Flipkart: మీకు ఫ్లిప్‌కార్ట్ లో ఖాతా ఉందా? అయితే, వెంటనే మీ పాస్వర్డ్ మార్చేయండి.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఫ్లిప్‌కార్ట్ ఖాతాదారులకు సైబర్ నిపుణులు కీలక హెచ్చరికలు చేశారు. వెంటనే పాస్వర్డ్ మార్చాలని సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడే అనేక మంది ఈ కామర్స్ వెబ్ సైట్ ద్వారా షాపింగ్ చేస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్ లాంటి యాప్ లు వాడే అనేక మంది వాటన్నిటికీ ఒకే యూజర్ నేమ్, పాస్వర్డ్ వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే మర్చిపోకుండా పాస్వర్డ్ సులువుగా గుర్తుండాలన్న ఆలోచనే ఇందుకు కారణం కావొచ్చు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఖాతాలు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఇటీవల ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ నుంచి అనేక సంఖ్యలో యూజర్ల డేటా లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ డేటా డార్క్ నెట్లో ప్రత్యక్షం కావడంతో అంతా షాక్ కు గురయ్యారు. సైబర్ నేరగాళ్లు ఈ డేటాను ఇతరులకు విక్రయిస్తున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిగ్ బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మూడు ఖాతాలకు ఒకే యూజర్ నేమ్, పాస్వర్డ్ కలిగి ఉన్న వారి ఖాతాలు సులువుగా హ్యాక్ అవుతున్నాయని వారు చెబుతున్నారు.
  Online Banking: ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసే వారికి అలర్ట్.. ఈ 12 తప్పులు అస్సలు చేయకండి

  అమెజాన్ ను ఎప్పుడు వాడే బ్రౌజర్ కాకుండా ఇతర బ్రౌజర్ నుంచి వాడితే ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అమెజాన్ కస్టమర్లు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం తప్పింది. కానీ ఫ్లిప్ కార్ట్ కస్టమర్లు మాత్రం సులువుగా హ్యాకర్ల దాడులకు గురవుతున్నారు. అనేక మంది హ్యాకర్లు ఇతరుల ఫ్లిప్ కార్ట్ ఖాతాలను వినియోగస్తున్నారని సైబర్ నిపుణుడు రాజశేఖర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.  ఫ్లిప్ కార్టు వినియోగదారులు వెంటనే తమ పాస్వర్డ్ ను మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు. ఫ్లిప్ కార్ట్ సైతం కస్టమర్ల భద్రత విషయమై దృష్టిసారించాలని ఆయన సూచించారు. ఈ విషయమై ఫ్లిప్ కార్టుకు సంబంధించిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల భద్రతను కాపాడడానికి ప్రత్యేక బృందం పని చేస్తోందన్నారు.
  Published by:Nikhil Kumar S
  First published: