హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Croma Diwali Sale: క్రోమా ఫెస్టివల్ సేల్ ప్రారంభం.. యాపిల్ వాచ్‌లు, ఐఫోన్లపై అదిరే ఆఫర్లు..

Croma Diwali Sale: క్రోమా ఫెస్టివల్ సేల్ ప్రారంభం.. యాపిల్ వాచ్‌లు, ఐఫోన్లపై అదిరే ఆఫర్లు..

Croma Diwali Sale: క్రోమా ఫెస్టివల్ సేల్ ప్రారంభం.. యాపిల్ వాచ్‌లు, ఐఫోన్లపై అదిరే ఆఫర్లు..

Croma Diwali Sale: క్రోమా ఫెస్టివల్ సేల్ ప్రారంభం.. యాపిల్ వాచ్‌లు, ఐఫోన్లపై అదిరే ఆఫర్లు..

Croma Diwali Sale: ఫెస్టివల్ సీజన్‌‌ను క్యాష్ చేసుకోవడానికి క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ (Festival of Dreams) పేరుతో ఆఫర్లను అనౌన్స్ చేసింది. ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ మొదలుకొని ఫ్రిజ్, వాషింగ్ మిషన్, స్మార్ట్ వాచెస్ వంటి మరెన్నో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌పై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియాలో నవరాత్రులతో పాటు షాపింగ్ ఫెస్టివల్స్ కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగల సందర్భంగా వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ స్పెషల్ సేల్స్‌ ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియన్ రిటైలర్ క్రోమా (Croma) కూడా చేరింది. ఫెస్టివల్ సీజన్‌‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ టాటా గ్రూప్ బ్రాండ్ ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ (Festival of Dreams) పేరుతో ఆఫర్లను అనౌన్స్ చేసింది. ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ మొదలుకొని ఫ్రిజ్, వాషింగ్ మిషన్, స్మార్ట్ వాచెస్ వంటి మరెన్నో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌పై అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నట్లు క్రోమా ప్రకటించింది.

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైలింగ్‌లోనూ మార్కెట్ షేర్ ఉన్న క్రోమా.. టాటా గ్రూప్ సబ్ బ్రాండ్. ఈ కంపెనీ తాజా ఫెస్టివల్ సేల్‌లో భాగంగా టాటా న్యూ యాప్ (Tata Neu app), క్రోమా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఎలక్ట్రానిక్స్‌పై బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 13 రూ. 51,990కి అందుబాటులో ఉంటుంది. ఆఫర్లలో తక్కువ ధరకు లభిస్తున్న ఇతయ యాపిల్ డివైజ్‌లు, వేరే బ్రాండ్ ప్రొడక్ట్స్ ఏవో చెక్ చేద్దాం.

* Apple SE స్మార్ట్ వాచ్

ఫెస్టివల్ సేల్‌లో యాపిల్ SE స్మార్ట్ వాచ్‌పై క్రోమా అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. తాజా సేల్‌లో దీనిపై 30శాతం డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. వాచ్ SEలో GPS, GLOSNASS, వంటి ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. బ్లూ, గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో లభించే వాచ్ స్ట్రాప్స్ మంచి ట్రెండీ లుక్‌ను అందిస్తాయి. అన్ని ఆఫర్లతో కలిపి ఈ డివైజ్‌ క్రోమాలో రూ.19,990కు అందుబాటులో ఉంది.

* ఐఫోన్ 13

క్రోమా ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్ సేల్‌లో ఐఫోన్ 13పై దాదాపు రూ.17,910 భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఐఫోన్ 13 ధర రూ. 69,990 కాగా, ఫెస్టివల్ సేల్ సందర్భంగా రూ. 51,990కు సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది.

* శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్‌ఈ 5జీ

ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల అమోలెడ్ 2X డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇది ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌‌తో రన్ అవుతుంది. ఇందులో 12ఎంపీ+12ఎంపీ+8ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 32-ఎంపీ కెమెరా ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 4,500mAh బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్‌లో అమర్చారు.

ఇది కూడా చదవండి : 5జీ వచ్చేస్తోంది... రూ.25,000 లోపు 10 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే

ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌, డ్యూయల్-రికార్డింగ్ మోడ్‌ వంటి అధునాతన ఫీచర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను తాజా సేల్‌లో రూ.30,000లోపే సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రీమియం మోడల్‌ రూ. 26,999 డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది.

ఇక, క్రోమా స్పెషల్ ఫెస్టివ్ సేల్‌లో ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ వన్ ప్లస్‌కు చెందిన 43 -అంగుళాల పుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ ₹19,999 డిస్కౌంట్ ధరతో లభిస్తుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఇది ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్ట్స్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Croma, Festival, Iphone 13, Smartphones, Tech news

ఉత్తమ కథలు