హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apps: ఈ 34 యాప్స్‌తో జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

Apps: ఈ 34 యాప్స్‌తో జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

Apps: ఈ 34 యాప్స్ చాలా డేంజర్.. మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలేట్ చేయండి!

Apps: ఈ 34 యాప్స్ చాలా డేంజర్.. మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలేట్ చేయండి!

Smartphone | మీ ఫోన్‌లో ఈ 34 యాప్స్‌లో ఏమైనా ఉంటే వెంటనే డిలేట్ చేసేయండి. లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వీటిల్లో కొత్త మాల్వేర్ ఉన్నట్లు సెక్యూరిటీ రీసెర్చర్లు పేర్కొంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Phone | స్మార్ట్‌ఫోన్ వాడే వారికి అలర్ట్. ఫోన్‌లో ఏ యాప్స్ అంటే ఆ యాప్స్‌ను (Apps) ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకని అనుకుంటున్నారా? ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ సెక్యూరిటీ అనేది తరుచుగా చర్చల్లో నిలుస్తూ ఉంటుంది. గూగుల్ (Google) సెక్యూరిటీ ఉన్నా కూడా కొన్ని మాల్వేర్లు మాత్రం ఫోన్ యూజర్లకు ఝలక్ ఇస్తూ ఉంటాయి.

ఇప్పుడు తాజాగా హుక్ అనే పేరుతో కొత్త మాల్వేర్ వచ్చినట్లు సెక్యూరిటీ రీసెర్చర్లు పేర్కొంటున్నారు. దాదాపు 34 యాప్స్‌లో ఈ మాల్వేర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల మీరు ఈ యాప్స్‌లో ఏమైనా మీ ఫోన్‌లో కలిగి ఉంటే మాత్రం వెంటనే అలాంటి యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే మీ ఫోన్ డేంజర్‌లో ఉన్నట్లే. తద్వరా మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు హ్యకర్ల చేతికి వెళ్లిపోవచ్చు. అప్పుడు మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది.

గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారికి భారీ షాక్.. ఈ కొత్త రకం మోసంతో జాగ్రత్త!

ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ వైరస్ బ్లాక్‌రాక్, ఈఆర్ఎంఏసీ వంటి వాటిని రూపొందించిన వారే ఇప్పుడు ఈ హుక్ పేరుతో కొత్త మాల్వేర్ తయారు చేశారని సెక్యూరిటీ రీసెర్చర్లు పేర్కొంటున్నారు. అందువల్ల స్మార్ట్‌ఫోన్ వాడే వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్లాక్‌రాక్ అనేది బ్యాంకింగ్ వివరాలను తస్కరిస్తుంది. అలాగే ఈఆర్ఎంఏసీ అనేది క్రిప్టో వాలెట్లను టార్గెట్ చేస్తుంది. ఇకపోతే ఏ ఏ యాప్స్‌లో హుక్ మాల్వేర్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం కొనే వారికి పిడుగులాంటి వార్త.. రూ.60 వేలు దాటేసిన ధర, ఈరోజు కొత్త రేట్లు ఇలా!

ఫన్నీ ఈమోజీ కీబోర్డు, అనిమల్ డూడుల్ డ్రాయింగ్, పేపర్ పెయింట్, డెక్స్‌టరిటీ క్యూఆర్ స్కానింగ్, హార్ట్ రేట్ మానిటర్, ఫన్ పెయింట్ అండ్ కలరింగ్, బ్యూటీ క్రిస్మర్ సాంగ్స్, ఎపికా గేమ్‌బాక్స్ అండ్ హబ్, మ్యాజిక్ ఫేస్ ఏఐ, లవ్ స్టికర్, హెచ్‌డీ స్క్రీన్ మిర్రర్, ఫోన్ టు టీవీ, ఫోటో వాయిస్ ట్రాన్స్‌లేటర్, ఎఫెక్ట్ వాయిస్ ఛేంజ్, క్విక్ పీడీఎఫ్ స్కానర్, ఫాస్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్, పర్ఫెక్ట్ ఫేస్ స్వాప్, ఎఫెక్ట్స్ ఫోటో డిటర్, సూర్ ఈమోజీ ఎడిటర్ అండ్ స్టిక్కర్, బ్లూ వాయిస్ చేంజర్ వంటి యాప్స్ ఉన్నాయి.

అలాగే కూల్ స్క్రీన్ మిర్రరింగ్, ఫోన్ క్లీనర్ లైట్, డిజిటల్ క్లాక్ ఆల్‌వేస్ డిస్‌ప్లే, లైవ్ వాల్ పేపర్ హెచ్‌డీ 3డీ 4డీ, గ్రేప్ కెమెరా అండ్ ఫోటో ఎడిటర్, బ్లడ్ గ్గూకోజ్ రికార్డర్, క్లెవర్ క్లీన్ బ్యాటరీ సేవలర్, ఆల్బమ్ లైవ్ వాల్‌పేపర్ అండ్ థీమ్, షార్ట్‌కట్ స్క్రీన్ మిర్రర్, మైండ్ మెసేజ్, అడ్వాన్స్‌డ్ కాస్ట్ స్క్రీన్, కలరింగ్ పెయింట్ వంటి యాప్స్‌లో మాల్వేర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల మీ ఫోన్‌లో ఈ యాప్స్‌లో ఏమైనా ఉంటే వెంటనే డిలేట్ చేసేయండి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు రివ్యూలు కూడా చూడండి.

First published:

Tags: Apps, FAKE APPS, Mobile phone, Smartphone

ఉత్తమ కథలు