Google Offer COVID-19 Vaccine Availability Info: గూగుల్ మ్యాప్స్‌లో కోవిడ్ వ్యాక్సిన్ స‌మాచారం

(ప్రతీకాత్మక చిత్రం)

ఇండియాలో వ్యాక్సిన్(Vaccine) ల‌భ్య‌త, అపాయింట్ మెంట్ స‌మాచారం గురించి గూగుల్ మ్యాప్స్‌(Google Maps), గూగుల్ అసిస్టెన్స్‌, సెర్చ్‌(Search)ల‌లో సుల‌భంగా లభించేలా ఉంచుతున్న‌ట్టు గూగుల్ ప్ర‌క‌టించింది. ఒక వారం రోజుల్లో వినియోగదారులు ఈ ఫీచర్ను పొందగలరని తెలిపింది.

  • Share this:
    ప్ర‌స్తుతం అంద‌రికీ అవ‌స‌ర‌మైన స‌మాచారాల్లో ముఖ్య‌మైంది కోవిడ్ వ్యాక్సిన్(Vaccine) ఎక్క‌డ దొరుకుతుంది. దీనిపై ప్ర‌భుత్వం(Government) ఇప్ప‌టికే ప‌లు వెబ్‌సైట్‌ల‌లో స‌మాచారం అందుబాట‌లో ఉండేలా చూస్తోంది. అయినా ఇంకా వ్యాక్సిన్ సెంట‌ర్‌ల స‌మాచారంపై స్ప‌ష్ట‌త త‌క్కువ‌గానే ఉంది. దీంతో ఇండియాలో వ్యాక్సిన్ ల‌భ్య‌త, అపాయింట్ మెంట్ స‌మాచారం గురించి గూగుల్ మ్యాప్స్‌(Google Maps), గూగుల్ అసిస్టెన్స్‌, సెర్చ్‌ల‌లో ఈ స‌మాచారం సుల‌భంగా లభించేలా ఉంచుతున్న‌ట్టు గూగుల్ ప్ర‌క‌టించింది.
    ఈ వారంలో ఈ స‌మాచారానికి సంబంధించిన అప్‌డేట్ వ‌స్తుంద‌ని తెలిపింది. కోవిన్ APIల‌నుంచి రియ‌ల్‌టైమ్ డేటా ద్వారా ఈ స‌మాచారాన్ని(Information) సేక‌రించి వినియోగ‌దారుల‌కు అందించ‌నుంది. సుమారు 13,000 పైగా స్థానాలకు సంబంధించిన స‌మాచారాన్ని గూగుల్ అందించ‌నుంది.

    PayU to buy out BillDesk : ‘పే యూ’గా మారిన బిల్ డెస్క్.. రూ.34,376 కోట్ల ఒప్పందం


    ప్ర‌తీ సెంట‌ర్‌(Center)లో టీకాల ల‌భ్య‌త‌, చెల్లింపు ధ‌ర సమాచారాన్ని అందించ‌నుంది. బుకింగ్ కోసం కోవిన్ వెబ్‌సైట్‌కు లింక్ చేసేలా స‌మాచారాన్ని వినియోగ‌దారుల ముందు ఉంచన‌నుంది. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) భాగ‌స్వామ్యంతో కోవిడ్ 19 ప‌రీక్ష కేంద్రాలు, వ్యాక్సిన్ కేంద్రాల‌ను (Vaccine Centres)చూపించడానికి గూగుల్ మ్యాప్స్‌, అసిస్టెన్ త‌న సాంకేతిక‌త‌ను అప్‌డేట్ చేసింది.
    స‌మాచారం ఇలా ల‌భిస్తుంది..
    గూగుల్ మ్యాప్స్‌లోగాని ఇత‌ర గూగుల్ అసిస్టెన్స్‌(Google Assistance)లో వినియోగ‌దారులు వారికి కావాల్సిన టీకా స‌మాచార‌న్ని స‌ర్చ్(Search) చేసిన‌ప్పుడు, ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి స‌మాచారం ఆటోమెటింగ్‌గా సేక‌రించి వినియోగ‌దారుడికి అందించేలా సాంకేతిక‌త‌(Technology)ను రూపొందించారు. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ మరియు మరాఠీతో సహా ఎనిమిది భారతీయ భాషలలో స‌మాచారాన్ని వెతికినా స‌రైన స‌మాచారం అందించేలా సాంకేతిక‌త‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుత స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు కావాల్సిన స‌మాచారం వ్యాక్సినేష‌న్ వివ‌రాలని గూగుల్ సెర్చ్ డైరెక్టర్(Google Search Directer) హేమ బుదరాజు పేర్కొన్నారు.



    ఇందుకోసం గూగుల్ ద్వారా ఈ స‌మాచారం క‌నుక్కోవ‌డం చాలా సుల‌భ‌త‌రం చేస్తున్నామ‌ని అన్నారు. దేశంలోని టీకా కేంద్రాలు, కోవిన్ బృందం స‌హ‌కారంతో స‌మ‌ర్థ‌వంతంగా ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అందిస్తామ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన‌, విశ్వ‌స‌నీయ‌మైన స‌మాచారం అందించ‌డంలో గూగుల్ ఎప్పుడు క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని గూగుల్ సెర్చ్ డైరెక్టర్ హేమ బుదరాజు అన్నారు.
    ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌డానికి ‘covid-19 vaccines near me’ అని మీరు గూగుల్ స‌ర్చ్‌, మ్యాప్స్‌, అసిస్టెంట్‌ల‌లో టైప్ చేయాలి. ఇందు కోసం యూజ‌ర్లు క‌చ్చితంగా యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఈ ఫీచర్‌(Feature)లో వెబ్‌క్ల‌యిట్ ధ‌ర‌లు, అక్క‌డ అందించే టీకాల వివ‌రాలు పూర్తిగా పొంద‌చ్చు.. క‌చ్చితంగా ఈ స‌ర్చ్ అనుభ‌వం వినియోగ‌దారులు ఉప‌యోగించుకొంటార‌ని గూగుల్ సెర్చ్ డైరెక్టర్ హేమ బుదరాజు ఆశాభావం వ్య‌క్తం చేశారు.
    Published by:Sharath Chandra
    First published: