స్మార్ట్‌ఫోన్లు (Smartphones), ల్యాప్‌టాప్‌లు (Laptops), ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఇతర వస్తువులు కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ స్పెషల్ సేల్స్ అనౌన్స్ చేశాయి. టాప్ బ్రాండ్స్‌కు చెందిన ప్రొడక్ట్స్‌పై ఇప్పుడు మంచి డిస్కౌంట్ ఉన్నాయి. తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన రిటైల్ స్టోర్ క్రోమా కూడా రిపబ్లిక్ డేస్ సేల్స్ ఆఫర్లను ప్రకటించింది. జనవరి 19న ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి 29 వరకు కొనసాగుతాయి.
ఈ స్పెషల్ సేల్‌లో క్రోమా ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, సౌండ్‌బార్లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, టాబ్లెట్లు, యాక్సెసరీలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. గాడ్జెట్లు, గృహోపకరణాలు, యాక్సెసరీస్‌పై కస్టమర్లు 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈ రిటైల్ స్టోర్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ జాయ్ క్యాంపెయిన్ ద్వారా బెస్ట్ సర్వీస్ అందించనుంది. ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్‌పై క్రోమా అందిస్తున్న ఆఫర్లు చెక్ చేయండి.
* వీటిపై భారీ ఆఫర్లు
రిపబ్లిక్ డే స్పెషల్ సేల్‌లో క్రోమా 307L ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్ ధర రూ.22,990గా ఉంది. ఆక్వాగార్డ్ RO+UV వాటర్ ప్యూరిఫైయర్లు రూ.14,990 ధరకు అందుబాటులో ఉన్నాయి. వోల్టాస్ ఫోర్-ఇన్-వన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్‌ను నెలకు రూ.2,999 ఇన్‌స్టాల్‌మెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల ధరలు రూ. 19,900 నుంచి ప్రారంభమవుతాయి.
ఈ ఆఫర్లలో క్రోమా 307L ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్ ధర రూ.22,990కి తగ్గింది. ఫిలిప్స్ 3-బర్నర్ గ్లాస్ కుక్‌టాప్‌ను రూ.2,490కి కొనుగోలు చేయవచ్చు. ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్స్ రూ.6,999 ప్రారంభ ధరతో లభిస్తున్నాయి. యాపిల్ ఎయిర్ పాడ్స్ కేవలం రూ.8,999 నుంచి అందుబాటులో ఉన్నాయి. Croma 20W పార్టీ స్పీకర్స్‌పై భారీ ఆఫర్లను అనౌన్స్ చేసింది. వీటి ధర రూ.3,599 నుంచి ప్రారంభమవుతుంది.
* స్మార్ట్ టీవీలు
క్రోమా స్పెషల్ సేల్‌లో శామ్‌సంగ్ NEO QLED TVలను నెలకు రూ.1,990 ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ.990 నుంచి ప్రారంభమయ్యే మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో 4K LED TVలను సొంతం చేసుకోవచ్చు. LG OLED TVలను నెలకు రూ.2,999 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్‌తో కొనే అవకాశం ఉంది.
* ల్యాప్‌టాప్స్
క్రోమా రిపబ్లిక్ డే సేల్‌లో కోర్ i3 ల్యాప్‌టాప్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. వివిధ బ్రాండెడ్ ల్యాపీల ధరలు రూ.33,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇంటెల్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల ధర రూ. 54,990 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ల్యాప్‌టాప్‌లపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు 10 శాతం డిస్కౌంట్ ఉంది.
* స్మార్ట్‌ఫోన్లు
రిపబ్లిక్ డే స్పెషల్ సేల్‌లో క్రోమా వివిధ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. కస్టమర్లు క్రోమా నుంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసి, స్క్రాచ్, విన్ కార్డ్ పొందవచ్చు. వీటి ద్వారా రూ.2.5 లక్షల విలువైన గిఫ్ట్స్, టాటా నెక్సాన్ EV కారు, Revamp Moto ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందవచ్చు.
కొన్ని బ్యాంక్ కార్డ్స్‌పై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. అలాగే కస్టమర్లకు కూపన్ కోడ్స్, స్క్రాచ్ అండ్ విన్ కార్డ్స్ వంటి ప్రమోషనల్ ఆఫర్లను కూడా క్రోమా అందిస్తోంది. ఫైనాన్స్ ఆప్షన్‌పై కస్టమర్లు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Croma, Laptops, Republic Day 2023, Smartphones, Tech news, Technology