Home /News /technology /

DANGEROUS MALWARE ON ANDROID PHONES IF IT IS HACKED MONEY WILL BE EATEN IN YOUR BANK ACCOUNT GH VB

Android Users: ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఈ పాత మాల్వేర్ చొరబడితే అంతే ఇక.. బ్యాంక్ ఖాతా ఖాళీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఎస్కోబార్​ అనే ఓ పాత మాల్వేర్‌ తన రూపం మార్చుకొని మరోసారి విరుచుకుపడుతోంది. 18 దేశాల్లో 190 ఆర్థిక సంస్థలకు చెందిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తుంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు(Android Users) బిగ్ అలర్ట్. ఎస్కోబార్​ అనే ఓ పాత మాల్వేర్‌ తన రూపం మార్చుకొని మరోసారి విరుచుకుపడుతోంది. 18 దేశాల్లో 190 ఆర్థిక సంస్థలకు చెందిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తుంది. అయితే, ప్రస్తుతానికైతే ఆ మాల్వేర్ దాడి చేసిన దేశాలు, కస్టమర్ల వివరాలు బయటకు రాలేదు. అయితే, ఈ మాల్వేర్(Malware)​ అత్యంత ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును మాయం చేయగలదని చెబుతున్నారు. ఈ మాల్వేర్​ మీ ఆర్థిక వివరాలు, పాస్‌వర్డులను గుట్టుచప్పుడు కాకుండా హ్యాకర్లకు పంపించేస్తోందని టెక్​ సంస్థ బ్లీపింగ్‌ కంప్యూటర్స్‌(Computers) పేర్కొంది. ఇది ఇతర ఆండ్రాయిడ్ మాల్వేర్‌లా కాకుండా, వెబ్‌లో ఇన్‌స్టాల్ చేసిన APK ఫైల్‌ల ద్వారా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే, ఆండ్రాయిడ్ యజర్లను కొత్త ట్రోజన్‌లకు సంబంధించిన మాల్వేర్ దాడులు, హెచ్చరికలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు కొత్త మాల్వేర్​తో యూజర్ల డేటా మరింత ప్రమాదంలో పడింది.

Zomato-Blinkit Deal: జొమాటోలో క్విక్ డెలివరీ యాప్ బ్లింకిట్​ విలీనం.. డీల్ వాల్యూ ఎంతంటే..?


ఎస్కోబార్ మాల్వేర్​ అంటే?

ఎస్కోబార్​ మాల్వేర్‌ గూగుల్‌ అథెంటికేటర్‌ మల్టీ ఫ్యాక్టర్‌ అథెంటిక్‌ కోడ్స్‌ను చోరీ చేస్తోంది. ఇతరులు మన ఈమెయిల్‌ లేదా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీసుల్లో లాగిన్‌ అవుతోంటే ఈ గూగుల్‌ అథెంటికేటర్‌ మనకు సందేశాలను పంపిస్తుంటుంది. గూగుల్‌ అథెంటికేటర్‌ మల్టీ ఫ్యాక్టర్‌ అథెంటిక్‌ కోడ్స్‌ను హ్యాకర్లకు పంపించడం వల్ల వారు మన పర్సనల్‌, ఫైనాన్షియల్‌ డేటాను సులభంగా యాక్సెస్‌ చేయగలరు. కాగా, ఎస్కోబార్‌ మాల్వేర్ సేకరించిన ప్రతి సమాచారం సీ2 సర్వర్లో అప్‌లోడ్‌ అవుతుంది. మన ఫోన్​కు వచ్చే ఎస్‌ఎంఎస్‌, కాల్‌ లాగ్స్‌, కీ లాగ్స్‌, నోటిఫికేషన్లు, గూగుల్‌ అథెంటికేటర్‌ కోడ్స్‌ను ఈ సర్వర్లలో నిక్షిప్తం చేస్తోంది. తద్వారా, సులభంగా ఓటీపీలను ఆటోరీడ్ చేసి బ్యాంక్​ అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తుంది.

ఫోన్​ కంట్రోల్​ మొత్తం హ్యాకర్ల చేతిలోకి..

ఇలాంటి బ్యాంకింగ్‌ ట్రోజన్‌ వైరస్‌లు రావడం ఇదే తొలిసారి కాదు. 2021లోనూ అబెర్‌బాట్‌ ఆండ్రాయిడ్‌ బగ్‌కు ఇలాంటి లక్షణాలే ఉండేవి. వందల మంది ఆండ్రాయిడ్‌ యూజర్లను ఇది లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. 'ఎస్కో బార్‌' సైతం అచ్చం అలాగే ఉంటుంది. దీని సామర్థ్యం మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఈ ఎస్కో బార్‌ వైరస్‌ సోకిన డివైజ్‌ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. మనకు తెలియకుండానే మన ఫోన్​తో ఫొటోలు క్లిక్‌ చేస్తోంది. ఆడియోలను రికార్డు చేస్తోంది. క్రెడెన్షియల్స్‌ను చోరీ చేసేందుకు కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తోంది. ఏపీకే ఫైల్స్‌ ద్వారా లాగిన్‌ ఫామ్స్‌ను తీసుకుంటోంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌, వెబ్‌సైట్ల లాగిన్‌ సమాచారాన్ని చోరీ చేస్తుంది.

ఆండ్రాయిడ్ మాల్వేర్ నుండి ఎలా రక్షించుకోవాలి?

ఎస్కోబార్‌ మాల్వేర్‌ దాడి నుంచి తప్పించుకోవాలంటే ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్స్ నుండి మాత్రమే యాప్స్​ను డౌన్​లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేయాలి. క్రోమ్​లో దొరికే ఏపీకే ఫైల్స్‌ను అస్సలు ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దు. స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌ చేయాలి. తద్వరా, మాల్వేర్‌ మన డివైజ్​లోకి చేరే క్రమంలో అలర్ట్ మెసేజ్​ వస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Android, Technology

తదుపరి వార్తలు