఈ లింక్‌ [https://www.facebook.com/settings?tab=applications] క్లిక్‌ చేసి ఫేస్‌బుక్‌తో లింకైన ఉన్న ఇతర అప్లికేషన్ల జాబితా చూడండి. వాటిని ఒకదాని తరువాత ఒకటిగా తొలగించండి.

ఈ లింకులో [https://www.facebook.com/settings?tab=security] లాగిన్‌ అయిన డివైజ్‌ల జాబితా చూడండి. వాటిని తొలగించండి.

మీకు ప్రత్యేకమైన యాప్‌ పాస్‌వర్డ్స్‌ ఉంటే వాటిని యాప్‌ పాస్‌వర్డ్స్‌ సెక్షన్ [https://www.facebook.com/settings?tab=security&section=per_app_passwords&view] నుంచి కూడా తొలగించడం మర్చిపోవద్దు.

ఈ లింకు ద్వారా [https://www.facebook.com/location_history/view/] లొకేషన్‌ హిస్టరీలోకి వెళ్లండి. అక్కడ ఉండే కాగ్‌ వీల్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి లొకేషన్‌ హిస్టరీ అంతా డిలీట్‌ చేయండి.

ఒకవేళ Facebookలో మీ ఫోన్ కాంటాక్ట్స్‌ నుంచి కాంటాక్ట్ ఇంపోర్టు అయి ఉంటే వాటిని ఈ లింక్‌ [https://www.facebook.com/mobile/facebook/contacts/?tab=contacts] ద్వారా తొలగించండి.

ఫేస్‌ రికగ్నిషన్‌ను ఈ లింక్ [https://www.facebook.com/settings?tab=facerec&section=face_recognition&view] ఆఫ్‌ చేయడం ద్వారా తీసేయండి. మీకు సంబంధించిన ఫేస్‌ రికగ్నషిన్‌ డేటాను ఇది డిలీట్‌ చేస్తుంది.

ఫేస్‌బుక్‌లో మీరు ఏమైనా పేమెంట్‌ సమాచారం సేవ్‌ చేస్తే ఈ లింక్ ఉపయోగించి [https://www.facebook.com/settings?tab=payments&section=settings] దాన్ని డిలీట్‌ చేయండి.

ఇక మీరు డిలీట్‌ చేయడం వీలుకాని ఇన్ఫర్మేషన్‌ను మార్చేయండి. ఉదాహరణకు ఈమెయిల్‌ అడ్రస్‌ తొలగించి దాని స్థానంలో ఏదైనా టెంపరరీ లేదా మీరు అంతగా ఉపయోగించని కొత్త ఈమెయిల్ చేర్చండి. మీ అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ తొలంగించండి. ఒకవేళ ఫేస్‌బుక్‌ మీరు డిలీట్‌ చేసిన ప్రొఫైల్‌ కలిగి ఉన్నా ఇవి వాటిని మిస్‌లీడ్‌ చేస్తాయి.

మీ ఫేస్‌బుక్‌ పోస్టు డిలీట్‌ చేసేందుకు ఈ లింక్‌ ఉపయోగించండి. [https://chrome.google.com/webstore/detail/social-book-post-manager/ljfidlkcmdmmibngdfikhffffdmphjae]

చివరగా https://www.facebook.com/deactivate_delete_account లింక్‌లోకి వెళ్లి మీ అకౌంట్ డిలీట్ చేయండి. అంతే కాదు 90 రోజుల వరకు అందులో తిరిగి లాగ్‌ ఇన్‌ కాకూడదు. ఎందుకంటే యూజర్లు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేసిన 90 రోజుల్లో మీరు పోస్టు చేసినవన్నీ డిలీట్‌ చేస్తామని ఫేస్‌బుక్‌ చెబుతోంది.

ఇవి చదవండి..

Realme: రియల్​మీ నుంచి కొత్తగా రెండు మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్లు లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!

Whatsapp: ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్‌లో మీ ఫోన్ ఉందమో చెక్ చేసుకోండి

Nokia C30: భారత మార్కెట్​లోకి నోకియా సి 30 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్​..  జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​తో రూ.10 వేలలోపే లభ్యం

Amazon Prime: అమెజాన్ యూజర్లకు అలర్ట్... భారీగా పెరుగుతున్న ప్రైమ్  చార్జీలు
Published by:Krishna Adithya
First published: