యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నవారికి షాక్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటా లీకైంది. ఇటీవల కాలంలో ఇది అతిపెద్ద డేటా లీక్.

news18-telugu
Updated: August 21, 2020, 4:12 PM IST
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నవారికి షాక్
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నవారికి షాక్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు యూట్యూబ్ వాడుతున్నారా? ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? అయితే మీ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లి ఉంటుంది. మీదే కాదు... ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల డేటా లీక్ అయింది. కేవలం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల డేటా మాత్రమే కాదు... టిక్‌టాక్ అకౌంట్లలోని డేటా లీక్ అయింది. ఈ మూడు ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్స్ ఉన్నవారి అనేక వివరాలు లీక్ అయ్యాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అసలు ఏఏ సమాచారం లీక్ అయిందో తెలుసుకుంటే మీకు షాక్ అవ్వాల్సిందే. ప్రొఫైల్ పేరు, పూర్తి పేరు, ప్రొఫైల్ ఫోటో, అకౌంట్ డిస్క్రిప్షన్, ఫాలోయర్స్ సంఖ్య, ఎంగేజ్‌మెంట్ రేట్, లైక్స్, వయస్సు, జెండర్ ఇలా చాలా వివరాలు లీక్ అయ్యాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ కంపారిటెక్ సంస్థలోని సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ బయటపెట్టింది. ఇటీవల కాలంలో ఇది అతిపెద్ద డేటా లీక్ అని ఆ టీమ్ అభిప్రాయపడింది.

Smartphone Hack: మీ స్మార్ట్‌‌ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తే హ్యాక్ అయినట్టే

Samsung Galaxy M31s: సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్

డార్క్ వెబ్ సైబర్ క్రైమ్ ఫోరమ్స్‌లో ఈ డేటా లీక్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. డీప్ సోషల్ అనే కంపెనీ దగ్గర లీక్ అయిన డేటా ఉంది. అయితే ఈ కంపెనీ ఇప్పటికే మూతపడింది. ఆగస్ట్ 1 నాటికి ఇలా మూడు కాపీల డేటా లీక్ అయినట్టు కంపారిటెక్ లీడ్ రీసెర్చర్ బాబ్ డియాచెంకో వెల్లడించారు. డీప్ సోషల్ కంపెనీని కాంటాక్ట్ చేస్తే అది హాంకాంగ్‌కు చెందిన సోషల్ డేటా సంస్థ అని తేలింది. డార్క్ వెబ్‌లో లీక్ అయిన ఈ డేటాను మోసాలు చేయడానికి, సైబర్ నేరాలు చేయడానికి ఉపయోగించే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ కంపారిటెక్ ఆందోళన వ్యక్తం చేసింది.

Realme C15 vs Realme C12: రూ.10,000 లోపు రిలీజైన ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్... తెలుసుకోండి

World Photography Day: ఫోటోలు బాగా రావాలా? బెస్ట్ కెమెరా ఉన్న 8 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

గతేడాది కోట్లాది మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్ అయిందన్న విషయాన్ని కంపారిటెక్ లీడ్ రీసెర్చర్ బాబ్ డియాచెంకో గుర్తించడం విశేషం. ఇలా యూజర్ల డేటా లీక్ అయ్యాయనే వార్తలు తరచూ చూస్తుంటాం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లాంటి ప్లాట్‌ఫామ్స్ నుంచి యూజర్ల డేటా ఎప్పుడూ లీక్ అవుతూనే ఉంటుంది. ఆ డేటాను సైబర్ నేరగాళ్లు వాడుకొని మోసాలకు పాల్పడుతుంటారు.
Published by: Santhosh Kumar S
First published: August 21, 2020, 4:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading