హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Muslim Dating Apps: ముస్లింల కోసం ప్రత్యేకంగా డేటింగ్ యాప్స్.. వీటి ద్వారా ఎన్నో వివాహాలు.. యాప్స్ వివరాలు ఇలా..

Muslim Dating Apps: ముస్లింల కోసం ప్రత్యేకంగా డేటింగ్ యాప్స్.. వీటి ద్వారా ఎన్నో వివాహాలు.. యాప్స్ వివరాలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Muslim Dating Apps: వివాహం నిశ్చయం చేసే పద్ధతులు మతాల వారీగా మారుతుంటాయి. మ్యాట్రిమొనీ యాప్స్, డేటింగ్ యాప్స్ వంటి వాటికి చాలామంది దూరంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఇంతకు ముందెన్నడు లేని విధంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో కలల జీవిత భాగస్వామిని కనుగొనడానికి ఇప్పుడు ముస్లిం డేటింగ్ యాప్స్ సైతం సాయం చేస్తున్నాయి. వివరాలిలా..

ఇంకా చదవండి ...

(Mirza Ghani Baig, News18)

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైన ఘట్టం. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లితో మనిషి జీవితం మరో మలుపు తీసుకుంటుంది. అప్పటి వరకు పెరిగిన ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. జీవితాంతం తోడుండే భాగస్వామిని పొందడం అంత సులభం కాదు. అయితే వివాహం నిశ్చయం చేసే పద్ధతులు మతాల వారీగా మారుతుంటాయి. మ్యాట్రిమొనీ యాప్స్, డేటింగ్ యాప్స్ వంటి వాటికి చాలామంది దూరంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఇంతకు ముందెన్నడు లేని విధంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో కలల జీవిత భాగస్వామిని కనుగొనడానికి ఇప్పుడు ముస్లిం డేటింగ్ యాప్స్ సైతం సాయం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ముస్లిం డేటింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం.

ఈహార్మనీ..

ఇది యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, యూకే లాంటి పాశ్చాత్య దేశాల్లో సింగిల్ ముస్లిం ప్రొఫెషనల్ కోసం రూపొందించిన యాప్. ఇందులో మీ ప్రాధాన్యతల ప్రకారం ప్రొఫెషనల్ వ్యక్తులను నేరుగా కలిసే విధంగా మ్యాచ్‌ను ఏర్పాటు చేస్తాయి.

ముస్లీమా..

ఈ యాప్ ఉచిత సేవలతో పాటు పేమెంట్ సేవలను అందిస్తుంది. ఇది చాలా కఠిన యూజర్ వెరిఫికేషన్ పాలసీతో ప్రాచుర్యం పొందింది. ఈ యాప్ అల్గారిథం యూజర్ల సమాధానాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర వినియోగదారులతో కలుపుతుంది. అల్జీరియా, ఫ్రాన్స్, యూకే, సౌదీ అరేబియా నుంచి ఎక్కువ మంది యూజర్లు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారు.

ముస్లిం ఫ్రెండ్స్..

ఈ యాప్ మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, కెనడా, యూఎస్ లాంటి దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఇటీవలే ఈ సిలికాన్ వ్యాలీ కంపెనీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇతర పోటీదారులతో పోలీస్తే ముస్లిం ఫ్రెండ్స్ చౌకైన ప్లాన్స్ ను కలిగి ఉంది.

ఎలైట్ సింగిల్స్ (Elitesingles)..

ఈ ఆన్ లైన్ డేటింగ్ సర్వీస్.. యూఎస్ఏలో మాత్రమే 5 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. అంతేకాకుండా ధర విషయంలో ఈ యాప్ ఉచిత, ప్రీమియం ప్రణాళికలను కలిగి ఉంది. ఈ యాప్ ఆలోచనలు, లక్షణాలను పర్యవేక్షించే వ్యక్తిత్వ అంచనాలపై ఆధారపడి ఉంటుంది.

మజ్ మ్యాచ్ (Muzmatch)..

ఈ యాప్ 90 దేశాల్లో 4 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లను కలిగి ఉంది. ఈ యాప్‌లో ఉచితంగా చాట్ చేయవచ్చు. వీడియో కాల్ చేయవచ్చు. యూజర్లు ముస్లింను వారి ప్రాంతం, నగరం, దుస్తులు, శాఖ, మతతత్వం, ఎంత మేరకు ప్రార్థిస్తారు, భాష, విద్య, వృత్తి లాంటి మరెన్నో వడపోతను కలిగి ఉంటుంది.

ఇష్క్(Eshq)- మోడర్న్ ముస్లిం డేటింగ్ యాప్..

ఈ యాప్‌ను ప్రత్యేకంగా ఐఫోన్ కోసం మాత్రమే రూపొందించారు. కంపెనీ వెబ్ సైట్ ప్రకారం త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్ అందుబాటులోకి రానుంది. మహిళా వినియోగదారుల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ యాప్, వారిని శక్తిమంతం చేస్తుందని సంస్థ పేర్కొంది. యూజర్లు వివాహం, డేటింగ్ లేదా స్నేహం లాంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

సలామ్స్..

దీన్ని ఇంతకుముందు మైండర్ అని పిలిచేవారు. ఇందులో హలాల్, సింపుల్, సేఫ్, సురక్షితమైన డేటింగ్ ను అందిస్తున్నట్లు సలామ్స్ చెప్పింది. ఈ యాప్ ప్రొఫైల్స్ లో యూజర్, విద్య, శాఖ, కెరీర్, ఎత్తు, ప్రార్థన స్థాయిలు లాంటి అంశాలను ఫిల్టర్ చేయవచ్చు. ఈ యాప్ పాపులరైన టిండర్‌ను పోలి ఉంటుంది.

సింగిల్ ముస్లీమ్..

ఈ యాప్ 2.5 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంటుంది. ఇది వినియోగదారు గోప్యతను రక్షించడానికి ఫోటోలను యాక్సెస్ చేస్తుంది. వృత్తి, వయస్సు, భౌతిక లక్షణాలు, మతం ద్వారా శోధించడానికి మిమ్మల్ని అనుమతించే ముస్లిం డేటింగ్ వెబ్ సైట్లలో సింగిల్ ముస్లీమ్ ఒకటి.

కిరాన్..

రెండు మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఈ యాప్ ముస్లిం నిర్వహణలో నడుస్తోన్న ఏకైక డేటింగ్ యాప్. ఈ యాప్ ప్రామాణిక, ప్రీమియం సభ్యత్వ రుసుములను కలిగి ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక డేటింక్ విభాగంలో సరిపోతుంది.

సలాం లవ్..

యూజర్లు తమ జీవిత భాగస్వామిని కనుగొనడానికి చిన్న ప్రశ్నాపత్రానికి సమాధానం ఇవ్వాలి. ముస్లిం వివాహం కోరుకునే అరబ్, ఆసియా ముస్లిం సింగిల్స్ నెట్వర్క్‌లలో సలాం లవ్ ఒకటి. మ్యాచ్ మేకింగ్ సేవల్లో 15 ఏళ్ల అనుభవంతో పాటు షియా, సున్నీ సింగిల్స్ ను స్వాగతిస్తోంది. వినియోగదారులు ఒకరినొకరు తెలుసుకోవడానికి చాట్ రూమ్ లు, బ్లాగులు, ఫోరమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ముస్లిం మాట్రిమోని..

ఇది భారతీయ డేటింగ్ సర్వీస్. ఇతర సభ్యుల నుంచి చిత్రాలు, ఫోన్, నంబర్లు, జాతకాలను సురక్షితంగా ఉంచడానికి వినియోగదారులకు ప్రైవసీ ఉంటుంది. మీరు ఓ ప్రొఫైల్ ను సృష్టించుకొని జీవిత భాగస్వామి కోసం శోధించవచ్చు. ఆసక్తి ఉన్న మ్యాచ్ లను ఇష్టపడవచ్చు. పరస్ఫర మ్యాచ్ లను కూడా వీక్షించవచ్చు.

యూజర్ల అనుభవాలు ఎలా ఉన్నాయి?

ముస్లిం డేటింగ్ యాప్స్ పై వినియోగదారులు మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నారు. వ్యక్తిగత సంభాషణల పరంగా భారత్ బయట ముస్లింలను కలవడానికి మంచి సమయం వచ్చిందని, వారి సమస్యలపై చర్చించడం చిరస్మరణీయ అనుభవమని ఓ యూజర్ తెలిపారు. కరోనా కారణంగా ప్రత్యక్షంగా కలవలేకపోయానని చెప్పారు. ఇష్క్ యాప్‌లో రిజిస్టరైన ఓ మహిళ కూడా తన అనుభవాన్ని పంచుకుంది. ఈ యాప్ తనకు బాగా ఉపయోగపడిందని, గతేడాది వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్నానని తెలిపింది. కుటుంబం కూడా అతణ్ని అంగీకరించిందని తెలిపింది. ముస్లిం డేటింగ్ యాప్స్ ముస్లిం అమ్మాయిలకు మంచి ఎంపిక అని, జీవిత భాగస్వామిని కనుగొనటానికి అధికారం ఇచ్చిందని చెప్పింది. అయితే డేటింగ్ చేసే ముందు సోషల్ మీడియా ద్వారా వినియోగదారులను శోధించాలని సూచించింది.

ప్రైవసీ పాలసీ ఎలా ఉంటుంది?

ముస్లిం డేటింగ్ యాప్స్ గోప్యత విషయంలో నకిలీ ఐడీలు, ప్రొపైల్ సృష్టించే అవకాశముందని హైదరాబాద్‌కు చెందిన ఈ-స్విప్ట్ సాఫ్ట్ వేర్ డైరెక్టర్ సయీద్ ఎంఏ చెప్పారు. ఇష్క్ యాప్ లో బలమైన ధ్రువీకరణ వ్యవస్థ ఉందని, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నూతన వినియోగదారుల నుంచి ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్ ఖాతాలు లింక్ అడుగుతుందని అన్నారు. ఈ యాప్స్ సృష్టిస్తున్న టెక్ కంపెనీలు యూజర్ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ పాలసీ ఉంచాలని ఆయన సూచించారు. ఉద్యోగ వెబ్ సైట్ నౌకరీ.కామ్ లో యూజర్ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఉందని ఆయన అన్నారు. ధ్రువీకరణ తర్వాత ఏదైనా సమాచారం దొరికితే ఖాతా బ్లాక్ చేస్తారని, ముస్లిం డేటింగ్ యాప్స్ లో కూడా దీన్ని ప్రవేశ పెట్టాలని తెలిపారు.

ఇస్లాంలో డేటింగ్ సంస్కృతికి అనుమతి ఉందా?

ముస్లిం వినియోగదారులు డేటింగ్ యాప్స్ లో ఫొటోలు అప్ లోడ్ చేయవద్దని కొందరు ముస్లిం పెద్దలు సూచిస్తున్నారు. మహిళల చిత్రాలను వేలం వేసిన కొన్ని సంఘటన గురించి మీడియా నివేదికలను ఎత్తిచూపారు. ముస్లిం వినియోగదారులు సామాజిక లేదా డేటింగ్ యాప్స్ ద్వారా కలిసే ముందు వారి నేఫథ్యాన్ని పరిశోధించాలని సలహా ఇస్తున్నారు. వివాహానికి ముందు వరుడు, వధువు కుటుంబాలు ఒకరినొకరు తెలుసుకోవాలని సూచించారు. పెళ్లికి ముందు వధూవరుల సమావేశాలకు ఇస్లాం అనుమతించిందని, అయితే అందరూ హిజాబ్ షరతులను పాటించాలని ప్రముఖులు చెబుతున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Dating App, Match, Muslim brothers

ఉత్తమ కథలు