ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా మారుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు గుర్తు తెలియని నంబర్‌ల నుంచి మెసేజ్‌లు, ఈమెయిల్స్‌కి వెబ్‌సైట్ లింక్‌లు రావడం చూసే ఉంటారు. కాస్త నిర్లక్ష్యంగా ఉంటే చాలు.. బ్యాంక్ అకౌంట్‌లు (Bank Account) ఖాళీ చేసేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఉన్న ఓ వ్యక్తికి కొన్ని మిస్డ్‌కాల్స్ (Missed Call Fraud) వచ్చాయి. ఆ తర్వాత ఓ ఫోన్ కాల్ రావడంతో.. లిఫ్ట్ చేసినా.. అవతల నుంచి ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.50 లక్షలు మాయం అయ్యాయి. సాధారణంగా సిమ్- బేస్డ్ అథెంటికేషన్‌కి సంబంధిత వ్యక్తి ఫోన్‌కి వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ పై సంఘటనలో మిస్డ్‌కాల్‌తో పని అయిపోయింది.
ఈ మోసానికి కారణం సిమ్ స్వాప్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో నేరగాళ్లు మొదట బాధితుడి వ్యక్తిగత వివరాలను యాక్సెస్ పొందుతారు. ఆ తర్వాత వివిధ మార్గాల్లో ప్రైవసీ డేటాను తెలుసుకొంటారు. అవసరమైన సమాచారం అంతా దొరికిన తర్వాత.. మోసాలకు తెరలేపుతారు. బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు మాయం చేస్తారు. అయితే SIM స్వాప్ ఫ్రాడ్ అంటే ఏంటి? అకౌంట్ నుంచి డబ్బును దొంగిలించడానికి దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? అలాంటి చర్యలను ఎలా నిరోధించవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar Update: ఏ ప్రూఫ్ లేకపోయినా ఆధార్ అప్‌డేట్ చేయండి ఇలా
సాధారణంగా జరిగే దాడుల కంటే SIM స్వాప్ ఫ్రాడ్ విభిన్నం. ఇటీవల ఈ కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగంలో నిర్లక్ష్యంగా ఉండే వారు ఈ మోసగాళ్ల బారిన పడుతున్నారు. SIM స్వాప్ ప్రాసెస్‌లో నేరగాళ్లు మొదట ఫోన్ నంబర్‌కు యాక్సెస్ పొందడానికి ప్రయత్నిస్తారు. ముందుగా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీ వంటివి సేకరిస్తారు. ఆ తర్వాత ఫిషింగ్ ఈమెయిల్‌లను, మెసేజ్‌లను పంపుతారు. అదే విధంగా మోసపూరిత కాల్స్ ద్వారా పర్సనల్ డీటైల్స్ సేకరిస్తారు.
అవసరమైన అన్ని వివరాలను సేకరించిన తర్వాత ప్రాసెస్ మొదలు పెడతారు. ఫోన్‌ను పోగొట్టుకోవడం లేదా పాత సిమ్ పాడైపోవడం వంటి కారణాలతో డూప్లికేట్ సిమ్‌ను జారీ చేయమని టెలికాం ఆపరేటర్‌ను సంప్రదిస్తారు. టెలికాం ఆపరేటర్ కంపెనీకి సమర్పించిన వివరాలు సరైనవే అయితే.. మోసగాడు సులువుగా బాధితుడి నంబర్‌తో కొత్త సిమ్ తీసుకుంటాడు. డూప్లికేట్ సిమ్ యాక్టివ్ అయిన వెంటనే.. టెలికాం కంపెనీలు మొదటి సిమ్‌ను డీయాక్టివేట్ చేసేస్తాయి. ప్రస్తుతం అన్ని రకాల సర్వీస్‌లకు, ట్రాన్సాక్షన్‌లకు ఫోన్ నంబరే ఆధారం. సిమ్‌కే అన్ని రకాల ఓటీపీలు వస్తాయి. కొత్త సిమ్ పొందిన నేరగాళ్లు.. బ్యాంక్ డీటైల్స్‌తో, ఓటీపీలతో అకౌంట్‌ను ఖాళీ చేస్తారు.
Train Tickets: రైలు టికెట్లపై 5 శాతం డిస్కౌంట్... ఈ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి బంపరాఫర్
ఎలాంటి సైబర్ లేదా మొబైల్ మోసాన్ని నిరోధించడానికి మొదట వినియోగదారులకు సరైన అవగాహన అవసరం. నేరగాళ్లు ఎలా తమను మోసం చేయడానికి ప్రయత్నిస్తారో తెలుసుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్‌లను ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు. ఏదైనా ఈమెయిల్ నుంచి ఫైల్స్ డౌన్‌లోడ్ చేసే ముందు, లింక్స్‌పై క్లిక్ చేసే ముందు ఈమెయిల్ ఐడీ వివరాలను ఎల్లప్పుడూ చెక్ చేయాలి. తమను తాము టెలికాం ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్‌లుగా, బ్యాంక్ అధికారులుగా పేర్కొంటూ వచ్చే కాల్స్‌ను నమ్మకూడదు. వారికి బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఈమెయిల్ IDలు లేదా పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ షేర్ చేయకూడదు. బ్యాంకులు లేదా ఆపరేటర్లు ఈ వివరాలను ఎప్పుడూ అడగరని గుర్తించుకోవాలి. ఏదైనా ట్రాన్సాక్షన్ లేదా ఫోన్ కాల్ ముప్పు కలిగిస్తుందని అనుమానిస్తే.. వెంటనే యాక్టివిటీస్ గురించి అధికారులకు లేదా టెలికాం ఆపరేటర్‌కు తెలియజేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, CYBER FRAUD, Phone calls, Smartphone