• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • DEAR MOON TRIP JAPANESE BILLIONAIRE TO FLY EIGHT MEMBERS OF THE PUBLIC ON SPACEX MOON FLIGHT ON 2023 NK

Moon Trip: చందమామ చెంతకు వెళ్లాలని ఉందా... అయితే ఈ ఆఫర్ మీ కోసమే...

Moon Trip: చందమామ చెంతకు వెళ్లాలని ఉందా... అయితే ఈ ఆఫర్ మీ కోసమే...

Moon Trip: చందమామ చెంతకు వెళ్లాలని ఉందా... అయితే ఈ ఆఫర్ మీ కోసమే... (ప్రతీకాత్మక చిత్రం)

Moon Trip: అందరికీ తెలుసు... చందమామ పైకి వెళ్లాలంటే కోట్లు కావాలని... మరి సామాన్య ప్రజలు కూడా వెళ్లేందుకు ఎలా ఛాన్స్ లభిస్తోంది? ఆ ఆఫర్ ఎలా పొందాలి?

  • Share this:
    Moon Trip: చందమామ రావే... జాబిల్లి రావే అంటూ తల్లి ముద్దలు పెడుతుంటే... హాయిగా తినేసి... ఆ చందమామపై ప్రేమను పెంచుకుంటాం మనం. తీరా పెద్దయ్యాక... ఆ మూన్ అక్కడే ఉంటుంది... మనం ఇక్కడే ఉంటాం... రోజూ దాన్ని చూస్తూ... సంతృప్తి చెందుతాం. అలాంటిది ఇప్పుడు జాబిల్లి చెంతకే వెళ్లే ఛాన్స్ వస్తే... ఎగిరి గంతెయ్యాల్సిందే. జపాన్‌కి చెందిన బిలియనీర్ యుసాకు మాజెవా (Yusaku Maezawa)... మంగళవారం ఓ సంచలన ప్రకటన చేశారు. తనతోపాటూ... చందమామ దగ్గరకు వెళ్లేందుకు 8 మందిని ఎంపిక చేసుకుంటానని తెలిపారు. ఈ ట్రిప్ 2023లో ఉంటుంది. ప్రైవేట్ రోదసీ సంస్థ స్పేస్‌ఎక్స్‌కి చెందిన స్టార్‌షిప్‌లో ఈ టూర్ ఉంటుంది.

    ఓ వీడియో రిలీజ్ చేసిన యుసాకూ... "నేను ఆహ్వానిస్తున్నాను. నాతోపాటూ... ఈ చందమామ మిషన్‌లో చేరండి" అని కోరారు.


    యుసాకు... 2018 సెప్టెంబర్‌లో స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత ఎలన్ మస్క్‌తో కలిసి ఈ మూన్ మిషన్ ప్రకటించారు. చందమామ చుట్టూ తిరిగేలా మిషన్ ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పేరు డియర్ మూన్ (dearMoon)... ఇందులో మొత్తం 10 నుంచి 12 ఉంటారు. వారిలో 8 మందిని ప్రజల నుంచి ఎంపిక చేస్తారు. వారందరికీ అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని యుసాకు తెలిపారు. ఈ డబ్బును ఆయన తన ఫ్యాషన్ రిటైల్ కంపెనీ జోజోటౌన్ (Zozotown) నుంచి కేటాయిస్తున్నారు. ఐతే... 2019లో ఈ కంపెనీలోని తన వాటాలో చాలా భాగాన్ని ఆయన సాఫ్ట్‌బ్యాక్ కి అమ్మేశారు. ఆతర్వాత జోజోటౌన్‌కి రాజీనామా చేశారు.

    ఈ ప్రాజెక్టులో భాగంగా... చందమామ చెంతకు వెళ్లేందుకు 3 రోజులు పడుతుంది. ఆ తర్వాత చందమామ చుట్టూ తిరిగేలా కక్ష్యలోకి రాకెట్ వెళ్తుంది. అలా జర్నీ పూర్తయ్యాక... మళ్లీ మూడ్రోజుల పాటూ ప్రయాణించి భూమికి వస్తారు. ఇది మొదటి ప్రైవేట్ ల్యూనార్ మిషన్. ఈ మిషన్‌లో రాకెట్... ఒకప్పటి అపోలో మిషన్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

    డియర్ మూన్ ప్రాజెక్టు


    ఇలా రిజిస్టర్ అవ్వాలి:
    ఈ ప్రాజెక్టులో చేరాలనుకునేవారు డియర్ మూన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. మార్చి 14 వరకూ ఈ ఛాన్స్ ఉంది. అభ్యర్థులు తమ పేరు, దేశం పేరు, ఈమెయిల్ అడ్రెస్, ఫొటోను ఇవ్వాలి. మార్చి 21 నుంచి స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫైనల్ ఇంటర్వ్యూ, మెడికల్ చెకప్... మేలో జరుగుతాయి.

    ఇది కూడా చదవండి: ఈ వస్తువులు గిఫ్టుగా ఇవ్వొద్దు, తీసుకోవద్దు.. అలాచేస్తే జీవితంలో అతి పెద్ద తప్పు చేసినట్లే

    వెళ్లానుకునేవారు అంతరిక్షంలో ఏం చెయ్యాలనుకుంటున్నారో ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. అలాగే తమలా వచ్చే వారికి పూర్తి సపోర్టుగా నిలవాలి. వారితో కలిసిపోవాలి. మరి మీకు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి మరి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు