CYBERSECURITY 5 EASY WAYS TO SAFEGUARD YOURSELF AGAINST FAKE WEBSITES GH VB
Cyber Security: ఆన్లైన్ ఫ్రాడ్స్‌తో ఆందోళనగా ఉందా..? సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే ఐదు పద్ధతులు తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
మన రోజువారి జీవితంలో మొబైల్ ఫోన్లు (Mobiles), ల్యాప్‌ట్యాప్ (Laptops)ల వాడకం సాధారణంగా మారింది. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో న్యూస్ చదవడం మొదలు... సినిమాలు (Movies), షాపింగ్ (Shopping), టికెట్స్ బుకింగ్, నగదు చెల్లింపులు వంటి వాటిని ఆన్లైన్ (Online)లో చేయడం మొదలు పెట్టాం.
మన రోజువారి జీవితంలో మొబైల్ ఫోన్లు (Mobiles), ల్యాప్‌ట్యాప్ (Laptops)ల వాడకం సాధారణంగా మారింది. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో న్యూస్ చదవడం మొదలు... సినిమాలు (Movies), షాపింగ్ (Shopping), టికెట్స్ బుకింగ్, నగదు చెల్లింపులు వంటి వాటిని ఆన్లైన్ (Online)లో చేయడం మొదలు పెట్టాం. అయితే దీన్ని అదనుగా చేసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు భారీ ఆఫర్ల పేరుతో ఫేక్ వెబ్‌సైట్స్ (Fake Websites),ఫేక్ లింక్స్ (Fake Links)తో కస్టమర్లను దోచుకుంటున్నారు. దొంగిలించేందుకు వీలుగా ఉండే సాఫ్ట్వేర్ లేదా యాప్స్‌లను మనకు తెలియకుండానే మన మొబైల్స్‌లో లేదా ల్యాప్‌టాప్‌లకు పంపి వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ అకౌంట్లలోని నగదును దొంగిలిస్తున్నారు. అయితే కొన్ని పద్ధతులను పాటించడం ద్వారా మనం నకిలీ వెబ్సైట్ల బారిన పడకుండా ఉండొచ్చు. వాటిలో ఉత్తమమైన 5 మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డొమైన్ (Domain) నేమ్‌పై ఓ కన్నేయండి
ఆఫర్స్ లింక్స్ పంపించే ప్లాట్‌ఫామ్‌ల డొమైన్స్పై ఓ కన్నేసి ఉంచాలి. ఉదాహరణకు మీరు అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్లో షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మీకు పెద్ద మొత్తంలో ఆఫర్ కనిపించింది. దానిపై మీరు క్లిక్ చేయగానే... అది ఇంకో వెబ్‌సైట్‌కు తీసుకెళ్లింది. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ వెబ్సైట్ ఆడ్రస్‌ను కేర్‌ఫుల్‌గా గమనించాలి. అమెజాన్ వెబ్సైట్ డొమైన్ అయితే https://www.amazon.in/ ఉంటుంది.. .అదే నకిలీ వెబ్సైట్ అనుకోండి amazon.way.yes ఇలా వేరే పేర్లతో ఉంటుంది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా ఫేక్ వెబ్సైట్లకు మీరు దూరంగా ఉండొచ్చు.
సెక్యూర్ పేమెంట్స్ గేట్వేస్ వాడాలి
చెల్లింపులు చేసేటప్పుడు సెక్యూర్ పేమెంట్స్ గేట్‌వే (payments gateway)లను ఎంపిక చేసుకోండి. కొత్త వెబ్సైట్ లేదా యాప్‌లలో షాపింగ్ చేసి ఆన్లైన్ నగదు చెల్లింపు చేయాలనుకుంటే మీరు సెక్యూర్ పేమెంట్స్ గేట్వేలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు పేమెంట్స్ పేజిలో పేపాల్, యూపీఐ, రేజర్‌పే వంటి వాటిని నగదు చెల్లింపుల కోసం ఉపయోగిస్తే మంచింది.
అడ్రస్ బార్లో ‘S’ ఉందో లేదో చూసుకోండి
ప్రమాదకర వెబ్సైట్లకు దూరంగా ఉండటానికి మరో మార్గం మీరు సెర్చ్ చేయాలనుకున్న వెబ్సైట్ ఆడ్రస్లో https://లో ‘S’ అనే అక్షరం ఉందో లేదో చూడటం. ఒక వేళ ‘S’ అనే అక్షరం ఉన్నట్లయితే అది సెక్యూర్ అని తెలియజేస్తుంది. ఒకవేళ ‘S’ కనిపించకపోతే వెంటనే ఆ వెబ్‌సైట్‌ను క్లోజ్ చేసేయండి.
స్కాన్ చేసే యాప్‌లను ఉంచుకోండి
ఒక వెబ్సైట్ ప్రమాదకారమా లేదా తెలుసుకోవడానికి మీ మొబైల్ లేదా ల్యాప్‌ట్యాప్‌లలో స్కానర్లను ఉంచుకోండి. Up guard, site guarding, Quttera scan వంటి యాప్స్‌ను మీ మొబైల్స్‌లో ఉంచుకోవడం ద్వారా నకిలీ, ప్రమాదకర వెబ్సైట్లను గుర్తించడం తేలిక అవుతుంది.
తాళం గుర్తు (padlock icon) చెక్ చేయండి
మీరు ఒక వెబ్‌సైట్‌ను విజిట్ చేసేటప్పుడు అడ్రస్ బార్లో https:// కంటే ముందు ఒక తాళం గుర్తు కనబడుతుంది. అంటే అది TLS/SSL Certificate పొంది భద్రంగా ఉందని అర్థం. మీరు ఆ తాళం గుర్తుపై క్లిక్ చేస్తే మీ కనెక్షన్ సెక్యూర్ అని కనబడుతుంది. ఇటువంటి పద్ధతులను ఉపయోగించి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనం తప్పించుకోవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.