CRYPTO MALWARES ANOTHER NEW MALWARE IN CRYPTO CURRENCY APPS EXPERTS WHO NEED TO BE VIGILANT GH EVK
Crypto Malwares: క్రిప్టో యాప్స్‌లో మరో కొత్త మాల్వేర్.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
(ప్రతీకాత్మక చిత్రం)
Crypto Malwares | క్రిప్టో వాలెట్లను టార్గెట్ చేసుకుని సైబర్ క్రైమ్స్ ఎక్కువయ్యాయి. నకిలీ వాలెట్ల ద్వారా మొబైల్‌లోకి మాల్వేర్ పంపి యూజర్ల డబ్బుని దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. గత సంవత్సర కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగింది.
క్రిప్టో కరెన్సీ (Crypto Currency) వాడకం రోజురోజుకీ పెరుగుతుంది. అయితే వీటి ట్రాన్సాక్షన్స్ కోసం డిజిటల్ వాలెట్ల మాదిరిగా క్రిప్టో వాలెట్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడీ క్రిప్టో వాలెట్లను టార్గెట్ చేసుకుని సైబర్ క్రైమ్స్ ఎక్కువయ్యాయి. నకిలీ వాలెట్ల ద్వారా మొబైల్ (Mobile)లోకి మాల్వేర్ పంపి యూజర్ల డబ్బుని దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. గత సంవత్సర కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగింది. చాలామంది కొత్త యూజర్లు ఈ క్రిప్టో ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. వీరికి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వివరాలు అందులో ఉండే రిస్కులు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం లేదు. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఈ కొత్త యూజర్స్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బిట్‌కాయిన్ (Bit Coin) కొనుగోలుకు సంబంధించి యాప్‌లను రూపొందించి యూజర్ల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుని మాయం చేస్తున్నారు.
రీసెంట్గా గుర్తించిన ఓ కొత్త మాల్వేర్.. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడే ఫైల్స్ రూపంలో మొబైల్‌లోకి చేరుతుంది. తర్వాత తానంతట అదే డీకోడ్ అయ్యి యూజర్ల డేటాను దొంగిలించి వాలెట్లోని డబ్బుని మాయం చేస్తుంది. తాజాగా ఓ నకిలీ క్రిప్టో యాప్ రూపంలో మాల్వేర్ సంచరిస్తున్నట్టు టెక్ వర్గాల సమాచారం. అయితే ఆ యాప్ పేరు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
క్రిప్టోమోజులో పడి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే యాప్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవద్దు. అలాగే యాప్స్‌కు పర్మిషన్స్ (Permissions) ఇచ్చేముందు కూడా అవి నిజంగా అవసరమా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఇకపోతే యాప్ ఇన్స్టాల్ చేసేముందు ఆ యాప్ డెవలపర్ కంపెనీ ఏదో తెలుసుకోవాలి. ఆ కంపెనీ పేరుని గూగుల్‌లో సెర్చ్ చేసి, నమ్మదగినదో కాదో నిర్థారించుకోవాలి. యాపిల్ స్టోర్, ప్లే స్టోర్‌లో కూడా ట్రస్టెడ్ యాప్స్‌ను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ట్రెండ్ మైక్రో నివేదిక ప్రకారం ప్లేస్టోర్‌లో 120 నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్‌లు ఉన్నట్లు సమాచారం. ఈ యాప్స్‌కి క్రిప్టోకరెన్సీ మైనింగ్ కెపాసిటీ లేనప్పటికీ యాప్‌లో యాడ్స్ పంపించి యూజర్స్‌ని మోసం చేస్తున్నట్లు ట్రైండ్ మైక్రో తెలిపింది. గతంలో ఇదే ఇష్యూపై దృష్టి సారించిన గూగుల్ 8 నకిలీ బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ, క్రిప్టో మైనింగ్ యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్స్ కూడా తమ ఫోన్ల నుంచి సదరు యాప్స్‌ని వెంటనే డిలీట్ చేయాలని సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.