మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? అందులోని స్టిక్కర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? అయితే మీరు కొత్త స్టిక్కర్స్ చూసే ఉంటారు. కరోనా వైరస్ ప్రభావం మహమ్మారి విజృంభణతో ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్ 19 జపం చేస్తోంది. చేతులు కడుక్కోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి అంటూ ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తున్నారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, గ్రూపు సభ్యులకు జాగ్రత్తలు చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో వాట్సప్ ఒప్పందం చేసుకొని 21 స్టిక్కర్లను రూపొందించింది. వాట్సప్‌లో Together at Home పేరుతో స్టిక్కర్ ప్యాక్ కనిపిస్తుంది. వాటిని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు పంపొచ్చు. మరి ఆ స్టిక్కర్స్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
ముందుగా మీరు మీ వాట్సప్‌లో ఛాట్ విండో ఓపెన్ చేయండి.
టెక్స్ట్ బాక్స్ పక్కన ఉండే స్మైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
కొత్త విండోలో ఎమొజీ, గిఫ్ బటన్స్ పక్కన స్టిక్కర్స్ ఐకాన్ కనిపిస్తుంది.
స్టిక్కర్స్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఇప్పటికే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న స్టిక్కర్స్ లిస్ట్ కనిపిస్తుంది.
చివర్లో కనిపించే + గుర్తును క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న స్టిక్కర్ ప్యాక్‌ల వివరాలుంటాయి.
అందులో All Stickers లిస్ట్‌లో Together at Home పేరుతో స్టిక్కర్ ప్యాక్ ఉంటుంది.
ఆ స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
మీరు మళ్లీ వాట్సప్‌లో స్టిక్కర్స్ లిస్ట్‌లోకి వెళ్లి చూస్తే 21 స్టిక్కర్లు కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి:
Airtel: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఆ ఫీచర్ వచ్చేసింది
Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Technology, Whatsapp