హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Early Bird Sale: ఆఫర్లే ఆఫర్లు.. ఫోన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు!

Early Bird Sale: ఆఫర్లే ఆఫర్లు.. ఫోన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు!

ఆఫర్లే ఆఫర్లు.. ఫోన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు!

ఆఫర్లే ఆఫర్లు.. ఫోన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు!

mobile offers | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల కన్నా ముందుగానే క్రోమా (Croma) ఆఫర్లు తీసుకువచ్చింది. ఎర్లీ బర్డ్ సేల్ పేరుతో కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది. క్రెడిట్ కార్డు ద్వారా అదనపు తగ్గింపు లభిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Latest offers | మీరు కొత్తగా ఫోన్ (Smartphone) కొనుగోలు చేయాలని చూస్తున్నారా? లేదంటే వాషింగ్ మెషీన్ కొనే ఆలోచనలో ఉన్నారా? లేదంటే ఫ్రిజ్, టీవీ, ఏసీ వంటివి కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు (Credit Card) ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే 12 నెలల ఈఎంఐ ఆప్షన్ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.

క్రోమా తాజాగా ఎర్లీ బర్డ్ సేల్ తీసుకువచ్చింది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 18 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా 50 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. 4 నెలల కనిష్టానికి ధరలు!

రెడ్‌మి నోట్ 11 ఫోన్‌ను రూ. 14,399కు కొనొచ్చు. దీని అసలు ధర రూ. 19,999. అలాగే ఒప్పొ ఏ16 ఫోన్‌ను రూ. 14,999కు కాకుండా రూ. 11,690కే కొనొచ్చు. అలాగే వివో ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ ఫోన్లపై ఆఫర్లు పొందొచ్చు. టీవీలపై కూడా ఆఫర్లు కనిపిస్తున్నాయి. 32 అంగుళాల స్మార్ట్‌టీవీ ధర రూ. 7,999 నుంచి ప్రారంభం అవుతోంది. 50 అంగుళాల టీవీ ధర రూ. 24,499 నుంచి స్టార్ట్ అవుతోందని చెప్పుకోవచ్చు.

ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ డిస్కౌంట్.. రూ.10 వేలకు పైగా తగ్గింపు!

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ ధర రూ. 5,290గా ఉంది. దీని అసలు ధర రూ. 15,990. అలాగే సౌండ్ బార్లపై రూ. 10 వేల వరకు డిస్కౌంట్ ఉంది. క్రోమా 7.5 కేజీ 5 స్టార్ట్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. దీనిని రూ. 12,990కు కొనొచ్చు. దీని అసలు ధర రూ. 24 వేలు. అలాగే ఏసీల ధర రూ. 22,990 నుంచి ప్రారంభం అవుతోంది. ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ వంటి వాటిపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి.

170 లీటర్ల డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్స్ ధర రూ. 8,990 నుంచి ప్రారంభం అవుతోంది. సెమీ ఆటోమేటిక్ క్రోమా 6.5 కేజీ 5 స్టార్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ధర రూ. 6,990 నుంచి ప్రారంభం అవుతోంది. ట్రూలీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ధర రూ. 599 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రింటర్లపై 30 శాతం వరకు తగ్గింపు ఉంది. హార్డ్ డిస్క్‌లపై 55 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఫుల్ హెచ్‌డీ మానిటర్ల ధర రూ. 8,999 నుంచి ప్రారంభం అవుతోంది. రూటర్లపై ఏకంగా 70 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.

First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Billion Days, Latest offers

ఉత్తమ కథలు