హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

COVID-19 Vaccine: మీ వయస్సు 45 ఏళ్లు దాటాయా? కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయండి ఇలా

COVID-19 Vaccine: మీ వయస్సు 45 ఏళ్లు దాటాయా? కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయండి ఇలా

COVID-19 Vaccine: మీ వయస్సు 45 ఏళ్లు దాటాయా? కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

COVID-19 Vaccine: మీ వయస్సు 45 ఏళ్లు దాటాయా? కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

COVID-19 Vaccination Registration | వయస్సు 45 ఏళ్లు దాటినవారందరికీ అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడ్డవారందరికీ భారత ప్రభుత్వం కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇస్తోంది.

వ్యాక్సిన్ తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Co-WIN ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. లేదా ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయొచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న Co-WIN App లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. ఈ యాప్ కేవలం అధికారుల కోసం రూపొందించారు. కాబట్టి ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. ఇక వ్యాక్సిన్ కోసం ఇతర యాప్స్, వెబ్‌సైట్స్‌లో మీ వివరాలు నమోదు చేయకూడదు. ఎవరైనా ఫోన్ చేసి వివరాలు అడిగితే చెప్పకూడదు. సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ లేదా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకోవచ్చు.

కోవిన్ ప్లాట్‌ఫామ్ అయిన https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లో ఒకే ఫోన్ నెంబర్‌పై ముగ్గురి పేర్లు రిజిస్టర్ చేయొచ్చు. మొదటి డోస్, రెండో డోస్‌కు స్లాట్స్ బుక్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలు, 10,000 పైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఉచితం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక డోసుకు రూ.250 చెల్లించాలి. కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

Special Trains: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు... 66 స్పెషల్ ట్రైన్స్ జాబితా ఇదే

Realme 8 Pro: రూ.17,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.1,499 ధరకే కొనండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

COVID-19 Vaccine Registration: కోవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయండి ఇలా


ముందుగా https://www.cowin.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి Verify చేయాలి.

మీ ఐడీ ప్రూఫ్ వివరాలు ఎంటర్ చేసి, పేరు, వయస్సు, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.

ఐడీ ప్రూఫ్ కోసం ఐడీ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి.

మీ వివరాలు సరిచూసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

ఆ తర్వాత అపాయింట్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.

రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్ కోడ్ లాంటివి సెలెక్ట్ చేసి స్లాట్ బుక్ చేయాలి.

వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన తేదీతో అపాయింట్‌మెంట్ మెసేజ్ వస్తుంది.

వ్యాక్సినేషన్ సెంటర్‌కు ఏదైనా ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి.

ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎన్‌పీఆ స్మార్ట్ కార్డ్, ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్ తీసుకెళ్లాలి.

ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీ అపాయింట్‌మెంట్ డేట్ మార్చుకోవచ్చు.

మొదటి డోస్ అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేస్తే రెండో డోస్ అపాయింట్‌మెంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది.

WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్ చాలా ముఖ్యం... వెంటనే మార్చేయండి

PAN Aadhaar Link Status: మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందా? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా


COVID-19 Vaccine Registration: ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేయండి ఇలా


మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ చేయాలి.

హోమ్ స్క్రీన్‌పై ఆ తర్వాత CoWin లింక్ పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Vaccination పైన క్లిక్ చేయాలి.

అందులో Register Now పైన క్లిక్ చేయాలి.

మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత సెకండ్ స్టేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది.

ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఫోటో ఐడీ ప్రూఫ్‌లో ఏదైనా ఓ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

ఐడీ నెంబర్, పేరు, జెండర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.

వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన తేదీ, సమయం లాంటి వివరాలు ఉంటాయి.

ఒకే మొబైల్ నెంబర్‌తో నలుగురు బెన్ఫీషియరీస్‌ని యాడ్ చేయొచ్చు.

First published:

Tags: Aarogya Setu, Corona Vaccine, Covid, Covid-19, COVID-19 vaccine

ఉత్తమ కథలు