Shock: 61.7 కోట్ల యూజర్ డేటా లీక్... మీ యాప్స్ సేఫేనా?

Data Leak | యూజర్ నేమ్, ఇమెయిల్ ఐడీ, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్, లొకేషన్, సోషల్ మీడియా ఆథెంటికేషన్ టోకెన్స్, వ్యక్తిగత సమాచారం మొత్తం గల్లంతైందన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: February 15, 2019, 9:41 AM IST
Shock: 61.7 కోట్ల యూజర్ డేటా లీక్... మీ యాప్స్ సేఫేనా?
Data Leak: 16 యాప్స్ నుంచి 61.7 కోట్ల యూజర్ డేటా లీక్... మీ డేటా భద్రమేనా?
news18-telugu
Updated: February 15, 2019, 9:41 AM IST
మీరు డబ్‌స్మాష్, మైఫిట్‌నెస్ పాల్ లాంటి యాప్స్ వాడుతున్నారా? అయితే మీకు పెద్ద షాకే. బ్రిటీష్ వెబ్‌సైట్ The Register కథనం ప్రకారం సైబర్ నేరగాళ్లు 61.7 కోట్ల మంది యూజర్ల డేటాను కొట్టేశారు. వాటిని డార్క్ వెబ్‌లో అమ్ముకున్నారు. Dubsmash, MyFitnessPal, 500px, ShareThis లాంటి యాప్స్ నుంచి డేటా చోరీకి గురైందన్నది ఆ వెబ్‌సైట్ కథనం. యూజర్ నేమ్, ఇమెయిల్ ఐడీ, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్, లొకేషన్, సోషల్ మీడియా ఆథెంటికేషన్ టోకెన్స్, వ్యక్తిగత సమాచారం మొత్తం గల్లంతైందన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది.

Read this: SBI Card: మీ ఎస్‌బీఐ కార్డు పోయిందా? వెంటనే ఇలా బ్లాక్ చేయొచ్చు

data leak, data scam, dark web, online data, data breach, dubsmash, myfitnesspal, 500px, sharethis, hautelook, animoto, eyeem, 8fit, whitepages, fotolog, armor games, bookmate, డేటా లీక్, డేటా స్కామ్, పర్సనల్ డేటా, డార్క్ వెబ్

The Register కథనం ప్రకారం ఓ సెల్లర్ వెబ్‌సైట్‌ను కాంటాక్ట్ చేసి చోరీ చేసిన డేటా డార్క్‌వెబ్‌లో ఉందని సమాచారం ఇచ్చాడు. Dubsmash, MyFitnessPal, MyHeritage, ShareThis, HauteLook, Animoto, EyeEm, 8fit, Whitepages, Fotolog, 500px, Armor Games, BookMate, CoffeeMeetsBagel, Artsy, DataCamp యాప్స్, వెబ్‌సైట్స్ నుంచి డేటా కొట్టేసి అమ్మినట్టు ఆ కథనంలో వివరించారు. ఒక్క Dubsmash నుంచే 16.2 కోట్ల అకౌంట్ల డేటా గల్లంతైందని సమాచారం. The Register కథనం పోస్ట్ అవగానే 500px, EyeEm యాప్ డెవలపర్లు తమ డేటా హ్యాకైందని, పాస్‌వర్డ్స్ మార్చుకోవాలని యూజర్లకు సమాచారం ఇచ్చామని వెల్లడించడం విశేషం.



Read this: Flipkart TV Days: టీవీ కొనాలా? ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్స్ ఇవే...

data leak, data scam, dark web, online data, data breach, dubsmash, myfitnesspal, 500px, sharethis, hautelook, animoto, eyeem, 8fit, whitepages, fotolog, armor games, bookmate, డేటా లీక్, డేటా స్కామ్, పర్సనల్ డేటా, డార్క్ వెబ్

అంతకుముందు MyHeritage, MyFitnessPal, Animoto కూడా యూజర్లకు హ్యాకింగ్ గురించి సమాచారం ఇచ్చాయి. ఏఏ యాప్‌ నుంచి ఎంతమంది డేటా గల్లంతైందో చూడండి.
Loading...
Dubsmash- 16.2 కోట్లు
MyFitnessPal- 15.1 కోట్లు
MyHeritage- 9.2 కోట్లు
ShareThis- 4.1 కోట్లు
HauteLook- 2.8 కోట్లు
Animoto- 2.5 కోట్లు
EyeEm- 2.2 కోట్లు
8fit- 2 కోట్లు
Whitepages- 1.8 కోట్లు
Fotolog- 1.6 కోట్లు
500px- 1.5 కోట్లు
Armor Games- 1.1 కోట్లు
BookMate- 80 లక్షలు
CoffeeMeetsBagel- 60 లక్షలు
Artsy- 10 లక్షలు
DataCamp- 7 లక్షలు (700,000 details)

వీటిలో మీరు ఏదైనా యాప్ లేదా వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నట్టైతే మీ డేటాను సైబర్ నేరగాళ్లు కొట్టేశారో లేదో మీరు తెలుసుకోవచ్చు. ఇందుకోసం haveibeenpwned.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో మీ ఇమెయిల్ ఐడీ టైప్ చేస్తే మీ డేటా ఎంత సురక్షితమో తెలిసిపోతుంది.

Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

ఇవి కూడా చదవండి:

Xiaomi Redmi Note 7: ఫిబ్రవరి 28న లాంఛ్ కానున్న రెడ్‌మీ నోట్ 7

Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

Amazon, Google, Audi... ఈ లోగో వెనుక సీక్రెట్ మీనింగ్ ఏంటో తెలుసా?
First published: February 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...