Home /News /technology /

DALER MEHNDI TO BECOME FIRST INDIAN SINGER TO PERFORM IN THE METAVERSE ALL DETAILS GH VB

Metaverse: మెటావర్స్‌లో పంజాబీ సింగర్ పర్ఫార్మెన్స్‌.. వర్చువల్‌ ప్లాట్‌ఫాంలో మొదటిసారి ఇలా..

మెహందీ ప్రదర్శన

మెహందీ ప్రదర్శన

ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ మెటావర్స్‌లో ప్రత్యేక ప్రదర్శన (Performance) ఇచ్చారు. దీంతో ఈ ప్లాట్‌ఫాంలో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

ప్రస్తుత మెటావర్స్(Metaverse) టెక్నాలజీ బజ్‌ను క్రియేట్ చేస్తున్న ట్రెండ్‌గా మారింది. ఇది ఓ వర్చువల్ నెట్వర్క్. ఇక్కడ వ్యక్తులు తదుపరి స్థాయిలో వర్చువల్‌గా(Virtual) ఇంటరాక్షన్ అవుతుంటారు. ఈ ట్రెండ్‌పై మన భారతీయులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలో అనేక మెటావర్స్ స్టార్టప్‌లు వస్తున్నాయి. అయితే తాజాగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ మెటావర్స్‌లో ప్రత్యేక ప్రదర్శన (Performance) ఇచ్చారు. దీంతో ఈ ప్లాట్‌ఫాంలో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

మెటావర్స్ వేదికల్లో ఒకటైన పార్టీ నైట్‌లో దలేర్ ఈ పర్ఫార్మెన్స్ చేశారు. ఈ విషయాన్ని దలేర్ మెహందీ ఓ వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఈ ప్లాట్‌ఫాం ఇండియన్ మెటావర్స్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ నైట్ వ్యక్తులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. గేమ్స్ ఆడటానికి, ఎన్ఎఫ్‌టీలను సంపాదించడానికి ఈ ప్లాట్‌ఫాం అనుకూలంగా ఉంటుంది. పార్టీ నైట్ బ్లాక్ చెయిన్ ఆధారితమైన డిజిటల్ ప్రపంచం. ఇక్కడ ప్రజలు తగిన అవతార్‌లతో ఫ్రెండ్స్‌తో మీటింగ్స్ నిర్వహించవచ్చు. కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. అంతేకాకుండా ఉమ్మడి పార్టీ ఈవెంట్లు కూడా ఉంటాయని ఈ మెటావర్స్ ప్లాట్‌ఫాం చెబుతోంది.




విస్తరిస్తున్న వర్చువల్ ప్లాట్‌ఫాం
పార్టీనైట్‌లో దేలరీ మెహందీ ఈవెంట్‌ను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రదర్శించారు. ఈ సుప్రసిద్ధ పంజాబీ గాయకుడు ఈ కచేరీలో తన టాప్‌ ట్రాక్స్‌లో కొన్నింటి పాడారు. ట్రావిన్ స్కాట్, జస్టిన్ బీబర్, మార్ష్‌మెల్లో లాంటి గ్లోబల్ పాప్ కళాకారులు మెటావర్స్‌లో గతంలో ప్రదర్శన ఇచ్చారు. కచేరీలను నిర్వహించారు. వినియోగదారులను అలరించడానికి మెటావర్స్ ద్వారా వీలు కల్పించారు. భారత్‌లో కూడా అనేక మెటావర్స్ స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా ఈ ప్లాట్‌ఫాం క్రమేణా విస్తరిస్తోంది.

ఆ కంపెనీలు కూడా..
భారత్‌లో అతిపెద్ద సంగీత సంస్థ అయిన టీ-సిరీస్ కూడా హంగామా టీవీ భాగస్వామ్యంతో మెటావర్స్‌లో ప్రవేశిస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. అంతకుముందు తమిళనాడుకు చెందిన ఓ జంట తమ వివాహ రిసెప్షన్‌ను మెటావర్స్‌ ద్వారా నిర్వహిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరిలో జరగనున్న ఈ ఈవెంట్‌లో వధూవరులతో పాటు ప్రేక్షకులు కూడా డిజిటల్ అవతార్‌లుగా హాజరవుతారు.
Published by:Veera Babu
First published:

Tags: Metaverse, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు