Alert: 77 కోట్ల ఇమెయిల్ అడ్రస్‌లు లీక్: మీ అకౌంట్ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు

'Collection #1' పేరుతో జరిగిన ఈ డేటా ఉల్లంఘనను మొదట రీసెర్చర్ ట్రాయ్ హంట్ గుర్తించడంతో ప్రపంచానికి తెలిసింది. ఈ మొత్తం డేటాను 12,000 వేర్వేరు ఫైల్స్‌లో సేకరించారని, ఆ డేటా మొత్తం 87 జీబీ ఉంటుందని అంచనా.

news18-telugu
Updated: January 18, 2019, 10:30 AM IST
Alert: 77 కోట్ల ఇమెయిల్ అడ్రస్‌లు లీక్: మీ అకౌంట్ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు
Alert: 77 కోట్ల ఇమెయిల్ అడ్రస్‌లు లీక్: మీ అకౌంట్ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు
news18-telugu
Updated: January 18, 2019, 10:30 AM IST
77 కోట్ల ఇమెయిల్ అకౌంట్ల వివరాలు లీకయ్యాయన్న వార్తలు ఇప్పుడు నెటిజన్లను కలవరపరుస్తున్నాయి. అవును... పదులు కాదు వందలు కాదు కోట్లల్లో ఇమెయిల్ అకౌంట్లపై గురిపెట్టారు హ్యాకర్లు. ఇది అతిపెద్ద డేటా లీక్ అని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. 77,29,04,991 ఇమెయిల్ అడ్రస్‌లు, 2.1 కోట్ల యూనిక్ పాస్‌వర్డ్స్ లీకయ్యాయని తాజా సమాచారం. 'Collection #1' పేరుతో జరిగిన ఈ డేటా ఉల్లంఘనను మొదట రీసెర్చర్ ట్రాయ్ హంట్ గుర్తించడంతో ప్రపంచానికి తెలిసింది. ఈ మొత్తం డేటాను 12,000 వేర్వేరు ఫైల్స్‌లో సేకరించారని, ఆ డేటా మొత్తం 87 జీబీ ఉంటుందని అంచనా.

ఇవి కూాడా చదవండి:

WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?

మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ 12 టిప్స్ మీ కోసమేమీ అకౌంట్ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు
ఇప్పటివరకు లీకైన డేటాను https://haveibeenpwned.com/ వెబ్‌సైట్‌లో లోడ్ చేశానని ట్రాయ్ హంట్ చెప్పడం విశేషం. ఎవరైనా తమ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మీ అకౌంట్ హ్యాకైందో లేదో తెలుసుకోవచ్చని ట్రాయ్ హంట్ వివరించారు. ఒకవేళ మీ డేటా లీకైనట్టయితే తెలుస్తుంది. మీ ఇమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్, యూజర్‌నేమ్, ఐపీ అడ్రస్, జియోగ్రఫిక్ లొకేషన్, ఫోన్ నెంబర్, అడ్రస్ లాంటి వివరాలు లీక్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చని ట్రాయ్ హంట్ వివరించారు. అంతే కాదు మీరు ఉపయోగించిన పాస్‌వర్డ్స్ లీక్ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు అదే వెబ్‌సైట్‌లో Pwned Passwords ప్లాట్‌ఫామ్‌లో చెక్ చేసుకోవచ్చు. మీ పాస్‌వర్డ్ లీకైనట్టు అనుమానం వస్తే వెంటనే మార్చుకోవడం మంచిది.
Loading...
ఇవి కూడా చదవండి:

Amazon vs Flipkart: పోటాపోటీగా సేల్స్... ఆఫర్లు ఇవే తెలుసుకోండి

మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోవచ్చు
First published: January 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...