Bank OTP: ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా..? అయితే రెండు రోజులు ఆగండి.. లేకుంటే భారీ నష్టమే..

ప్రతీకాత్మకచిత్రం

OTP: మీరు ఆన్ లైన్ బ్యాంక్ (Online Transactions) , ఆధార్ (Aadhar), ఈపీఎఫ్(EPFO) లావాదేవీలు చేస్తుంటారా.. ఐతే ఓ రెండు రోజులు ఓపికపట్టండి. లేదంటే భారీగా నష్టపోతారు.

  • Share this:
    మీరు ఆన్ లైన్ బ్యాంక్, ఆధార్, ఈపీఎఫ్ లావాదేవీలు చేస్తుంటారా.. ఐతే ఓ రెండు రోజులు ఓపికపట్టండి. లేదంటే భారీగా నష్టపోతారు. బ్యాంక్ ఆన్ లైన్ లావాదేవీలు, ఇతర కార్యాకలాపాలను చేసేటప్పుడు మన ఫోన్ కు ఓటీపీ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే రెండు రోజులుగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, ఆధార్, ఈపీఎఫ్ సేవలకు సంబంధిచింన ఓటీపీ, ఎస్ఎంఎస్ మెసేజ్ సర్వీసులు చాలా చోట్ల స్తంభించిపోయాయి. ఆన్ లైన్ కొనుగోళ్ళు, టికెట్ బుకింగ్స్, మనీ ట్రాన్స్ ఫర్ ఇలా కీలక లావాదేవీల్లో ఓటీపీలే కీలకం, ఎస్బీఐ లాంటి బ్యాంకులు ఓటీపీ ద్వారానే ఏటీఎంలలో నగదు డ్రా చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఓటీపీ, ఎస్ఎంఎస్ సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులెదుర్కొంటున్నారు.

    దాదాపు 40శాతం మేర ఓటీపీ, ఎస్ఎంఎస్ సేవలు నిలిచిపోయాయి. ఈ ఇబ్బందికి ప్రధాన కారణం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త రూల్స్ అండే రెగ్యులేషన్స్ ని అందుబాటులోకి తీసుకురావడమే. ఈ నిబంధనలు తీసుకురావడం వెనుక పెద్దకారణమే ఉంది. ఇటీవల దేశంలో అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్, సైబర్ క్రైమ్ ఫోన్ కాల్స్ ఎక్కువ కావడంతో అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్-2019లో నూతన బ్లాక్ చెయైన్ టెక్నాలజీనిని అందుబాటులో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

    కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అమలు పెండింగ్ లో ఉండటంతో ఇటీవల దీనీని తప్పనిసరి చేసింది. దీంతో ప్రభుత్వం సూచించిన మార్పులను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా టెలికం సంస్థల ఎస్ఎంఎస్ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై కస్టమర్లకు ఎస్ఎంఎస్ ను పంపించే సంస్థలు, బ్యాంకులు, పేమెంట్ సంస్థలు, ఆధార్, ఈపీఎఫ్ వంటి సేవలు అందించే ప్రభుత్వ ఏజెన్సీలు కొన్ని మెసేజింగ్ టెప్లెట్లను తయారు చేయడమే కాకుండా.. ఇప్పటికే ఉన్నవాటిని అప్ డేట్ చేయాల్సి వచ్చింది.

    అలాగే కొత్త మెసేజింగ్ టెంప్లెట్లలో సూచించిన విధంగానే కస్టమర్లకు మెసేజ్ పంపాల్సి ఉంటుంది.ఇం దులో భాగంగానే మెసేజింగ్ సేవలకు బ్రేక్ పడింది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తై.. ఓటీపీ, ఎస్ఎంఎస్ సేవలు పునరుద్ధరించే అవకాశముంది. ముఖ్యమైన ఓటీపీ సేవలు నిలిచిపోయినా.. ఆతర్వాత ప్రయోజనాలే ఎక్కువ ఉంటాయని టెలికం కంపెనీలు చెప్తున్నాయి. అనవసరమైన, మోసపూరిత మెసేజ్ లు వచ్చే అవకాశాలు భవిష్యత్తులో తగ్గిపోతాయని వెల్లడించాయి.

    మోసగాళ్లతో జాగ్రత్త
    బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థల నుంచి ఓటీపీ మరియు మెసేజ్ అలర్ట్స్ నిలిచిపోవడంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశముంది. ఇంతకుముందు మన ఎకౌంట్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఏదైనా లావాదేవీ జరిగితే దీనికి సంబంధించిన ఓటీపీ గానీ, ఎస్ఎంఎస్ అలర్ట్ గానీ వస్తాయి. టెలికం కంపెనీల నూతన విధానం అప్ డేట్ అయ్యేవరకు ఎస్ఎంఎస్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే గుర్తించడం కష్టమని నిపుణలు చెప్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: