DARWIN GROUP FORAYS INTO E SCOOTER LAUNCHES AFFORDABLE RANGE TWO WHEELERS CHECK PRICE AND FEATURES JNK GH
Darwin EVs: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెట్టిన డార్విన్ గ్రూప్.. తాజాగా మూడు ఈ-స్కూటర్ల విడుదల
మూడు ఈ-స్కూటర్లు విడుదల చేసిన డార్విన్ గ్రూప్ (ప్రతీకాత్మక చిత్రం)
బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) విభాగంలోకి ప్రవేశించింది డార్విన్ ప్లాట్‌ఫారమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (DPGC). ఈ సంస్థ తాజాగా డార్విన్ D-5, డార్విన్ D- 7, డార్విన్ D-14 అనే మూడు కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్లను విడుదల చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) మార్కెట్లోకి మరో సంస్థ అడుగుపెట్టింది. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) విభాగంలోకి ప్రవేశించింది డార్విన్ ప్లాట్‌ఫారమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (DPGC). ఈ సంస్థ తాజాగా డార్విన్ D-5, డార్విన్ D- 7, డార్విన్ D-14 అనే మూడు కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్లను విడుదల చేసింది. ఈ మూడు ఈ-స్కూటర్లలో (Scooter) మస్కులర్ డిజైన్, మైలేజ్ సామర్థ్యం, కీలెస్ ఎంట్రీ, రీజెనరేటివ్ బ్రేకింగ్, స్పీడ్ కంట్రోల్ గేర్, బ్యాటరీ స్వాపింగ్, పెద్ద LED డిస్ప్లే, హై-క్వాలిటీ సస్పెన్షన్, USB మొబైల్ ఛార్జర్ పోర్ట్, హజార్డ్ స్విచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. D5, D7, D14 ఈ- స్కూటర్లు వరుసగా రూ. 68,000, రూ. 73000, రూ. 77,000 (అన్నీ ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (Two Wheelers) ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 70-120 కి.మీ. ప్రయాణించగలవని సంస్థ చెబుతోంది.
ప్రస్తుతం గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లుతోందని చెబుతున్నారు DPGC గ్రూప్ CEO డాక్టర్ రాజా రాయ్ చౌదరి. భారతదేశంలో ఈ మార్పు వేగంగా జరుగుతోందన్నారు. ‘ఈ విద్యుత్ విప్లవానికి డార్విన్ కంపెనీ మరింత సహకారం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మా EV సెగ్మెంట్ నుంచి క్లాస్ లీడింగ్ ప్రొడక్ట్స్ రానున్నాయి. పర్యావరణ అనుకూలమైన ఈ వాహనాలు హరిత విప్లవాన్ని కూడా ప్రోత్సహిస్తాయి’ అని రాజారాయ్ వివరించారు.
* మేడ్ ఇన్ ఇండియా ఈవీలు..
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా D-5, D- 7, D-14 అనే మూడు ఈవీ స్కూటర్లను రూపొందించినట్లు కంపెనీ ప్రకటించింది. ‘ఈ వాహనాల ఆవిష్కరణతో మేము కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం. DPGC కార్బన్ న్యూట్రాలిటీ, సుస్థిరతకు పెద్ద పీట వేస్తోంది. మేము జపనీస్ స్టాండర్డ్స్‌తో సమానంగా ప్రస్తుత EVలను పరిచయం చేస్తున్నాం. క్వాలిటీ ఆస్ట్రియా సెంట్రల్ ఆసియా అందించే అంతర్జాతీయ నాణ్యత ధ్రువీకరణను పొందాం’ అని డార్విన్ కంపెనీ తెలిపింది.
ఈ పరివర్తనలో భాగంగా తమ కంపెనీ ప్రస్తుతం దాదాపు రూ. 450 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పారు డార్విన్ గ్రూప్ ఆటోమొబైల్ బిజినెస్ డైరెక్టర్ అండ్ హెడ్ సౌరభ్ మోహన్ సక్సేనా. అనంతరం పరిశోధన, అభివృద్ధి నుంచి గ్రీన్ వాహనాల ఉత్పత్తి వరకు సమగ్ర విధానాన్ని అందిపుంచుకోనున్నట్లు తెలిపారు. వ్యూహాత్మక సహకారాలు, భాగస్వామ్యాలతో ముందుకు వెళ్లనున్నట్లు సక్సేనా వివరించారు. .
* తక్కువ ధరలోనే ఉత్తమ ఈ-స్కూటర్లు
డార్విన్ EV సరసమైన ధరల్లోనే అత్యుత్తమ నాణ్యత గల వాహనాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉన్న తయారీ కర్మాగారంలో పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన తయారీ పద్ధతులను సంస్థ అవలంబిస్తుంది. ఈ ప్లాంట్‌లో తయారీ, టెస్టింగ్, వెహికల్ అసెంబ్లీ, వెహికల్ ఎండ్ ఆఫ్ లైన్ టెస్టింగ్ (EOL) కోసం ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ వ్యవస్థ ఉంది.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.