Fake apps - Corona Vaccine: ఈ ఫేక్ వ్యాక్సిన్ యాప్స్ తో జాగ్రత్త.. ఆ లింకులను ఓపెన్ చేస్తే అంతే సంగతులు.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

దేశమంతా కరోనా ఎఫెక్ట్ తో ఇబ్బంది పడుతుంటే.. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు వ్యాక్సిన్ పేరుతో ఫేక్ యాప్ లను రూపొందించి అమాయకులను దోచుకుంటున్నారు. ఈ విషయంపై అప్రమత్తంగా లేకపోతే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాలు తెలుసుకోండి.

  • Share this:
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఓ పక్క విజృంభిస్తోండగా.. మరోపక్క టీకా కార్యక్రమం కూడా సాధ్యమైనంత వేగంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయినప్పటికీ తగినన్నీ వ్యాక్సిన్లు అందక ప్రజలకు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. చాలా మంది టీకా కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా కొంతమంది కేటుగాళ్లు ఫేక్ యాప్ ల ద్వారా సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్ టీమ్ (CERT-In) గుర్తించింది. కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలంటూ నకిలీ మెస్సేజ్‌లను, రిజిస్ట్రేషన్ లింకులను పంపిస్తున్నారని, పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేశామంటే గోప్యతకు భంగం కలిగించే యాప్ (Malicious App) ఇన్ స్టాల్ అవుతుందని తెలిపింది. "వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలంటే ఎస్ఎంఎస్ పంపిస్తారు. అందులోని లింకుపై క్లిక్ చేస్తే ఆండ్రాయిడ్ డివైజ్‌లో అన్ నోన్ యాప్ ఇన్ స్టాల్ అవుతుంది. ఫలితంగా మీ డేటా చౌర్యానికి గురయ్యే అవకాశముంది. అంతేకాకుండా అనుమతులు పొంది మీ కాంటాక్ట్ లిస్ట్, ఇతర డేటాను సైబర్ కేటుగాళ్లు తీసుకునే అవకాశముంది" అని CERT వర్గాలు తెలిపాయి.
Flipkart: మీకు ఫ్లిప్‌కార్ట్ లో ఖాతా ఉందా? అయితే, వెంటనే మీ పాస్వర్డ్ మార్చేయండి.. ఎందుకంటే..

ఫేక్స్ యాప్స్..
CERT పంపే సందేశాలకు, సైబర్ నేరగాళ్ల మెసేజులకు కొంచెం వ్యత్యాసముంటుందని సంబంధిత ఎస్ఎంఎస్‌ల స్క్రీన్ షాట్‌లను షేర్ చేసింది. ఈ మెసేజ్‌లో కోవిడ్ రిజిస్ట్రేషన్ కోసం యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మాలిసియస్ యాప్ డౌన్ లోడ్ అవుతుంది. ఇలాంటివి మొత్తం ఐదు రకాల యాప్స్ ఉన్నాయి. అవి Covid-19.apk, Vaci__Regis.apk, MyVaccin_v2.apk, Cov-Regis.apk, Vccin-Apply.apk. కాబట్టి ఇలాంటి లింక్స్ ఉన్న మెస్సేజ్‌లు వస్తే వాటిపై క్లిక్ చేయకుండా వెంటనే డిలీట్ చేయడం మంచిది.

ఒకవేళ మీరు వీటిని డౌన్ లోడ్ చేసుకున్నట్లయితే మీ పాస్వర్డ్, వ్యక్తిగత డేటా తస్కరనణకు గురయ్యే అవకాశముందని CERT సూచించింది. నకిలీ డొమైన్లు, ఈమెయిళ్లు, మెస్సేజ్‌లు, పోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటివి కోవిడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఇస్తాయని స్పష్టం చేసింది.

కోవిడ్ టీకా కోసం ఎక్కడ నమోదు చేసుకోవాలి?
వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోవాలంటే మీకు రెండు ఫ్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించి అధికారిక కోవిడ్ పోర్టల్ ను సందర్శించవచ్చు లేదా గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీటిల్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం వారు వీటిలో ఏదోక్ ప్లాట్ ఫాంలో కోవిడ్ టీకా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవకాశం పొందుతారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు కోవిడ్ టీకా స్లాట్ కనిపించకపోతే, అందుకోసం మీరు సులభంగా అలర్టులను పంపవచ్చు. Under45.in, GetJab.in, FindSlot.in లాంటి వెబ్ సైట్లు వ్యాక్సిన్ స్లాట్లను ట్రాక్ చేయడానికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి. కోవిడ్-19 గురించి తాజా సమాచారం కోసం ఆరోగ్య సేతు యాప్‌లో సెర్చ్ చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: