JioPhone: ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో జియోఫోన్ టాప్

JioPhone | 2019 మొదటి త్రైమాసికంలో ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో 30 శాతం మార్కెట్ షేర్‌తో రిలయెన్స్ జియో ఫోన్ దూసుకెళ్తోందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.

news18-telugu
Updated: April 26, 2019, 4:24 PM IST
JioPhone: ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో జియోఫోన్ టాప్
JioPhone: ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో జియోఫోన్ టాప్
news18-telugu
Updated: April 26, 2019, 4:24 PM IST
టెలికామ్ రంగంలో రిలయెన్స్ జియో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క టెలికామ్ రంగంలో మాత్రమే కాదు... ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో కూడా జియోదే హవా. 2019 మొదటి త్రైమాసికంలో ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో 30 శాతం మార్కెట్ షేర్‌తో రిలయెన్స్ జియో ఫోన్ దూసుకెళ్తోందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పెద్దదే అయినా, ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను పట్టించుకోకుండా ఉండలేం. ఎందుకంటే భారతీయ మార్కెట్‌లో వచ్చే ఐదేళ్లలో ఫీచర్ ఫోన్ వాడేవారి సంఖ్య 40 కోట్లు దాటుతుందని కౌంటర్ పాయింట్ అంచనా. "ఇండియన్ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్ షేర్ క్యూ1 2019" పేరుతో శుక్రవారం నివేదికను విడుదల చేసింది కౌంటర్‌పాయింట్.

Read this: Jio Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ జియో యాప్స్ ఉన్నాయా? ఉపయోగాలు తెలుసుకోండి

Counterpoint Research Report on Jio, JioPhone, JioPhone tops in feature phone market, JioPhone, jio phone offer, jio phone features, jio phone online booking, jio phone price, జియోఫోన్, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్, జియో ఫోన్ టాప్, ఫీచర్ ఫోన్ మార్కెట్, జియో ఫోన్ ఆఫర్, జియో ఫోన్ ఫీచర్స్, జియోఫోన్ ధర
Source: Counterpoint Research Market Monitor Q1 2019


ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో జియోఫోన్ 30 శాతంతో టాప్‌లో నిలవగా, సాంసంగ్ 15 శాతంతో రెండో స్థానంలో ఉంది. దేశీయంగా హ్యాండ్‌సెట్ తయారు చేసే లావా 13 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ మార్కెట్ గత మూడేళ్లుగా పెరుగుతోందని కౌంటర్ పాయింట్ వెల్లడించింది. ఈ సంస్థ అంచనా ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల ఫీచర్ ఫోన్లు, 2021 నాటికి 100 కోట్ల ఫీచర్ ఫోన్లు అమ్ముడుపోతాయని అంచనా.



Read this: JIO New Plans: జియో ప్లాన్స్ ధరలు తగ్గాయి... రూ.149 ప్లాన్‌తో 42 జీబీ డేటా

Counterpoint Research Report on Jio, JioPhone, JioPhone tops in feature phone market, JioPhone, jio phone offer, jio phone features, jio phone online booking, jio phone price, జియోఫోన్, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్, జియో ఫోన్ టాప్, ఫీచర్ ఫోన్ మార్కెట్, జియో ఫోన్ ఆఫర్, జియో ఫోన్ ఫీచర్స్, జియోఫోన్ ధర

ఈ సంవత్సరం సబ్‌స్క్రైబర్ మార్కెట్‌ షేర్‌లో జియో టాప్‌లో నిలుస్తుందని బ్రోకరేజీ సంస్థ CLSA టెలికామ్ సెక్టార్ 2019 ఫిబ్రవరిలో విడుదల చేసిన నివేదికలో వెల్లడించడం విశేషం. ఫిబ్రవరిలోనే 80 లక్షల జియో సబ్‌స్క్రైబర్లు కొత్తగా చేరారని అంచనా. ప్రస్తుతం జియోకు 30.6 కోట్ల కస్టమర్లు ఉండటం విశేషం.
Loading...
Photos: రెడ్‌మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...

ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...

Aadhaar Card: మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి

SBI Loans: ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న లోన్స్ ఇవే...
First published: April 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...