Alert: ఈ 12 రకాల ఫేక్ ఇమెయిల్స్ అస్సలు ఓపెన్ చేయొద్దు

Cyber Crime Alert | సాధారణంగా అపరిచితుల నుంచి ఇమెయిల్ వస్తే పేరు, సబ్జెక్ట్ చూసి ఓపెన్ చేయడం చాలామందికి అలవాటు. ఇక్కడే హ్యాకర్లు తెలివిగా ఆలోచిస్తున్నారు. మీరు ఇమెయిల్ ఓపెన్ చేసేలా సబ్జెక్ట్‌లో రాస్తున్నారు.

news18-telugu
Updated: May 11, 2019, 5:34 PM IST
Alert: ఈ 12 రకాల ఫేక్ ఇమెయిల్స్ అస్సలు ఓపెన్ చేయొద్దు
Alert: ఈ 12 రకాల ఫేక్ ఇమెయిల్స్ అస్సలు ఓపెన్ చేయొద్దు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 11, 2019, 5:34 PM IST
ఇంటర్నెట్... అందరి జీవితంలో భాగమైపోయింది. ఇంటర్నెట్ ఉపయోగించకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. ఇప్పుడు అదే ఇంటర్నెట్ మోసాలకు అడ్డాగా మారుతోంది. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎన్నెన్నో కుట్రలు చేస్తుంటారు. అందులో ఇమెయిల్ స్కామ్ ఒకటి. ఇమెయిల్స్ ద్వారా ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో అన్న అంశంపై సైబర్ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్‌వర్క్స్ జరిపిన పరిశోధనలో షాకిచ్చే విషయాలు బయటపడ్డాయి. యూజర్లను ట్రాప్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు పంపిన 36 లక్షల ఫిషింగ్ ఇమెయిల్స్‌ని ఆ సంస్థ పరిశీలించింది. వాటిలో యూజర్లు ఎక్కువగా స్వీకరించే 12 రకాల ఇమెయిల్స్‌ను గుర్తించింది. అలాంటి ఇమెయిల్స్ మీకూ వచ్చే ఉంటాయి. సాధారణంగా అపరిచితుల నుంచి ఇమెయిల్ వస్తే పేరు, సబ్జెక్ట్ చూసి ఓపెన్ చేయడం చాలామందికి అలవాటు. ఇక్కడే హ్యాకర్లు తెలివిగా ఆలోచిస్తున్నారు. మీరు ఇమెయిల్ ఓపెన్ చేసేలా సబ్జెక్ట్‌లో రాస్తున్నారు. హ్యాకర్లు పంపే ఇమెయిల్స్‌లో ఎక్కువగా కనిపించే 12 రకాల సబ్జెక్ట్స్ ఇవే...

1. Request
2. Follow Up

3. Urgent / Important
4. Are you available? / Are you at your desk


5. Payment Status
6. Hello
Loading...
7. Purchase
8. Invoice Due
9. Re:
10. Direct Deposit
11. Expenses
12. Payroll

ఇలాంటి ఇమెయిల్స్‌నే ఫిషింగ్ ఇమెయిల్స్ అంటారు. సైబర్ దాడుల్లో ఫిషింగ్ కూడా ఓ పద్ధతి. అంటే మీకు నకిలీ ఇమెయిల్ పంపి, మీరు ఆ ఇమెయిల్‌లో లింక్ క్లిక్ చేయగానే మీ డేటా కొట్టేస్తారు హ్యాకర్లు. మీకు వచ్చే ఫేక్ ఇమెయిల్స్‌లో చాలావరకు ఇలాంటి సబ్జెక్ట్స్‌తోనే ఉంటాయి. ఇవే కాదు... ఇలా 50 కామన్ సబ్జెక్ట్ లైన్స్‌తో హ్యాకర్లు ఇమెయిల్స్ పంపిస్తున్నట్టు గుర్తించింది సైబర్ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్‌వర్క్స్. వీటిని చూసి అందులో ఏముందో అని చూసి మెయిల్స్ ఓపెన్ చేసేవాళ్లే ఎక్కువ. అందులో వచ్చే లింక్‌ను క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా హ్యాకర్ల చేతిలో పడే ప్రమాదం ఉంది. మీకు ఇలాంటి ఇమెయిల్ ఏదైనా వస్తే ఓపెన్ చేయకపోవడమే మంచిది. అసలు ఇమెయిల్ ఎవరు పంపారో తెలియకపోతే అస్సలు ఓపెన్ చేయొద్దు.

Realme 3 Pro: రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే

WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...