Home /News /technology /

CUSTOMERS SAVED RS 11500 CRORES DURING FLIPKART BIG BILLION DAYS SALE SS

Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కస్టమర్లకు రూ.11,500 కోట్లు ఆదా... ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కస్టమర్లకు రూ.11,500 కోట్లు ఆదా... ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
(image: Flipkart)

Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కస్టమర్లకు రూ.11,500 కోట్లు ఆదా... ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ (image: Flipkart)

Flipkart Big Billion Days | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కస్టమర్లు కొన్న ప్రొడక్ట్స్‌తో ఏమేం చేయొచ్చో ఆసక్తికరమైన డేటాను వివరించింది ఫ్లిప్‌కార్ట్. అంతేకాదు... త్వరలో బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali Sale) కూడా ఉంటుందని ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days sale) ముగిసింది. అక్టోబర్ 3న ప్రారంభమైన సేల్ అక్టోబర్ 10న ముగిసిపోయింది. ఎనిమిది రోజుల పాటు ఈ సేల్ జరిగింది. ఈ సేల్‌లో షాపింగ్ చేయడం ద్వారా కస్టమర్లకు ఎంత డబ్బు ఆదా అయిందో తెలుసా? రూ.11,500 కోట్లు ఆదా అయినట్టు ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు... ఆసక్తికరమైన డేటాను కూడా వివరించింది ఫ్లిప్‌కార్ట్. 3,75,000 పైగా సెల్లర్స్ ఈ సేల్‌లో పాల్గొన్నారని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్స్ అన్నీ ఒకదానిపై మరొకటి పేర్చుకుంటూ పోతే 1000 బుర్జ్ ఖలీఫాలతో సమానం అని ప్రకటించింది. అంతేకాదు... ఈ సేల్‌లో కస్టమర్లు కొన్న మ్యాట్రెస్‌లతో 25 ఫుట్ బాల్ ఫీల్డ్స్‌ని కవర్ చేయొచ్చని తెలిపింది.

    Flipkart: షాక్... రూ.51,000 విలువైన ఐఫోన్ ఆర్డర్ చేస్తే రెండు సబ్బులు వచ్చాయి (Video)

    ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అమ్ముడుపోయిన సోఫాల సీటింగ్ కెపాసిటీ వాంఖెడే స్టేడియం సీటింగ్ కెపాసిటీతో సమానం అని తెలిపింది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో 33,000 మంది కూర్చోవచ్చు. ఈ సేల్‌లో ప్రతీ రెండు సెకండ్లకు ఒక వాచ్ అమ్ముడుపోయింది. ఇక ఎనిమిది రోజుల సేల్‌లో అమ్ముడుపోయిన టీ ప్యాకెట్లతో 50 లక్షల కప్పుల టీ తయారు చేయొచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రతీ 24 గంటల్లో 1.2 లక్షల చాక్లెట్ బార్స్ అమ్ముడుపోయాయి. ఈ సేల్‌లో అమ్ముడుపోయిన షూ బాక్సులు మౌంట్ ఎవరెస్ట్ కన్నా 100 రెట్ల ఎత్తు ఉంటుందని తెలిపింది ఫ్లిప్‌కార్ట్.

    Gmail Password: మీ జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చారా? వెంటనే మార్చండి ఇలా


    ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో క్టమర్లు కొన్న ఆయిల్‌తో 9 లక్షల ప్లేట్ల ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయొచ్చు. ఈ సేల్‌లో అమ్ముడు పోయిన పిండి, పప్పు బరువు 15 బ్లూ వేల్స్ బరువుతో సమానం. ఇక సేల్‌లో కస్టమర్లు కొన్న రిఫ్రిజిరేటర్స్‌లో 55 మిలియన్ సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్‌ని స్టోర్ చేయొచ్చు. ఈ సేల్‌లో అమ్మిన లైట్లతో 5 ఈఫిల్ టవర్స్‌కి లైటింగ్ ఏర్పాటు చేయొచ్చు. మరో అసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సేల్‌లో అమ్ముడుపోయిన మొక్కలతో రోజుకు 37,000 లీటర్ల ఆక్సిజన్‌ను అందిస్తాయి.

    ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తమ వెబ్‌సైట్, యాప్ చూసినవారి సంఖ్య అమెరికా జనాభా కన్నా మూడు రెట్లు అన్ని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇక ఈ సేల్‌లో ఇచ్చిన క్రెడిట్‌తో అంటే అప్పుతో 11 చంద్రయాన్ మిషన్లకు ఫండింగ్ చేయొచ్చని తెలిపింది. ఇలా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అనేక రికార్డుల్ని సాధించింది. త్వరలో బిగ్ దివాళీ సేల్ కూడా ప్రారంభం కానుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Flipkart, Flipkart Big Billion Days, Flipkart Big Diwali Sale

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు