హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo Phones: ఇండియాలో ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో ఒప్పో A17, A77s ఫోన్ల అమ్మకం.. బడ్జెట్ ధరలోనే..

Oppo Phones: ఇండియాలో ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో ఒప్పో A17, A77s ఫోన్ల అమ్మకం.. బడ్జెట్ ధరలోనే..

Photo Credit : OPPO

Photo Credit : OPPO

Oppo Phones: ఒప్పో A సిరీస్ నుంచి ఇండియాలో ఒప్పో A77s (Oppo A77s), ఒప్పో A17 (Oppo A17) అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తామని చెప్పిన కంపెనీ.. తాజాగా ఈ మోడళ్లను ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చైనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఒప్పో (Oppo) ఇండియన్ స్మార్ట్‌ఫోన్ (Smartphone) మార్కెట్‌లో బడ్జెట్, మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేసింది. ఈ కంపెనీ A సిరీస్ నుంచి వరుసగా అఫర్డబుట్ మోడళ్లను రిలీజ్ చేస్తోంది. ఇదే సిరీస్ నుంచి ఇండియాలో ఒప్పో A77s (Oppo A77s), ఒప్పో A17 (Oppo A17) అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తామని చెప్పిన కంపెనీ.. తాజాగా ఈ మోడళ్లను ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ముంబై బేస్డ్ మహేశ్ రిటైలర్స్‌, తమ వెబ్‌సైట్‌లో ఈ కొత్త పోన్ల సేల్ డీటేల్స్ లిస్ట్ చేసింది. అంటే అధికారికంగా లాంచ్ అవ్వకముందే, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా ఈ రెండు ఫోన్లు సేల్‌కు అందుబాటులోకి వచ్చాయి.

రిటైలర్ స్టోర్ మహేష్ టెలికామ్ షేర్ చేసిన వివరాల ప్రకారం ఒప్పో A17 బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ కాగా, ఒప్పో A77s ఒక మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. A17 మోడల్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్‌తో, A77s ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50MP రియర్ కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చిన ఈ రెండు ఫోన్ల ధరలతో పాటు స్పెసిఫికేషన్లు చెక్ చేద్దాం.

* ఫీచర్లు

ఒప్పో A17 ఫోన్‌ 50MP ప్రైమరీ రియర్ షూటర్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో దీనితో పాటు 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. 5MP ఫ్రంట్ షూటర్‌ను కంపెనీ అందించింది. ఒప్పో A17 వాటర్‌డ్రాప్ నాచ్‌తో 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది.

ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ కలర్‌ఓఎస్ 12.1తో రన్ అవుతుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్‌ వంటివి ఈ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లు. 5000mAh బ్యాటరీ యూనిట్‌తో వచ్చే ఈ బడ్జెట్ డివైజ్ లెదర్ ఫీల్ డిజైన్‌లో బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఒప్పో A77s ఫోన్ 50MP ప్రైమరీ స్నాపర్, 2MP డెప్త్ సెన్సార్‌ ఉండే డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. అలాగే 8MP ఫ్రంట్ షూటర్‌ కూడా ఉంది. దీని 6.56 అంగుళాల స్క్రీన్ HD+ రిజల్యూషన్‌తో, 90hz రిఫ్రెష్ రేట్‌తో క్వాలిటీ అవుట్‌పుట్ అందిస్తుంది. ఈ ఫోన్ 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తుంది.

ఇది కూడా చదవండి : వాట్సాప్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు అలర్ట్.. అలా చేయకపోతే డేంజర్ లో పడినట్టే!

గ్లో డిజైన్‌లో, స్కై బ్లూ, స్టార్రీ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఫోన్ అందుబాటులో ఉంది. IP54 రేట్ వాటర్, డస్ట్ రెసిస్టెంట్, స్టీరియో స్పీకర్ సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ వంటి ఇతర ఫీచర్లో ఒప్పో A77s కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 8GB RAMతో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ColorOS 12.1తో రన్ అవుతుంది.

* ధరలు ఎలా ఉన్నాయి?

బడ్జెట్ డివైజ్ ఒప్పో A17 ఒకే స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఈ ఫోన్ 4GB + 64GB స్టోరేజ్‌ వేరియంట్‌తో రూ.12499కు లభిస్తుంది. అయితే మిడ్‌రేంజ్ ఫోన్ అయిన ఒప్పో A77s మోడల్ 8GB +128GB వేరియంట్ ధర రూ. 17,999 వరకు ఉంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Oppo, Smartphones, Tech news

ఉత్తమ కథలు