Home /News /technology /

CUSTOMER ORDERED RS 51000 WORTH IPHONE 12 ON FLIPKART BIG BILLION DAYS SALE RECEIVED 2 SOAPS IN PARCEL SS

Flipkart: షాక్... రూ.51,000 విలువైన ఐఫోన్ ఆర్డర్ చేస్తే రెండు సబ్బులు వచ్చాయి (Video)

Flipkart: షాక్... రూ.51,000 విలువైన ఐఫోన్ ఆర్డర్ చేస్తే రెండు సబ్బులు వచ్చాయి (image: Screengrab/GoAndroid Youtube Channel)

Flipkart: షాక్... రూ.51,000 విలువైన ఐఫోన్ ఆర్డర్ చేస్తే రెండు సబ్బులు వచ్చాయి (image: Screengrab/GoAndroid Youtube Channel)

Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days) రూ.51,000 విలువైన ఐఫోన్ 12 (iphone 12) ఆర్డర్ చేస్తే రెండు సబ్బులు వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి.

    మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days) షాపింగ్ చేశారా? మీ పార్శిల్స్ కోసం ఎదురుచూస్తున్నారా? మీలాగే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో (Flipkart Sale) సిమ్రాన్‌పాల్ సింగ్ అనే వ్యక్తి రూ.51,000 విలువైన ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. కొత్త ఐఫోన్ కోసం ఎదురుచూశాడు. పార్శిల్ రాగానే ఎగిరి గంతేశాడు. కొత్త ఫోన్ వచ్చేసిందని సంతోషంలో మునిగిపోయాడు. కొత్త ఫోన్ చూద్దామని పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్. అందులో ఐఫోన్ 12 (iphone 12) లేదు. రెండు సబ్బులు కనిపించాయి. అంతే... ఐఫోన్ రావాల్సిన బాక్సులో సబ్బులు కనిపించేసరికి షాక్ అయ్యాడు. కాసేపటివరకు ఏం చేయాలో అర్థం కాలేదు. సాధారణంగా ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే మరో ప్రొడక్ట్ రావడం, పార్శిల్‌లో సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు ఉండటం లాంటి ఘటనలు చాలానే ఉన్నాయి.

    ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేస్తే రెండు సబ్బులు రావడం ఆ వ్యక్తికి షాక్ ఇచ్చింది. అయితే పార్శిల్ ఓపెన్ చేసేప్పుడు వీడియో రికార్డ్ చేశాడు కాబట్టి అతని దగ్గర సాక్ష్యం ఉంది. ఆ వీడియోను GoAndroid యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.

    Gmail Password: మీ జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చారా? వెంటనే మార్చండి ఇలా


    తాను ఐఫోన్ 12 ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో రెండు నిర్మా సబ్బులు వచ్చాయని సిమ్రాన్‌పాల్ సింగ్ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు కాల్ చేశారు. అయితే తాను డెలివరీ పార్ట్‌నర్‌కు ఓటీపీ షేర్ చేయలేదు కాబట్టి అతనికి పార్శిల్ డెలివరీ అయినట్టు కాదు. ఇదే విషయాన్ని కస్టమర్ కేర్‌కు వివరించాడు. వెంటనే దీనిపై విచారణ మొదలుపెట్టింది ఫ్లిప్‌కార్ట్. పార్శిల్ డెలివరీ చేసిన వ్యక్తిని ఫ్లిప్‌కార్ట్ విచారించింది. చివరకు తప్పు తమ వైపే ఉందని తెలుసుకుంది. ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసిన ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌కు డబ్బుల్ని రీఫండ్ చేసింది. కస్టమర్ బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు కూడా వచ్చేశాయి.

    Oppo A16: మీ పాత మొబైల్ ఇచ్చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రూ.740 ధరకే సొంతం చేసుకోవచ్చు

    కస్టమర్లు ఇలాంటి ఖరీదైన ఆర్డర్లు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీరు కూడా ఇలాంటి ఖరీదైన ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తే పార్శిల్ రాగానే హడావుడిగా ఓపెన్ చేయకుండా, పార్శిల్ ఓపెన్ చేసేప్పుడు వీడియో రికార్డ్ చేయాలి. వీడియో రికార్డ్ చేసేప్పుడు పార్శిల్‌పైన ఉన్న బిల్, ఇన్‌వాయిస్ వివరాలు కూడా వీడియోలో రికార్డ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రొడక్ట్ వస్తే మీ దగ్గర వీడియో సాక్ష్యం ఉంటుంది. అవసరమైతే డెలివరీ చేసిన వ్యక్తి ముందే పార్శిల్ ఓపెన్ చేయండి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Flipkart, Flipkart Big Billion Days, Iphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు