హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Covid 19 Test: కోవిడ్ ప‌రీక్ష‌ల్లో కొత్త పద్ధతి... స్మార్ట్‌ఫోన్ తెర‌ల నుంచి స్వాబ్ సేక‌ర‌ణ‌

Covid 19 Test: కోవిడ్ ప‌రీక్ష‌ల్లో కొత్త పద్ధతి... స్మార్ట్‌ఫోన్ తెర‌ల నుంచి స్వాబ్ సేక‌ర‌ణ‌

Covid 19 Test: కోవిడ్ ప‌రీక్ష‌ల్లో కొత్త పద్ధతి... స్మార్ట్‌ఫోన్ తెర‌ల నుంచి స్వాబ్ సేక‌ర‌ణ‌
(ప్రతీకాత్మక చిత్రం)

Covid 19 Test: కోవిడ్ ప‌రీక్ష‌ల్లో కొత్త పద్ధతి... స్మార్ట్‌ఫోన్ తెర‌ల నుంచి స్వాబ్ సేక‌ర‌ణ‌ (ప్రతీకాత్మక చిత్రం)

Covid 19 Test | కోవిడ్ ప‌రీక్ష‌ల్లో కొత్త పద్ధతిని కనిపెట్టారు యూనివ‌ర్సిటీ కాలేజీ ఆఫ్ లండ‌న్ ప‌రిశోధ‌కులు. స్మార్ట్‌ఫోన్ తెర‌ల నుంచి స్వాబ్ సేక‌రించి కోవిడ్ పరీక్షలు చేయొచ్చు.

కోవిడ్ నిర్దార‌ణ ప‌రీక్ష‌ల్లో స‌రికొత్త పద్ధతిని ఆవిష్కరించారు పరిశోధకులు. కరోనా టెస్టు కోసం స్మార్ట్ ఫోన్ స్క్రీన్ల నుంచి స్వాబ్‌ల‌ను సేకరించవచ్చని వారు నిరూపించారు. ఇలా సేకరించిన స్వాబ్‌తో క‌చ్చిత‌మైన ఫ‌లితాలు రాబ‌ట్టారు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిపై ఈ పద్ధతిని పరిశీలించారు. ఇందులో ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లతో, స్వాబ్ టెస్టు ఫ‌లితాలు స‌రిపోలడం విశేషం. యూనివ‌ర్సిటీ కాలేజీ ఆఫ్ లండ‌న్ ప‌రిశోధ‌కులు ఈ అధ్యయనం చేశారు. దీన్ని ఫోన్ స్క్రీన్ టెస్టింగ్(పోస్ట్‌)గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌ద్ధ‌తిలో 81 నుంచి 100శాతం క‌చ్చిత‌త్త్వంతో ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

Vivo V21e 5G: వివో వీ21ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్

Redmi Note 10: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

ఇది యాంటిజెన్ లాట‌ర‌ల్ ఫ్లో ప‌రీక్ష‌ మాదిరిగా మెరుగైన ఫలితాలను ఇస్తుందని ప‌రిశోధ‌కులు చెపుతున్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా మ‌నుషుల‌ను తాక‌కుండానే కోవిడ్ టెస్టు చేయవచ్చు. దీనికి ఖర్చు కూడా త‌క్కువగానే ఉంటుంది. ఆర్టీపీసీఆర్‌తో పోల్చుకున్న‌పుడు ఇది అత్యంత చౌకైన ప‌రీక్ష‌. ఇది త‌క్కువ ఆదాయం ఉన్న దేశాల‌కు మరింత ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. కోవిడ్ నిర్ధార‌ణకు స్వాబ్ సేక‌రించేట‌పుడు క‌లిగే అసౌక‌ర్యం నుంచి ఈ ప‌రీక్ష మ‌న‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. ఇందుకు న‌మూనాల‌ను ఒక నిమిషం లోపే సేక‌రించ‌వ‌చ్చు. ఇందుకోసం ఎలాంటి వైద్య సిబ్బంది అవ‌స‌రం ఉండ‌దు.

JioPhone Next: జియో ఆవిష్కరించిన జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే

Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ప్రీ-ఆర్డర్ సేల్... రూ.3,000 డిస్కౌంట్


ఈ ప‌రిశోధ‌నా ఫ‌లితాలు ఈ-లైఫ్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. కోవిడ్ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టాలంటే నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కీలకం. కానీ అవి చాలా ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారంగా మార‌డంతో పెద్ద ఎత్తున ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ సాధ్యం కావ‌డం లేదని యూనివ‌ర్సిటీ కాలేజీ లండ‌న్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్త‌మాల‌జీకి చెందిన రొడ్రిగో యంగ్ తెలిపారు. ఈ ప‌రిశోధ‌న ఆయ‌న నేతృత్వంలోనే జరిగింది. చిలీకి చెందిన డ‌యాగ్నోసిస్ బ‌యోటిక్‌ అనే స్టార్టప్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. పోస్ట్ మెథ‌డ్ ద్వారా కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు పెద్ద ఎత్తున నిర్వహించడం సులువు అవుతుంది. వివిధ రకాల వైర‌స్‌ల వ్యాప్తిని దీని ద్వారా అరిక‌ట్ట‌వ‌చ్చని రొడ్రిగో తెలిపారు.

First published:

Tags: Covid-19, Covid-19 test

ఉత్తమ కథలు