పీఎస్ఎల్వీ సీ46కు మొదలైన కౌంట్ డౌన్.. రేపు నింగిలోకి ఉపగ్రహం

పీఎస్ఎల్వీ సీ46కు మొదలైన కౌంట్ డౌన్.. రేపు నింగిలోకి ఉపగ్రహం

రేపు ఉదయం షార్‌ కేంద్రంలో మొదటి ప్రయోగ వేదిక నుంచి 5.30 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ46 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 615 కిలోల బరువున్న రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ మోసుకెళ్లనుందని తెలిపారు.

 • Share this:
  శ్రీహరికోటలో పీఎస్‌ఎల్వీ సీ- 46 రాకెట్‌ ప్రయోగానికి అంతా రెడీ అయ్యింద. ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకు
  కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమయిందన్నారు ఇస్రో చైర్మన్ శివన్. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నమూనా రాకెట్‌కు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్‌వీ సీ 46 ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన చెంగాళమ్మ ఆలయంలో కూడా పూజల నిర్వహించి షార్‌కు చేరుకున్నారు.

  రేపు ఉదయం షార్‌ కేంద్రంలో మొదటి ప్రయోగ వేదిక నుంచి 5.30 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ46 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 615 కిలోల బరువున్న రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ మోసుకెళ్లనుందని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై ఈ ఉపగ్రహం నిశిత దృష్టి సారించనుంది. రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. చంద్రయాన్ -2 ప్రయోగం జులైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పీఎస్ఎల్‌వీ సీ 46 ను తొలుత ఉదయం 5.27గంటలకు ప్రయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే అంతరిక్షంలో పలు శకలాలు అడ్డుపడే అవకాశముండటంతో ప్రయోగాన్ని మూడు నిమిషాలు పెంచారు.

  పీఎస్ఎల్‌వీ సీ 46 ను తొలుత ఉదయం 5.27గంటలకు ప్రయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే అంతరిక్షంలో పలు శకలాలు అడ్డుపడే అవకాశముండటంతో ప్రయోగాన్ని మూడు నిమిషాలు పెంచారు. పీఎస్ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 48వది కాగా.. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి 36వ రాకెట్ కావడం విశేషం. ఇప్పటి వరకు షార్ నుంచి 71 రాకెట్ ప్రయోగాలు జరగగా... ఈ ఏడాది ఇది మూడోది కావడం విశేషం.
  First published: